డీఎస్సీ ఎంపిక జాబితా సిద్ధం | All Ready for DSC selection list | Sakshi
Sakshi News home page

డీఎస్సీ ఎంపిక జాబితా సిద్ధం

Published Tue, Feb 9 2016 4:56 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

All Ready for DSC selection list

శ్రీకాకుళం : జిల్లాలో డీఎస్సీ-14కు సంబంధించి ఎస్‌జీటీ, పండిట్ పోస్టులకు ఎంపికైనవారి జాబితా సిద్ధమైంది. సోమవారం ఈ జాబితాను మరోసారి పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక కమిటీ సభ్యులైన జేసీ-2, డీఈఓ, జెడ్పీ సీఈఓ, మున్సిపల్ కమిషనర్‌లు జాబితాను ఆమోదిస్తూ సంతకాలు చేశారు. కలెక్టర్ లక్ష్మీ నృసింహం మహోదయం కార్యక్రమంలో బిజీగా ఉండడం వలన ఆమోదం తెలపలేకపోయారు. మంగళవారం ఆయన ఆమోదించిన తరువాత రాష్ట్రస్థాయికి నివేదిస్తారు.

అన్ని జిల్లాలు ఒకేసారి ప్రకటించాలని రాష్ట్ర అధికారులు భావిస్తే అధికారికంగా ప్రకటించే విషయంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. లేనిపక్షంలో మంగళవారం రాత్రి సరికి జాబితాను ప్రకటించే పరిస్థితి ఉంటుంది. ఇదిలా ఉంటే కటాఫ్ మార్కులు 120కి పైబడే ఉన్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు సంబంధించే 110 నుంచి 120 మధ్యన కటాఫ్ మార్కులు ఉన్నాయంటే మిగిలిన కేటగిరీల విషయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఓసీ కేటగిరీలో 150 మార్కులకు పైబడి సాధించినవారే ఉద్యోగాలు పొందినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement