SGT
-
నేటినుంచే డీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) గురువారం నుంచి మొదలు కానుంది. వచ్చే నెల 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. అయితే మధ్యలో 6 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2,79,957 మంది దరఖాస్తు చేశారు. దర ఖాస్తు గడువు పొడిగించడంతో ఇటీవల టెట్ అర్హత పొందిన 48 వేల మంది కూడా వీరిలో ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షకు 1.60 లక్షల మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ (ఎస్జీటీ) పోస్టుల కోసం 80 వేల మంది దరఖాస్తు చేశారు. మిగతా వారిలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులున్నారు. తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ (ఆన్లైన్)గా జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా..ఒక్క గ్రేటర్ హైదరాబా ద్ పరిధిలోనే 27 కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బయో మెట్రిక్ హాజరు: అభ్యర్థులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి రోజూ రెండు షిఫ్టులుగా పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ ఒక విడత, సాయంత్రం 2 నుంచి 4.30 గంటల వరకు మరో విడత ఉంటుంది. జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో పరీక్ష ఉండదు. ఎస్ఏ పరీక్షను జూలై 18, 20, 22, 24, 25, 30, 31, ఆగస్టు 1, 2 తేదీల్లో చేపడతారు. పీఈటీ పరీక్షను జూలై 18, 26 తేదీల్లో నిర్వహిస్తున్నారు. భాషా పండితులకు జూలై 26, ఆగస్టు 2, 5 తేదీల్లో డీఎస్సీ ఉంటుంది. పీఈటీలకు ఆగస్టు 5న, ఎస్జీటీలకు జూలై 19, 22, 23, 26, ఆగస్టు 1వ తేదీన పరీక్ష ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్‌కు జూలై 20న నిర్వహిస్తారు. ఆరేళ్ల తర్వాత..: ఉమ్మడి రాష్ట్రంలో 2012 ఆగస్టు 27, 28, 29 తేదీల్లో డీఎస్సీ నిర్వహించారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు టీచర్స్ రిక్రూట్మెంట్ (టీఆర్టీ) పేరుతో జరిగింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ డీఎస్సీ జరుగుతోంది. దీంతో నిరుద్యోగులు ఈ పోస్టులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి 2023లో 5 వేల పోస్టులకు డీఎస్సీ నిర్వహించాలనుకున్నా వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. వివాదాల మధ్య..: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేస్తారని భావించినా కేవలం 11,062 పోస్టులకే డీఎస్సీ నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర్నుంచీ రకరకాల వివాదాలు చుట్టుముట్టాయి. ఖాళీలన్నీ డీఎస్సీలో చేర్చాలని నిరుద్యోగులు పట్టుబట్టారు. ఆ తర్వాత టెట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డీఎస్సీ నిర్వహణకు మరికొంత సమయం ఇవ్వాలన్న డిమాండ్ తెరమీదకొచ్చింది. టెట్, డీఎస్సీ సిలబస్ వేరని, ఇప్పటికిప్పుడు పరీక్ష చేపడితే సన్నద్ధత కష్టమని కొత్తగా టెట్ ఉత్తీర్ణులైనవారు ఆందోళనకు దిగారు. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ సమయంలో కూడా డీఎస్సీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ 20 శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదు. వీరిలో కోర్టును ఆశ్రయించిన వాళ్ళు కూడా ఉన్నారు. న్యాయస్థానం చివరి నిమిషంలో తమకు అనుకూలంగా ఆదేశాలు ఇస్తుందనే ఆశతో వీరు ఉన్నారు. అయితే డీఎస్సీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం గురువారం నుంచి పరీక్ష నిర్వహణకు సిద్ధమైంది. -
ఎస్జీటీలుగా 2008–డీఎస్సీ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2008 అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించే అంశాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నాటి డీఎస్సీ మెరిట్ జాబితా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ సమస్యకు ఏపీ సర్కార్ కొంత ఉపశమన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడింది. అయితే తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. 2008– డీఎస్సీ నోటిఫికేషన్లో తమ కంటే తక్కువ అర్హత ఉన్న డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం ఎస్జీటీ పోస్టులను రిజర్వు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఎడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఒకే రకమైన పోస్టులకు అర్హత ఎక్కువున్న వారిని కాదని.. తక్కువ ఉన్న వారిని నియమించడం చట్టప్రకారం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు చేసేటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)కు లోబడి క్లాసిఫికేషన్ చేయాలిగానీ.. ఇష్టం వచ్చి నట్లు నిర్ణయం తీసుకోవడం చెల్లదు. ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ–2008 బీఎడ్ అభ్యర్థుల విషయంలో ఆ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. వారికి 60 ఏళ్లు వచ్చే వరకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో కొనసాగిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కారణంగానే వివాదం ఏళ్లుగా కొనసాగుతోంది. కనీసం ఖాళీగా ఉన్న పోస్టుల్లో నాటి బీఎడ్ అభ్యర్థులను నియమిస్తే అందరికీ ఉపశమనం లభిస్తుంది’అని పేర్కొ న్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది గోవింద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వం సంక్షేమ రాష్ట్రం. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. ఇందులో భాగంగానే మానవతా ధృక్పథంతో అలోచించి అర్హులైన డీఎస్సీ 2008 అభ్యర్థులను కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించింది’అని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. బీఎడ్ అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించే అంశాన్ని పునః పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. -
ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు చేపట్టింది విద్యాశాఖ. 56, 829 మంది టీచర్లను బదిలీ చేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో టీచర్ల బదిలీలు చేపట్టింది. ఉద్యోగుల సీనియారిటీ, మెరిట్ ఆధారంగా టీచర్ల బదిలీల నిర్వహణ చేపట్టింది. ఉమ్మడి 13 జిల్లాల్లోనూ బదిలీ ప్రక్రియ షురూ చేసింది ఏపీ విద్యాశాఖ. -
AP: ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త..
సాక్షి, అమరావతి: మండలానికి ఒక బాలికల జూనియర్ కాలేజీ అనే మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు దాదాపు 7 వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా నియమించనుంది. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్ (జూనియర్ కాలేజీ స్థాయి) స్థాయికి పెంచుతూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), జూనియర్ కళాశాలలు లేనిచోట ‘ప్లస్’ స్కూళ్లను గుర్తించి బాలికలకు ఇంటర్మీడియెట్ విద్యాబోధన ప్రారంభించింది. ఈ క్రమంలో 2022–23 విద్యా సంవత్సరంలో 177 ప్లస్ హైస్కూల్స్‌లో ప్రవేశాలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన 115 ‘ప్లస్’ స్కూళ్లలోనూ ఇంటర్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అన్నిచోట్లా పూర్తి స్థాయి బోధన సిబ్బందిని నియమించే ప్రక్రియను చేపట్టింది. చదవండి: సమస్యలు తీర్చే 'సేవకులం' 7 వేల ఎస్జీటీలు.. 1,752 ఎస్‌ఏలకు అవకాశం 2023–24 విద్యా సంవత్సరంలో జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం హైస్కూల్ ప్లస్ స్థాయిలో ఇంటర్ తరగతుల బోధనకు 1,752 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు అవసరముంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సేవలందిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల(ఎస్ఏ)లో సీనియారిటీతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) అర్హతలున్నవారిని హైస్కూల్ ప్లస్‌లో నియమించనున్నారు. ఇంతకాలం పాఠశాల స్థాయి బోధనలో ఉన్నవారు కాలేజీ స్థాయిలో బోధనకు ఎంత వరకు అనువుగా ఉన్నారో ఇంటర్ బోర్డు ద్వారా పరీక్షించనున్నారు. అనంతరం ఎంపికైన 1,752 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇచ్చి జూనియర్ కాలేజీల్లో బోధనకు నియమించనున్నారు. కాగా, దాదాపు 6 వేల నుంచి 7 వేల మంది ఎస్జీటీలకు పదోన్నతిని సైతం ప్రభుత్వం కల్పించనుంది. వీరిని హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు నిపుణులుగా నియమించనుంది. పదోన్నతులు, పోస్టుల భర్తీ ప్రక్రియను మే నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. చదవండి: సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన -
టీచర్ల బదిలీల దరఖాస్తుకు మరికొంత గడువు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. వాస్తవానికి ఈ గడువు సోమవారంతో ముగిసింది. అయితే ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 1వ తేదీ వరకు గడువును పెంచారు. షెడ్యూల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. టీచర్లు దరఖాస్తు చేసిన తర్వాత హెచ్ఎంలు.. వాటిని డీఈ వోలకు సమర్పించే మూడు రోజుల కాలపరిమితిని కుదించనున్నారు. ఈ నెల 28 నుంచి బదిలీల ప్రక్రియ మొదలైనా, తొలి రోజు పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇబ్బందుల వల్ల టీచర్లు తికమక పడ్డారు. కొన్ని ఆప్షన్లు తెరుచుకోలేదు. మరికొన్ని అప్‌గ్రేడ్ కాలేదు. మారు మూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలూ ఎదురైనట్టు వార్త లు వచ్చాయి. దీంతో దరఖాస్తు గడువును పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఇప్పటికి 55 వేల మంది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 55,479 మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువగా నల్లగొండ (3,423), రంగారెడ్డి (3,034), నిజామాబాద్ (3,247), సంగారెడ్డి (3,042) దరఖాస్తులు అందినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అత్యల్పంగా దరఖాస్తులు అందిన జిల్లాల్లో హనుమకొండ (635), జయశంకర్ భూపాలపల్లి (500), ములుగు (379) ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో 20 వేల వరకూ అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు, సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్జీటీ స్పౌజ్‌ల సంగతి ఆఖరునే వివిధ జిల్లాల్లో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ దంపతుల (ఎస్జీటీ స్పౌజ్‌లు) బదిలీ విషయాన్ని ఆఖరులో పరిశీలించే వీలుందని అధికారులు చెబుతున్నారు. 317 జీవో కారణంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన టీచర్లు రెండు వేలకు పైగా ఉన్నారు. వీరిలో 615 మంది స్కూల్ అసిస్టెంట్ల బదిలీకి అవకాశం కల్పించారు. కాగా, హెచ్ఎంల పదోన్నతి, స్కూల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఎస్జీటీల బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అవసరమైతే డిప్యూటేషన్ ఇచ్చైనా సరే వారి ప్రాంతాలకు పంపాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. -
తెలంగాణ విద్యాశాఖ తీరు వివాదాస్పదం.. ఓటు హక్కు లేదని వివక్ష.. !
సాక్షి, హైదరాబాద్: స్పౌజ్‌లుగా ఉన్న ఎస్జీటీల విషయంలో విద్యాశాఖ అనుసరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్కూల్ అసిస్టెంట్లకు ఓటు హక్కు ఉండబట్టే వారికి అవకాశం ఇచ్చారని, తమకు లేదంటూ వివక్ష చూపుతున్నారని ఎస్జీటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 317 జీవో కారణంగా జరిగిన బదిలీల్లో భార్యాభర్తలను వేర్వేరు ప్రాంతాలకు పంపారు. దీనిపై ఏడాదిగా పోరాటాలు నడుస్తున్నాయి. తాజాగా జరుగుతున్న బదిలీల్లో స్కూల్ అసిస్టెంట్స్ 615 మందికి సొంత జిల్లాలకు వెళ్ళేందుకు అనుమతించారు. కానీ 1,585 మంది ఎస్జీటీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారిలో నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు వినాలని వారు కోరుతున్నారు. మా ఇద్దరి మధ్య 250 కి.మీ. దూరం నేను మహబూబాబాద్‌లో, నా భర్త సిద్దిపేటలో పనిచేస్తున్నాం. ఇద్దరు పనిచేసే ప్రాంతాల మధ్య దూరం 250 కిలోమీటర్లు. దీంతో ఇద్దరు పిల్లలను చెరొకరం పంచుకున్నాం. తీవ్రమైన మానసిక వ్యథతో 13 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నాం. తల్లిగా ఓడిపోతున్నాను. భర్తకు దూరమవుతున్నాను. ఈ బదిలీల్లోనైనా న్యాయం జరుగుతుందనే ఆశ కన్పించడం లేదు. – ఎస్.మమత (ఎస్జీటీ, మహబూబాబాద్) -
టీచర్లకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లకు విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, అమరావతి: పునాది స్థాయి నుంచే అత్యుత్తమ ప్రమాణాలతో నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టి 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అందుబాటులోకి తెస్తోంది. 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం 8 వేలకుపైగా పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనుంది. 3వ తరగతి నుంచి 7 లేదా 8వ తరగతి వరకు ఉండే ప్రీహైస్కూళ్లలో విద్యార్థులు నిర్ణీత సంఖ్యకు మించి ఉంటే వాటిలోనూ సబ్జెక్టు టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు. ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల నియామకం కోసం 1,000 వరకు ఎస్ఏ పోస్టులను గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఎస్‌ఏలకు వీటిలో పదోన్నతి కల్పిస్తారు. ఈమేరకు పదోన్నతుల విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ మువ్వా రామలింగం శుక్రవారం సర్క్యులర్ రూపంలో విడుదల చేశారు. + 10లోగా సీనియార్టీ జాబితాలు.. ఎస్ఏ, గ్రేడ్–2 హెడ్మాస్టర్ పోస్టులలో పదోన్నతులకు సంబంధించి జిల్లాలవారీగా సీనియార్టీ జాబితాలను ఈనెల 10వ తేదీలోగా రూపొందించాలని రీజినల్ జాయింట్ డైరక్టర్లు, జిల్లా విద్యాధికారులకు సూచించారు. ఇప్పటివరకు రకరకాలుగా అన్వయించి పదోన్నతులు చేపట్టడం న్యాయ వివాదాలకు దారి తీసినందున ఏకరూప నిబంధనలను అనుసరించాలని స్పష్టం చేస్తూ సర్క్యులర్‌లో పొందుపరిచారు. ఎస్ఏ, హెడ్మాస్టర్ పోస్టులకు సంబంధించి నిబంధనలున్నాయని, అలాగే కొన్ని వర్గాలకు ఇతర అర్హతలను పరిగణలోకి తీసుకొని పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను అనుసరించి పదోన్నతులు కల్పించాలని స్పష్టం చేశారు. – ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు జోన్, జిల్లాల ప్రాతిపదికన స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీని గుర్తించేటప్పుడు ఏపీఎస్‌ఎస్‌ఎస్–1996లోని 33, 34 నిబంధనలను అనుసరించాలి. – పదోన్నతులలో ఏపీ సబార్డినేట్ సర్వీస్ నిబంధన రూల్ 22 పాటించాలి. – టీచర్ల సీనియార్టీకి పోస్టులో చేరిన తేదీని పరిగణలోకి తీసుకోవడంతో పాటు క్రమబద్ధీకరణ లేదా ప్రొబేషన్ పీరియడ్ ఆమోదం ఆధారంగా చేపట్టాలి. – ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతి కోసం కేటాయించాలి. వీటిలో మూడింట ఒక వంతు పోస్టులు డైరెక్ట్ ›రిక్రూట్మెంటు కోసం మినహాయించాలి. – ప్రమోషన్ ఉత్తర్వులు అందిన తేదీ నుంచి 15 రోజుల్లోగా కొత్త పోస్టులో చేరాలి. – గతంలో పదోన్నతి వదులుకున్న టీచర్లు జీవో 145 నిబంధనల ప్రకారం పదోన్నతులకు పరిగణిస్తారు. – కొత్త జిల్లాల ప్రాతిపదికన కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికన సీనియార్టీ జాబితాలు రూపొందించాలి. ఆగస్టు 10వ తేదీలోగా దీన్ని పూర్తి చేయాలి. ఇది కూడా చదవండి: రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరాలి.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచుదాం: సీఎం జగన్ -
బీఈడీ అభ్యర్థులకూ పేపర్–1 అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో తీసుకొచ్చిన మార్పులు తమకు నష్టం చేస్తాయని డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో పోటీ తీవ్రంగా ఉంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారు. డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ పేపర్–1 రాస్తారు. వీరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు (ఎస్జీటీ) అర్హులవుతారు. బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సాధారణంగా పేపర్–2 రాస్తారు. వీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు బీఈడీ అభ్యర్థులు కూడా పేపర్–2తో పాటు, పేపర్–1 కూడా రాసే అవకాశం కల్పించారు. దీంతో వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే కాకుండా, ఎస్జీటీ పోస్టులకూ పోటీ పడే వీలుంది. దీంతో తమకు అవకాశాలు తగ్గుతాయని డీఎడ్ అభ్యర్థులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపడితే.. 6,500 ఎస్జీటీ, 3 వేలపైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. డీఎడ్ నాణ్యతపైనే సందేహాలు... వాస్తవానికి కొన్నేళ్లుగా డీఎడ్ కాలేజీల్లో ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆ అభ్యర్థులు చెబుతున్నారు. సరైన ఆదరణ లేక ప్రైవేటు కాలేజీలు పెద్దగా దృష్టి పెట్టలేదంటున్నారు. నిజానికి ఐదేళ్లుగా రాష్ట్రంలో సగం డీఎడ్ కాలేజీలు మూతపడ్డాయి. 2016–17లో రాష్ట్రంలో 212 డీఎడ్ కాలేజీలుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. గతేడాది వంద కాలేజీల్లో 6,250 సీట్లకు గానూ 2,828 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలు సరైన ఫ్యాకల్టీని నియమించడం లేదనే ఆరోపణలున్నాయి. మారుతున్న బోధనా విధానాలు, విద్యార్థుల సైకాలజీ తెలుసుకుని బోధించే మెళకువలు, ప్రాజెక్టు వర్క్‌లు అసలే ఉండటం లేదని డీఎడ్ అభ్యర్థులు అంటున్నారు. మాకు అన్యాయమే... ఉపాధ్యాయ పోస్టుకు బీఈడీ అభ్యర్థులతో సమానంగా మేమెలా పోటీపడగలం. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ వారికే పరిమితం చేస్తే బాగుండేది. చిన్న తరగతులకు బోధించే విధానాలే డీఎడ్‌లో ఉంటాయి. పెద్ద తరగతులకు బీఈడీ సరిపోతుంది. బీఈడీ అభ్యర్థులు తేలికగా మా స్థాయి పోస్టులు సాధిస్తే, మాకు అన్యాయం జరుగుతుంది. – ప్రవీణ్ కుమార్ (డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థి) వారితో పోటీ సరికాదు... బీఈడీ, డీఎడ్ బోధనా విధానంలో చాలా మార్పులున్నాయి. కాలేజీలు కూడా డీఎడ్‌కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం లేదు. ప్రయోగాత్మక బోధనా పద్ధతులపై దృష్టి పెట్టడం లేదు. ఇవన్నీ డీఎడ్ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించే అంశాలు. ఈ నేపథ్యంలో మా స్థాయి పోస్టులకు బీఈడీ వారినీ పోటీకి తేవడం సరికాదు. – సంజీవ్ వర్థన్ (టెట్‌కు దరఖాస్తు చేసిన డీఎడ్ అభ్యర్థి) -
317 జీవోపై ఆగని పోరు
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: జోనల్ విధానం అమలు కోసం ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోపై ఉపాధ్యాయుల వ్యతిరేకత రోజురోజుకూ పెరగుతోంది. పలు సంఘాలు సోమవారం వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలిపాయి. సీనియారిటీ ప్రాతిపదికగా కేటాయింపులు చేయడం, భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే ఆప్షన్లను పరిగణలోనికి తీసుకోకపోవడంపై టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలకు కేటాయించినా ఆ జిల్లాల్లో పట్టణ ప్రాంతాలకు సమీపంలోని స్కూళ్లను బ్లాక్ చేశారని, దీంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పలువురు నేతల వద్ద వాపోయారు. జీవోకు వ్య తిరేకంగా ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని యూటీ ఎఫ్ సహా పలు సంఘాలు నిర్ణయించాయి. టీచర్ల అరెస్ట్: సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం నేతలు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం నేతృత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు ప్రయత్నించారు. దీంతో ఎస్జీటీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను సంఘం నేతలు కలిసి 317 జీవో వల్ల తమకు కలిగే అసౌకర్యాన్ని వివరించారు. ఇదెక్కడి అన్యాయం?: బాధిత ఉద్యోగులు 317 జీవో అమలులో స్పౌజ్ కేసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. వేర్వేరుగా బదిలీ అయిన భార్యాభర్తల ఉద్యోగులు తమ ఆందోళనను మీడియాకు వివరించారు. 