భలే చాన్స్!
పాఠశాలలు..
మొత్తం పాఠశాలలు : 2899
ప్రాథమిక పాఠశాలలు : 1972
ప్రాథమికోన్నత. : 423
ఉన్నత పాఠశాలలు : 504
మొత్తం విద్యార్థులు : 3.12 లక్షలు
పోస్టుల వివరాలు
స్కూల్ అసిస్టెంట్లు : 155
ఎస్‌జీటీలు : 941
లాంగ్వేజ్ పండిట్ : 148
(తెలుగు: 68, హిందీ: 48, ఉర్దూ: 03, పీఈటీ: 29)
మొత్తం : 1244
త్వరలో డీఎస్సీ!
* నోటిఫికేషన్ కోసం ఎదురుచూపు
* పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు
* జిల్లాలో ఖాళీ టీచర్ పోస్టులు 1244
* విద్యాశాఖ డెరైక్టరేట్‌కు అందిన ఖాళీల వివరాలు
జోగిపేట: నిరుద్యోగులకు తీపి కబురు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిసెంబర్ నెలాఖరు లేదా జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జిల్లా నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు ఖాళీలకు సంబంధించిన వివరాలు అందజేశారు. ఇప్పటికే అవసరమైన స్కూళ్లలో 1104 విద్యా వలంటీర్లను నియమించారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యా వ్యవస్థ కుంటుపడుతోంది.
వేల సంఖ్యలో నిరుద్యోగులు
చివరిసారిగా 2012లో డీఎస్సీని ప్రభుత్వం నిర్వహించింది. మూడేళ్ల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు కావడంతో జిల్లాలో డీఈడీ కళాశాలల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఈ మూడేళ్లలో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు వేల సంఖ్యలో ఉన్నారు. వీరితో పాటు గతంలోనే కో ర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు రాక వెయిటింగ్ జాబితాలోఉన్ననిరుద్యోగులుపోటీలో ఉన్నారు.
అప్‌గ్రేడ్‌తో పోస్టులు పెరిగే చాన్స్..
ఈ ఏడాది జూలైలో విద్యాశాఖ చేపట్టిన ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో పోస్టులను సర్దుబాటు చేశారు. పాఠశాలల్లో చాలాచోట్ల విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో పోస్టులు మిగిలిపోయినట్లు సమాచారం. ఉన్నత పాఠశాలల్లో బయోసైన్స్, హిందీ, సాంఘిక శాస్త్రం, భౌతిక శాస్త్రం సబ్జెక్టులకు సీట్ల కొరత ఉంది.
అప్‌గ్రేడ్ చేసిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అంతే కాకుండా సగం శాతం వరకు ఉన్నత పాఠశాలల్లో పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌జీటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి పీడీ పోస్టులకు మార్చుకునే వీలుందని అధికారులు అంటున్నారు. డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగి పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తగ్గుతుందని భావిస్తున్నారు.
సంతోషకరం
ఇన్నేళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేయడం సంతోషకరం. అయితే పోస్టుల సంఖ్యను పెంచాలి. టెట్, డీఎస్సీని వేర్వేరుగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జాప్యం లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయాలి.
- రాజు, డీఎస్సీ అభ్యర్థి
సిలబస్‌పై స్పష్టత ఇవ్వాలి
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించడం సంతోషకరం. అయితే ఇప్పటి వరకు సిలబస్‌పై స్పష్టత ఇవ్వలేదు. ఏం చదువుకోవాలనేది తెలియని పరిస్థితి. గ్రూప్స్ సిలబస్ ప్రకటించినట్లుగా డీఎస్సీకి సంబంధించి కూడా సిలబస్ ప్రకటించాలి.
- కవిత, డీఎస్సీ అభ్యర్థి