
సాక్షి, విజయవాడ : డిసెంబర్ 24 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తొలి విడతలో స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. రెండో విడత జనవరి 18 నుంచి ఎస్‌జీటీ పరీక్షలు జరుపుతామని పేర్కొన్నారు. తొలి విడత పరీక్షలకు 2,43,185 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. డీఎస్సీ కోసం 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.