33 జిల్లాల్లో కేవలం 19 జిల్లాల్లోనే భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టులు ఇచ్చారని, 13 జిల్లాల్లో పోస్టులు బ్లాక్ చేసి, భార్యభర్తలను వేర్వేరు ప్రాంతాలకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. భారీ పోలీసు బందోబస్తు: 13 జిల్లాల స్పౌజ్ బాధితులు సుమారు 150 మందికి పైగా ప్రెస్‌క్లబ్‌కు రావడంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో వీళ్లంతా ప్రెస్‌క్లబ్ నుండి ప్రగతిభవన్ వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు. 8 నెలల బాబుతో ఎలా ఉండాలి? నాకు యాదాద్రి జిల్లాకు బదిలీ అవగా నా భర్త అనిల్‌కు రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. 250 కిలోమీటర్ల దూరం. నాకు 8 నెలల బాబు ఉన్నాడు. చిన్న పిల్లాడితో భర్త ఒకచోట, నేను ఒకచోట ఎలా ఉంటాం? – సుమ చాలా ఇబ్బంది పడుతున్నాం నేను పదేళ్లుగా గద్వాల జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్నా. నాకు అదే గద్వాలకు పోస్టింగ్ ఇచ్చి నా భర్తకు రంగారెడ్డి జిల్లాకు ఇచ్చారు. ఇద్దరు అమ్మయిలు వారానికోసారి ఇంటికి వచ్చి వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణం చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. అత్తమామను చూసుకోలేకపోతున్నాం. – భార్యాభర్తలు పద్మ, శంకర్ -
Telangana: బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్ల క్రితం వరకూ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) సీటు కోసం విపరీతమైన పోటీ ఉండేది. కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్లి మరీ డీఎడ్ తత్సమానమైన కోర్సులు చేసేవాళ్లు. డీఎడ్ చేస్తే ఉపాధ్యాయ పోస్టు (ఎస్జీటీ) గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కువ సీట్లు ఉంటున్నాయి.. చేరే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో డీఎడ్ కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లలో 112 కాలేజీలు మూతపడ్డాయంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. ఇదే ట్రెండ్ కొనసాగితే డీఎడ్ కోర్సు ఉండే అవకాశమే లేదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. డీఎడ్ నాణ్యత పెంచడంతోపాటు, కోర్సు చేస్తే ఉపాధి వస్తుందనే భరోసా ఉండాలంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ సంఖ్య పెంచడంతోపాటు, ప్రైవేటు స్కూళ్లలోనూ ఈ అర్హత ఆధారంగా ఉద్యోగాలు దక్కినప్పుడే ఈ కోర్సు ఆశాజనకంగా ఉంటుందని చెబుతున్నారు. మూతపడుతున్న కాలేజీలు ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016–17లో రాష్ట్రంలో 212 డీఎడ్ కాలేజీలున్నాయి. ఇందులో పది ప్రభుత్వ అధీనంలోనివి. మిగతావి ప్రైవేటులో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డీఎడ్ కాలేజీలు వందకు పడిపోయాయి. మరిన్ని మూసివేతకు సిద్ధమవుతున్నాయి. కోర్సుల్లో చేరే వాళ్లూ తగ్గుతు న్నారు. 2017–18లో 11,500 సీట్లుంటే, 7,650 మందే చేరారు. 2020–21 నాటికి ఈ సంఖ్య ఇంకా పడిపోయింది. 6,250 సీట్లున్నా 2,828 మందే చేరారు. కొన్ని కాలే జీల్లో 20 మంది కూడా చేరలేదు. కారణాలేంటి? యాజమాన్య కోటా కింద ప్రతీ కాలేజీకి పది సీట్లుంటాయి. కన్వీనర్ కోటా కిందే భర్తీ కానప్పుడు యాజమాన్య కోటా కింద చేరే ప్రసక్తే ఉండదు. కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం ఏటా రూ.11 వేల ఫీజు రీయింబర్స్మెంట్ కింద, రూ. 1,500 ఇతర ఖర్చుల కింద కాలేజీలకు ఇస్తుంది. ఇవి సమయానికి అందడం లేదని, దీంతో కాలేజీల నిర్వహణ కష్టమవుతోందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అధ్యాపకులకు వేతనాలు చెల్లించడమే కష్టంగా ఉందని అంటున్నాయి. దీనికితోడు బీఎడ్ చేసిన వారికే ఉపాధి కష్టంగా ఉందని, డీఎడ్ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. పైగా కరోనా తర్వాత ప్రైవేటు స్కూళ్లు ఉపాధ్యాయులకు వేతనాలు అరకొరగా చెల్లిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ టీచర్ల నియామకం జరగలేదు. ఈ కోర్సు పట్ల విద్యార్థుల్లో ఆసక్తి సన్నగిల్లుతోందని నిపుణులు అంటున్నారు. -
ఈ టీచర్లకు 30 శాతం పీఆర్సీ వర్తించదా?
సాక్షి, హైదరాబాద్: తాజా పీఆర్సీలో రాష్ట్రంలో 2017 టీఆర్టీ ద్వారా కొత్తగా నియమితులైన టీచర్లకు భారీ నష్టం వాటిల్లనుంది. కిందిస్థాయి పోస్టు లో ఉండి, ఎస్ఏ పోస్టులకు ఎంపికైన టీచర్లకు పే ప్రొటెక్షన్ లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లనుండగా, నియామకాల్లో జాప్యం కారణంగా కొత్త పీఆర్సీ ద్వారా లభించాల్సిన ప్రయోజనాలు ఎక్కు వ మందికి దక్కకుండాపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా 8,792 మంది టీచర్లకు నష్టం వాటిల్లనుండటంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి పే ప్రొటెక్షన్ లేక నష్టం రాష్ట్రంలో 2017 టీఆర్టీ ద్వారా ప్రభుత్వం 1,941 ఎస్ఏ పోస్టులను భర్తీ చేసింది. అందులో దాదాపు వెయ్యి పోస్టులకు ప్రస్తుతం స్కూళ్లలో ఎస్జీటీలుగా, భాషా పండితులుగా (ఎల్పీ) పని చేస్తున్నవారే ఎంపికయ్యారు. మిగతా పోస్టుల్లో కొత్తవారు ఎంపికయ్యారు. ఇలా ఎస్ఏ పోస్టులకు ఎంపికైన వారిలో కొందరికి పలు కారణాలతో 2019లో నియామక పత్రాలు అందజేయగా, మరికొందరికి 2020లో నియామక పత్రాలు అందజేశారు. ఇంకొందరికైతే 15 రోజుల కిందటే అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేశారు. వారిలో 95 శాతం మంది పంచాయతీరాజ్ టీచర్లే ఉన్నారు. అయితే వారికి ఇప్పుడు కొత్త పీఆర్సీ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలోని కనీస మూల వేతనంతోనే వేతనాలను చెల్లించనున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదేని ఉన్నత స్థాయి పోస్టుకు ఎంపికైనప్పుడు వారికి అంతకుముందు ఉద్యోగంలో వచ్చిన వేతనాన్ని కాపాడుతూ (పే ప్రొటెక్షన్ ఇస్తూ) ఉత్తర్వులిచ్చి కొత్త వేతనం ఖరారు చేస్తారు. అంతకుముందు వచ్చిన కనీస మూల వేతనానికి పీఆర్సీ అమలుతేదీ నాటికి ఉన్న డీఏ, ఫిట్‌మెంట్‌ను కలిపి కొత్త పోస్టులో కనీస మూల వేతనాన్ని ఖరారు చేస్తారు. కానీ ఇప్పుడు నియమితులైన పంచాయతీరాజ్ టీచర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. వాస్తవానికి 2013 డిసెంబర్ తరువాత ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.10 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని, సర్వీస్ మొత్తం లెక్కిస్తే నష్టం లక్షల్లో ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. నియామకాల్లో ఆలస్యంతో ఎక్కువ మందికి... 