ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో మొత్తం 688 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి గతంలో ఎన్నడూ లేని విధంగా టెట్, డీఎస్సీలకు ఉమ్మడిగా రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్‌టి)ల ఉమ్మడి పరీక్షకు బుధవారం నుంచి అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. జిల్లాలో మొత్తం 839 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా ప్రభుత్వం కేవలం 688 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఖాళీల్లో 151 పోస్టులకు ప్రభుత్వం కోత విధించింది.
స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండరీ గ్రేడు టీచర్లు, వ్యాయామోపాధ్యాయ పోస్టులను నోటిఫికేషన్‌లో ప్రకటించారు. స్కూలు అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్ , ఫిజికల్ ఎడ్యుకేషన్, తెలుగు గ్రేడ్-2 భాషా పండితులు ఒక్క పోస్టు కూడా ఈ డీఎస్సీలో ప్రకటించలేదు. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 3వ తేదీ నుంచి 2015 జనవరి 17వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఠీఠీఠీ.ఛీట్ఛ్చఞ.జౌఠి.జీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అభ్యర్థులు తమ వివరాలన్నింటినీ ఆ దరఖాస్తులో అప్‌లోడ్ చేయాలి.
వివరాలను అప్‌లోడ్ చేసిన అనంతరం దరఖాస్తు ప్రింటవుట్ కాపీ తీసుకొని దానికి అభ్యర్థుల విద్యార్హతలు, స్టడీ సర్టిఫికేట్లు, కులధ్రువీకరణ పత్రాలు, ఇతర అర్హతా పత్రాలను స్వయంగా సంతకాలు చేసి ప్రింటవుట్ కాపీని జతపరిచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలి. ఈ వివరాలన్నీ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ధ్రువీకరిస్తేనే ఆ విద్యార్థుల హాల్‌టికెట్లు జనరేట్ అవుతాయి. అభ్యర్థులు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించిన తర్వాత తప్పనిసరిగా ఆ ప్రింటవుట్‌ను డీఈఓ కార్యాలయంలోనే అందజేయాలి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించకుండా నేరుగా డీఈఓ కార్యాలయాల్లో స్వీకరించరు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.
మేలో రాత పరీక్షలు
ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి నిర్వహిస్తున్న టెట్, టి.ఆర్.టి. ఉమ్మడి రాతపరీక్షను 2015 మేలో నిర్వహించనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు 2015 మే 9న, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్లకు మే 10న, స్కూలు అసిస్టెంట్లు (లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్) మే 11న రాతపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రాత పరీక్షకు సంబంధించిన సిలబస్, మార్గదర్శకాలు, జిల్లాలవారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ఈ వివరాలను తెలుసుకోవచ్చు.
భారీగా దరఖాస్తులు
టి.ఆర్.టి, టెట్ ఉమ్మడి పరీక్షకు జిల్లా నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేయనున్నారు. రాష్ట్రంలో మరే ఇతర జిల్లాల్లో లేని విధంగా డీఈడీ, బీఈడీ కళాశాలలున్నాయి. జిల్లాలో మొత్తం 45 బీఈడీ కళాశాలలు, 64 డీఈడీ కళాశాలలున్నాయి. జిల్లాలో ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది అభ్యర్థులు బీఈడీ, డీఈడీ సర్టిఫికేట్లతో కళాశాల నుంచి బయటకు వస్తున్నారు. డీఎస్సీపై ఆశతో విద్యార్థులందరూ వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లోని ఖాళీల వివరాలు, డీఎస్సీకి ప్రకటించిన పోస్టులు, కుదించిన పోస్టుల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
Published Wed, Dec 3 2014 1:24 AM | Last Updated on Sat, Sep 15 2018 5:09 PM
Advertisement
Advertisement