తాడేపల్లి : మెగా డీఎస్సీ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగా చేశారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతను చంద్రబాబు మరోసారి మోసానికి గురి చేశారని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, తర్వాత టెట్ పెడుతున్నామంటూ మోసానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్‌మీట్ నిర్వహించిన మేరుగు నాగార్జున.. చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టారు. ‘ ప్రజలకు సంక్షేమం అందించాల్సిందిపోయి వార్నుంచే డబ్బులు గేసుకుంటున్నారు. దీపం పథకానికి రూ.4500 కోట్లు అవసరమైతే రూ.800 కోట్లతో సరిపెట్టారు. ఇంతేనా దీపం పథకాన్ని అమలు చేయటం?, అన్నా క్యాంటీన్‌కు ఒకసారి వెళ్తే రెండో సారి వెళ్లే పరిస్థితి లేకుండా నిర్వహణ చేస్తున్నారు. వృద్దులు, వికలాంగుల పెన్షన్లు కట్ చేసి వారి జీవితాలతో అడుకుంటున్నారు.
రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని దగా చేశారు. రైతులకు అండగా ఉంటూ రేపు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం.వ్యవసాయం దండగా అని తన పుస్తకంలో రాసుకున్న వ్యక్తి చంద్రబాబు. జగన్ హామీ ఇచ్చాడంటే దాన్ని అమలు చేసి చూపించాడు. చంద్రబాబు ఏనాడూ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి పేరుతో ఒక్క పైసా కూడా యువకులకు ఇవ్వలేదు. వాలంటీర్లను ఉద్యోగాల్లో నుండి తొలగించారు.ప్రభుత్వం అసూయ, కక్షలతో పరిపాలన చేస్తోంది. చివరికి ఐపీఎస్, ఐఏఎస్‌లను కూడా వదలకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది’అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: టార్గెట్ నాగబాబు.. లోకేష్‌కు బూమరాంగ్!
Comments
Please login to add a commentAdd a comment