2017 టీఆర్టీ ద్వారా ఎస్జీటీ, ఎల్పీ, ఎస్ఏ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ)గా నియమితులైన 7,792 మంది టీచర్లకు తాజా పీఆర్సీలో ప్రకటించిన వేతన స్థిరీకరణలో కీలకమైన 30 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ అందని దుస్థితి ఏర్పడింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన 2017 టీఆర్టీ నియామకాలను 2019 నుంచి 2021 వరకు సాగదీయడమే ఇందుకు కారణం. తాజా పీఆర్సీ ఇప్పుడు ప్రకటించినా 2018 జూలై 1 నుంచే అమల్లోకి రానుంది. కాబట్టి అప్పటివరకు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రమే 30 శాతం ఫిట్మెంట్ ప్రయోజనం కలుగుతుంది. ఆ తర్వాత నియామకమైన వారికి నియమితులైన రోజు నుంచి లెక్కించి తాజా పీఆర్సీలో మినిమమ్ బేసిక్‌తో వేతనం ఖరారు చేసి, కరెస్పాండింగ్ పేస్కేల్ ఇస్తారు. ఒకవేళ వారు అంతకుముందే నియమితులై ఉంటే వారికి అప్పుడు ఉన్న ఇంక్రిమెంట్‌తో కూడిన మూల వేతనంపై 30.392 శాతం డీఏ, 30 శాతం ఫిట్మెంట్ వచ్చేది. కానీ వారు 2018 జూలై 1 నాటికి నియమితులు కాలేదు కాబట్టి ఇప్పుడు వారికి 30 శాతం ఫిట్మెంట్ వర్తించదు. పైగా ఇప్పుడు రూపొందించిన మాస్టర్ స్కేల్ ప్రస్తుతం ఉన్న 30 శాతం ఫిట్మెంట్తో కాకుండా 15 శాతం ఫిట్మెంట్తోనే రూపొందించినందున వారికి రెండు రకాలుగా కలిపి నెలకు ఐదారు వేల రూపాయల నష్టం వాటిల్లుతుందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ–2017) ద్వారా నియమితులైన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)కు తాజా పీఆర్సీతో ఇప్పుడు రూ.31,040 కనీస మూల వేతనం రానుంది. అదే టీచర్ 2018 జూలై 1కి ముందు నియమితులై ఉంటే పాత స్కేల్‌పై 30 శాతం ఫిట్మెంట్ కలసి రూ.34,690 కనీస మూల వేతనం వచ్చేది. అలాగే అదే టీఆర్టీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా (ఎస్ఏ) నియమితులైన వారికి ఇప్పుడు రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. ఈ టీచర్ కూడా ముందే నియమితులై ఉంటే 30 శాతం ఫిట్మెంట్ కలసి రూ.47,240 వచ్చేది. 2017 టీఆర్టీ అయినప్పటికీ నియామకాల్లో ఆలస్యం కావడం వల్ల ఫిట్మెంట్ వర్తించకపోవడంతో ఒక్కో టీచర్ నెలకు నాలుగైదు వేలు నష్టపోనున్నారు. ఒక అభ్యర్థి 2008లో ఎస్జీటీగా ఎంపికయ్యారు. 2018 జూలై 1నాటికి ఆయన కనీస మూల వేతనం రూ. 31,460. ఆయన 2017 టీఆర్టీ ద్వారా ఎస్‌ఏగా ఎంపికయ్యారు. ఆయనకు ఇప్పుడు ఎస్ఏ పోస్టులో రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. అయితే పే ప్రొటెక్షన్ ఉంటే 2018 జూలై 1 నాటికి ఉన్న కనీస మూల వేతనంపై 30.392 కరువు భత్యం (డీఏ), 30 శాతం ఫిట్మెంట్ కలిపి రూ.51,320 కనీస మూల వేతనంగా వచ్చేది. అది లేకపోవడం వల్ల ఇంక్రిమెంటు కలుపుకొని నెలకు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లనుంది. న్యాయం చేయాల్సిందే టీఆర్టీ–2017లో భాగంగా రాత పరీక్ష, ఇతరత్రా నియామకాల ప్రక్రియ 2018 జూలై 1 నాటికి పూర్తయ్యింది. అయితే పోస్టింగ్‌లు ఇవ్వడంలో ఆలస్యం అయ్యింది. అందువల్ల వారికి 30 శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేసి న్యాయం చేయాలి. అలాగే పైస్థాయి పోస్టులకు ఎంపికైన టీచర్ల కోసం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలి. లేకపోతే వారు తీవ్రంగా నష్టపోతారు. – మానేటి ప్రతాప్‌రెడ్డి,టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చదవండి: ఉచిత నీటి పథకానికి తిప్పలెన్నో.. -
ఏపీవోపై చర్యలు తీసుకోండి!
సాక్షి, ఒంగోలు : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఆళ్ల శేషయ్యను ఆ పోస్టు నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. బుధవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దశాబ్ద కాలంగా శేషయ్య అనే ఉపాధ్యాయుడు బోధనేతర కార్యక్రమంలో అక్రమంగా కొనసాగుతున్నారన్నారు. గతంలో తర్లుపాడులో ఎస్జీటీగా పనిచేస్తూ పాఠశాలకు హాజరు కాకుండా కార్యాలయానికి హాజరవుతుండేవారన్నారు. పదేళ్ల నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ ఉపాధ్యాయుల పదోన్నతుల జాబితా నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసి కౌన్సిలింగ్‌కు పది నిమిషాల ముందు డీఈవోకు అందజేస్తారన్నారు. మెరిట్ కం రోస్టర్ విధానంలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు తయారు చేయల్సి ఉండగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులకు మేలుచేసే విధంగా రూపొందించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. జీవోలను వక్రీకరిస్తూ, అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్నుత్న ఏపీవోపై ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. డీఈవోను కలిసిన వారిలో బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్రె వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిరాల శరత్చంద్రబాబు, జిల్లా గౌరవాధ్యక్షుడు పేరాబత్తిన జాలరామయ్య, జిల్లా కార్యదర్శి పాలేటి సువర్ణబాబు, నాయకుడు పల్లె కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
కొత్త టీచర్లు వస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 30న కొత్త టీచర్లు రాబోతున్నారు. విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా 3,325 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైన అభ్య ర్థుల జిల్లాల వారీ జాబితాలు విద్యాశాఖకు అందాయి. దీంతో వారికి పోస్టింగ్‌లు ఇచ్చేం దుకు విద్యాశాఖ సోమవారం కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసింది. ఈనెల 23 నుంచి పోస్టింగ్‌ల ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాత పది జిల్లాల ప్రాతిపదికన పోస్టింగ్‌ల ప్రక్రియ నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఈనెల 29లోగా పూర్తి చేయనున్నారు. 3,786 ఎస్జీటీ పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్ జారీ చేయగా.. 2018లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించారు. అయితే, పోస్టింగులు ఇచ్చే సమయంలో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఎట్టకేలకు కోర్టు ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ అన్ని చర్యలు చేపట్టి, ఎస్జీటీ తెలుగు మీడియం టీచర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. త్వరలోనే మరో 910 ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం స్థానికత ఖరారు కాని ఏజెన్సీ పోస్టులు, వికలాంగుల మెడికల్ రిపోర్టు లు అందనివి, కోర్టు వివాదాల్లో ఉన్న 461 పోస్టులు మినహా మిగతా 3,325 మంది అభ్యర్థులకు పోస్టింగ్ పత్రాలను విద్యాశాఖ ఆధ్వ ర్యంలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే జిల్లా స్థాయి కమిటీలు జారీ చేయనున్నాయి. ఇదీ షెఢ్యూల్.. ►23–10–2019: ఆయా జిల్లాల్లో పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలు నోటీసు బోర్డులో ప్రదర్శించడంతోపాటు వెబ్సైట్లోనూ పొందుపరుస్తారు. డీఈవోల నేతృత్వంలో ఖాళీలను గుర్తిస్తా రు. కౌన్సెలింగ్ నిర్వహణ కేంద్రం ప్రకటిస్తారు. ►24–10–2019: జిల్లాల్లో ఎస్జీటీ ఖాళీలను ఖరా రు చేసి వివరాలను నోటీసు బోర్డులో, వెబ్సైట్లో ఉంచుతారు. కమిటీ ఖరారు చేసిన పాఠశాల వారీ ఖాళీలు, ప్రాంతం, కేటగిరీ, ఎన్రోల్మెంట్ పనిచేస్తున్న టీచర్లు, ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆమోదానికి పంపిస్తారు. ►25, 26–10–2019: నిబంధనల ప్రకారం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సరి్టఫికెట్లను పరిశీలిస్తారు. ►28, 29–10–2019: ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేస్తారు. ►29–10–2019: అభ్యర్థులు పోస్టింగ్‌లు పొందిన ప్రదేశాలు, స్కూళ్ల వివరాలను నోటీసు బోర్డులో, జిల్లా వెబ్సైట్లో పొందుపరుస్తారు. ►30–10–2019: నియామకాలు పొందిన టీచర్లు పాఠశాలల్లో రిపోర్టు చేయాలి. ►2–11–2019: స్కూళ్లలో రిపోర్టు చేయని, పోస్టు ల్లో చేరని వారి వివరాలు డీఈవోలు సేకరిస్తారు. ►4–11–2019: పోస్టులకు ఎంపికై, నియామకాల కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి విద్యాశాఖ నిబంధనల ప్రకారం పోస్టింగ్ ఆర్డర్లను రిజిస్టర్ పోస్టుల్లో పంపిస్తారు. ►5–11–2019: టీచర్ల జాయినింగ్ రిపోర్టులను డీఈవోలకు ఎంఈవో/హెడ్మాస్టర్లు పంపిస్తారు. విధుల్లో చేరిన వారి జాబితా వివరాలతో నోటీసు బోర్డులు, జిల్లా వెబ్సైట్లో పెడతారు. ►07–11–2019: నాన్ రిపోర్టింగ్, నాన్ జాయినింగ్ వివరాల జాబితా టీఎస్పీఎస్సీకి సమర్పిస్తారు. అలాగే జిల్లాల వారీగా పూర్తిస్థాయి జాబితా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందజేస్తారు. -
ఎస్జీటీ పోస్టుల భర్తీ ప్రక్రియపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల (ఎస్జీటీ) నియామక ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ 4,700 పోస్టుల భర్తీ ప్రిక్రియను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది ఈ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2017 అక్టోబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు చెందిన పి.రామకృష్ణ మరో 27 మంది అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం గురువారం విచారించింది. ఆ పోస్టులకు సంబంధించి టీఎస్పీఎస్సీ చేపట్టిన ఎంపిక విధానాన్ని తప్పుపడుతూ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై జోక్యం చేసుకునేందుకు సింగిల్ జడ్జి గతంలో నిరాకరించారు. దీంతో వారు అప్పీల్ పిటిషన్లు దాఖలు చేయగా.. గురువారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం విచారించి స్టే ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ నిబంధనల్లోని 6–ఏ ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులను విచారించాలని, ఆ పోస్టులకు ఆసక్తి చూపని వారిని తొలగించాకే ఎంపిక నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.రాహుల్‌రెడ్డి వాదించారు. వాదనల అనంతరం తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ పోస్టుల ఎంపిక ప్రక్రియపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉర్దూ, కన్నడ మీడియం పోస్టులకు ఈ ఉత్తర్వులు వర్తించవు. మరోవైపు ఇప్పటికే సర్వీస్ కమిషన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు జాబితాను విద్యాశాఖకు పంపించింది. అభ్యర్థులకు ఆ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ ప్రభుత్వానికి ఫైలు పంపించింది. అయితే కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఉత్తర్వుల్ని తొలగించాలని కోరుతూ సర్వీస్ కమిషన్ జూన్‌లో అప్పీల్ చేసే అవకాశాలున్నాయి. -
టీఆర్టీ–ఎస్జీటీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ–ఎస్జీటీ(తెలుగు మాధ్యమం) పోస్టులకు ఎంపికైన 3,375 మంది అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ గురువారం రాత్రి ప్రకటించింది. 3,786 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా, వివిధ కారణాలతో 411 పోస్టులకు సంబంధించిన ఫలితాలను పెండింగ్‌లో ఉంచింది. వైద్య నివేదికలు పెండింగ్‌లో ఉండటం/ఆయా శారీరక వైకల్య(పీహెచ్) కేటగిరీల అభ్యర్థులు లేకపోవడంతో ఇతర అంతర్గత కేటగిరీలకు మార్చడం/ఫర్దర్ పికప్ వంటి కారణాలతో పీహెచ్ కేటగిరీలోని 269 పోస్టుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచింది. బీసీ–సీ, ఎస్టీ(డబ్ల్యూ) ఏజెన్సీ అభ్యర్థులు లేక 73 పోస్టులను భర్తీ చేయలేకపోయింది. కోర్టు కేసుల కారణంగా 23 పోస్టులు, ఏజెన్సీ ప్రాంతాలకు ఎంపికైన అభ్యర్థుల స్థానిక క్లైం విషయంలో మరో 46 పోస్టుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచామని కమిషన్ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 45 కేటగిరీల్లో 7,485 ఉపాధ్యాయ పోస్టుల ఫలితాలను ప్రకటించామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్ ఠీఠీఠీ. ్టటpటఛి. జౌఠి. జీn లో చూసుకోవాలని సూచించారు. -
ఈ నెల 24 నుంచే డీఎస్సీ పరీక్షలు
సాక్షి, విజయవాడ : డిసెంబర్ 24 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తొలి విడతలో స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. రెండో విడత జనవరి 18 నుంచి ఎస్జీటీ పరీక్షలు జరుపుతామని పేర్కొన్నారు. తొలి విడత పరీక్షలకు 2,43,185 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. డీఎస్సీ కోసం 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. -
బీఈడీ విద్యార్ధులకు శుభవార్త
-
ప్రశాంతంగా ఎస్జీటీ
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ఆదివారం నిర్వహించిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) తెలుగు మీడియం పోస్టుల రాత పరీక్షకు పలు కేంద్రాల్లో 100 శాతం హాజరు నమోదైంది. మిగతా కేంద్రాల్లో 91 నుంచి 97.4 శాతం హాజరు రికార్డయింది. మరోవైపు ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షకు 97 నుంచి 99 శాతం హాజరు నమోదైంది. రెండో రోజూ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తెలుగు మీడియం పరీక్షను హెచ్ఎండీఏ పరిధిలో 86 కేంద్రాల్లో నిర్వహించినట్లు పేర్కొంది. ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ పరీక్షను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 38 కేంద్రాల్లో నిర్వహించినట్లు వెల్లడించింది. పరీక్షలను టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కమాండ్ సెంటర్ నుంచి చైర్మన్ ఘంటా చక్రపాణి, అధికారులు పర్యవేక్షించగా, 7 ప్రత్యేక బృందాలు వివిధ పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి. నేడు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు.. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టుల భర్తీకి నేడు (26న) కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షను (సీబీఆర్టీ) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎస్ఏ ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంగ్లిష్ మీడియం ఎస్ఏ మ్యాథ్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం పరీక్షకు హెచ్ఎండీఏ పరిధిలోని 10 కేంద్రాల్లో 6,985 మంది, మధ్యాహ్నం పరీక్షలకు 5 కేంద్రాల్లో 4,912 మంది (మ్యాథ్స్‌కు 2,519, సోషల్ స్టడీస్‌కు 2,393 మంది) హాజరు కానున్నట్లు వివరించారు. -
సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో టీఆర్టీ ఎస్జీటీ ‘కీ’
సాక్షి, ఎడ్యుకేషన్ : టీఎస్పీఎస్సీ పిబ్రవరి 25న నిర్వహించిన టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మీడియం పరీక్ష కు నిపుణులతో రూపొందించి కీ సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో అందుబాటులో ఉంది. ఇది అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్పీఎస్సీ విడుదల చేసే కీ ని అంతిమంగా పరిగణించాలి. టీఆర్టీలో మొత్తం 42 పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష ముగిసిన వెంటనే సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో కీ అందుబాటులో ఉంటుంది. తెలుగు మీడియం కీ కోసం క్లిక్ చేయండి ఇంగ్లిష్ మీడియం కీ కోసం క్లిక్ చేయండి -
టీఆర్టీ ఫలితాల విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్ : టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) ఖమ్మం , వరంగల్ జిల్లాల ఫలితాల విడుదలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించ తలపెట్టిన టీఆర్టీ, ఎస్జీటీ పోస్టులలో డీఎస్సీ-2012 లో భర్తీ కాకుండా మిగిలిపోయిన వికలాంగ అభ్యర్థుల పోస్టులను టీఆర్టీ-2017లో వికలాంగ అభ్యర్థులకు కేటాయించకపోవటాన్ని సవాలు చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన మురళి, వరంగల్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2012 డీఎస్సీలో వికలాంగ అభ్యర్థులకు కేటాయించిన ఎస్జీటీ పోస్టులలో ఖమ్మం జిల్లాలో 6 పోస్టులు, వరంగల్ జిల్లాలో 19 పోస్టులు మిగిలిపోయానని, అయితే జీవో 23, 99 ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులను తరవాత వచ్చే వరుస మూడు నోటిఫికెషన్లలలో కూడా వికలాంగ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 తెలియ చేస్తుందని న్యాయవాది బూర రమేష్ వాదించారు. ఖమ్మం జిల్లాలో మిగిలిపోయిన 6 పోస్టులలో కేవలం ఒక పోస్టును, వరంగల్ జిల్లాలో 19 పోస్టులలో కేవలం 10 పోస్టులు మాత్రమే వికలాంగ అభ్యర్థులకు కేటాయించారు అని బూర రమేష్ హైకోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 కి విరుద్ధమని వాదించారు. బూర రమేష్ వాదనలతో ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది. అయితే పరీక్ష నిర్వహించుకోవచ్చుననీ ఈ వాజ్యం పై తుది తీర్పు వెలువడేవరకు ఖమ్మం, వరంగల్ జిల్లాలో టీఆర్టీ, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించటానికి వీలు లేదు అని టీఎస్పీఎస్సీ, ఉన్నత విద్యా శాఖలకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వదలని సాంకేతిక సమస్యలు
ఎట్టకేలకు ఎస్జీటీల కౌన్సెలింగ్ ప్రారంభం నత్తనడకగా ప్రక్రియ గడువులోపే ముగించే పనిలో అధికారులు ఉపాధ్యాయులకు తప్పని ఇబ్బందులు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ముగింపు దశకు చేరినా సాంకేతిక లోపాలు కొనసాగుతుండడంతో ఉపాధ్యాయుల్లో తీవక్ర అసహనం వ్యక్తమౌతోంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ నెల 22న హడావుడిగా ప్రారంభించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదినుంచీ సాంకేతిక లోపాలతో నత్తనడకగా సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలలోపు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌లు ఉదయం 10 గంటలలోపు ఏనాడూ ప్రారంభం కాలేదు. వాయిదాలు పడుతూ వస్తున్న స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ఎట్టకేలకు శనివారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,200 మంది ఎస్జీటీలు బదిలీలకు దరఖాస్తులు చేసుకోగా వీరిలో సుమారు 1,546 మంది ఒకే కేంద్రంలో ఎనిమిదేళ్ల సర్వీసును పూర్తి చేసుకుని తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు ఉన్నారు. వీరుగాక 1,510 మంది గిరిజనేతర ప్రాంతానికి, మరో 36 మంది ఏజెన్సీ ఏరియాకు బదిలీలు కావాల్సిన వారూ ఉన్నారు. మూడు గంటల ఆలస్యం శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ఉన్నతాధికారులు వెబ్సైట్ లింకేజిని తెరవకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. 250 మందికి కౌన్సెలింగ్ నిర్వహించేటప్పటికి మరో సారి వెబ్సైట్ లింక్ కట్టయింది. దీంతో అరగంట పాటు కౌన్సెలింగ్ నిలిచిపోయింది. డీఈఓ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటలోపు 400 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా సాయంత్రం 5 గంటల సమయానికి 335 మందికి మాత్రమే కౌన్సెలింగ్ పూర్తయింది. గడువులోపు కౌన్సెలింగ్ పూర్తికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రణాళిక లేదు గెడ్డం సుధీర్, వైఎసార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వానికి పక్కా ప్రణాళిక లేకపోవడమే కౌన్సెలింగ్ ఆలస్యమౌతోంది. ఎప్పటికప్పుడు జీఓలు మార్చుతూ సవరణ ఉత్తర్వులిస్తూ ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసిన ప్రభుత్వం కౌన్సెలింగ్ ప్రారంభించిన తరువాత సాంకేతిక లోపాలను సరిచేయకుండా ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించింది. భవిష్యత్‌లో ఇటువంటివి జరుగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలి ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో జాప్యం బీఏ సాల్మన్ రాజు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బదిలీల కౌన్సెలింగ్‌లో ఎడిట్ ఆప్షన్ విద్యాశాఖ జిల్లా అధికారులకు ఇవ్వక పోవడంతో కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవి సెలవుల్లోనే కౌన్సిలింగ్ నిర్వహించి ఉంటే ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. -
డీఎస్సీ నియామకాలు?
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-14కు సంబంధించి ఎస్జీటీ, పండిట్ పోస్టులలో నియామకాలను జూన్ నెలలో చేపట్టాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనపై నీళ్లు చల్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసలు విషయాన్ని దాచిపెట్టి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని అభ్యర్థులను ఆదేశించింది. మార్చి 18లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. అభ్యర్థులంతా వెబ్ ఆప్షన్లు పూర్తి చేసి పోస్టింగుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1వ తేదీ నాటికి భర్తీ పూర్తి చేయాల్సి ఉంది. అప్పటికే ఆర్థికశాఖ వేసవి సెలవుల్లో వీరికి జీతాలు చెల్లించడం వలన భారం పడుతుందని లెక్కలు కట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు, దీనిపై ఆలోచనలు జరిపి వచ్చే విద్యా సంవత్సరంలో నియామకాలు చేపట్టాలని సూచించినట్లు తెలియవచ్చింది. ప్రభుత్వం నిధులను ఆదా చేయాలని యోచించి ఆర్థిక శాఖ సూచనలకు తలొగ్గినట్లు భోగట్టా. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించి వికలాంగ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కాలేదని సాకును చూపించింది. సాక్షి అసలు విషయాన్ని వెలుగులోకి తేవడంతో అభ్యర్థులు ఆందోళనబాట పట్టారు. వారిని సముదాయించేందుకు గాను వెబ్ ఆప్షన్లు తీసుకుంటున్నట్లు డ్రామాను నడిపారు. ఆప్షన్లు ఇవ్వడం పూర్తయి సుమారు 15 రోజులు కావస్తుండగా ఇప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. అభ్యర్థులు మరోసారి ఆందోళన బాట పట్టకుండా ఉండేందుకు గాను వారిని జడిపించే దోరణిని ప్రదర్శించాలని జిల్లాస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఉద్యోగంలోకి రాకముందే ఆందోళనలు చేస్తుండడాన్ని కఠినంగా పరిగణిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉద్యోగుల ద్వారా ప్రచారం చేయించారు. దీంతో అభ్యర్థులు ఆందోళనలో పాల్గొనేందుకు వెనుకంజ వేయడంతో ప్రభుత్వం జరిపిన వ్యూహ రచన ఫలించినట్లయింది. ఇదిలా ఉంటే జూన్‌లో కూడా కొన్ని జిల్లాల్లో నియామకాలు జరిగే అవకాశాలు తక్కువ. ఇటీవల జరిపిన రేషనలైజేషన్‌లో మిగులు ఉపాధ్యాయులుగా ఉన్న వారిని ముందుగా సర్దుబాటు చేసి అటు తరువాతే డీఎస్సీ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర అధికారులు జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశించారు. జిల్లాలో మిగులు ఉపాధ్యాయులు లేకపోవడంతో సమస్య తలెత్తదు. ఇటువంటి పరిస్థితుల్లో జూన్ మొదటి వారంలో జరిగే బడి పిలుస్తోంది కార్యక్రమంలో డీఎస్సీ-14 అభ్యర్థులు భర్తీలు పూర్తి చేసుకొని పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
డీఎస్సీ ఎంపిక జాబితా సిద్ధం
శ్రీకాకుళం : జిల్లాలో డీఎస్సీ-14కు సంబంధించి ఎస్జీటీ, పండిట్ పోస్టులకు ఎంపికైనవారి జాబితా సిద్ధమైంది. సోమవారం ఈ జాబితాను మరోసారి పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక కమిటీ సభ్యులైన జేసీ-2, డీఈఓ, జెడ్పీ సీఈఓ, మున్సిపల్ కమిషనర్లు జాబితాను ఆమోదిస్తూ సంతకాలు చేశారు. కలెక్టర్ లక్ష్మీ నృసింహం మహోదయం కార్యక్రమంలో బిజీగా ఉండడం వలన ఆమోదం తెలపలేకపోయారు. మంగళవారం ఆయన ఆమోదించిన తరువాత రాష్ట్రస్థాయికి నివేదిస్తారు. అన్ని జిల్లాలు ఒకేసారి ప్రకటించాలని రాష్ట్ర అధికారులు భావిస్తే అధికారికంగా ప్రకటించే విషయంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. లేనిపక్షంలో మంగళవారం రాత్రి సరికి జాబితాను ప్రకటించే పరిస్థితి ఉంటుంది. ఇదిలా ఉంటే కటాఫ్ మార్కులు 120కి పైబడే ఉన్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు సంబంధించే 110 నుంచి 120 మధ్యన కటాఫ్ మార్కులు ఉన్నాయంటే మిగిలిన కేటగిరీల విషయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఓసీ కేటగిరీలో 150 మార్కులకు పైబడి సాధించినవారే ఉద్యోగాలు పొందినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. -
కొనసాగుతున్న ఎస్జీటీ బదిలీలు
- 1601 నుంచి మిగతా వారికి నేడు కౌన్సెలింగ్ - వావిలాలకుంట తండా పీఎస్ ఆప్షన్ ఇచ్చిన ఎస్జీటీ బదిలీ నిలిపివేత విద్యారణ్యపురి : జిల్లాలోని లోకల్ బాడీ యాజమాన్యాల పరిధి ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం హన్మకొండ ప్రభుత్వ బీఈడీ కాలేజీలో చేపట్టారు. సీనియారిటీ జాబితాలోని క్రమసంఖ్య 601నుంచి 1600 వరకు కౌన్సెలింగ్ ప్రారంభించారు. 366క్రమ సంఖ్య ఎస్జీటీ ఒకరు తనకు వావిలాలకుంట తండా ప్రాథమిక పాఠశాల కావాలని ఈనెల 17న అడిగితే ఖాళీలేదని చెప్పిన అధికారులు.. క్రమసంఖ్య 560గల ఎస్జీటీకి అదే పాఠశాల ఆప్షన్ ఎలా కేటారుుస్తారని పలువురు ఉపాధ్యాయ ప్రతినిధులు డీఈవోను ప్రశ్నించారు. అరుుతే, ఈ బదిలీని తాము నిలిపివేశామని డీఈవో చంద్రమోహన్ తెలిపారు. సదరు ఎస్జీటీని వేరే పాఠశాలకు బదిలీ చేస్తామని చెప్పారు. కాగా, ఆదివారం ఉదయం 8నుంచి 601 క్రమసంఖ్య నుంచి ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5.30గంటల వరకు 1080క్రమసంఖ్య వరకు కొనసాగుతోంది. కొందరు బదిలీ అవుతుండగా, మరికొందరు నాట్‌విల్లింగ్ ఇస్తున్నారు. అయితే ఒక్కరోజే 1000మంది వరకు ఎస్జీటీలను కౌన్సెలింగ్‌కు పిలవడంతో బీఈడీ కాలేజీ ఆవరణ రద్దీగా మారింది. బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకూ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఈనెల 20న క్రమసంఖ్య 1601నుంచి మిగతా ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ చేపడతామని, వీరందరూ హాజరు కావాలని డీఈవో కోరారు. సోమవారం చేపట్టే ఈ ప్రక్రియ ద్వారా ఎస్జీటీ ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్ ముగుస్తుంది. -
చంద్రబాబుపై ఎస్కేయూ విద్యార్థులు ఆగ్రహం
అనంతపురం: రాష్ట్రంలో బీఈడీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై ఎస్కేయూ విద్యార్థులు మండిపడ్డారు. ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ అభ్యర్థులను అనుమతించాలని వారు డిమాండ్ చేస్తూ శనివారం అనంతపురం - చెన్నై రహదారిని దిగ్బంధం చేశారు. ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ అభ్యర్థులకు అనుమతి తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారని విద్యార్థులు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఈడీ విద్యార్థులకు అనుమతి ఇచ్చినా.... చంద్రబాబు అనుమతి తీసుకురావడంలో విఫలమయ్యారని వారు విమర్శించారు.