కొత్త టీచర్లు వస్తున్నారు! | New Teachers To Govt School From 30th Oct | Sakshi
Sakshi News home page

కొత్త టీచర్లు వస్తున్నారు!

Published Tue, Oct 22 2019 2:34 AM | Last Updated on Tue, Oct 22 2019 2:34 AM

New Teachers To Govt School From 30th Oct - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 30న కొత్త టీచర్లు రాబోతున్నారు. విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా 3,325 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైన అభ్య ర్థుల జిల్లాల వారీ జాబితాలు విద్యాశాఖకు అందాయి. దీంతో వారికి పోస్టింగ్‌లు ఇచ్చేం దుకు విద్యాశాఖ సోమవారం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ జారీ చేసింది. ఈనెల 23 నుంచి పోస్టింగ్‌ల ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్యా కమిషనర్‌ విజయ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. పాత పది జిల్లాల ప్రాతిపదికన పోస్టింగ్‌ల ప్రక్రియ నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఈనెల 29లోగా పూర్తి చేయనున్నారు. 3,786 ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్‌ జారీ చేయగా.. 2018లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించారు.

అయితే, పోస్టింగులు ఇచ్చే సమయంలో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఎట్టకేలకు కోర్టు ఆదేశాల మేరకు టీఎస్‌పీఎస్సీ అన్ని చర్యలు చేపట్టి, ఎస్‌జీటీ తెలుగు మీడియం టీచర్‌ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. త్వరలోనే మరో 910 ఇంగ్లిష్‌ మీడియం ఎస్‌జీటీ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం స్థానికత ఖరారు కాని ఏజెన్సీ పోస్టులు, వికలాంగుల మెడికల్‌ రిపోర్టు లు అందనివి, కోర్టు వివాదాల్లో ఉన్న 461 పోస్టులు మినహా మిగతా 3,325 మంది అభ్యర్థులకు పోస్టింగ్‌ పత్రాలను విద్యాశాఖ ఆధ్వ ర్యంలో జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించే జిల్లా స్థాయి కమిటీలు జారీ చేయనున్నాయి.

ఇదీ షెఢ్యూల్‌..
23–10–2019: ఆయా జిల్లాల్లో పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలు నోటీసు బోర్డులో ప్రదర్శించడంతోపాటు వెబ్‌సైట్‌లోనూ పొందుపరుస్తారు. డీఈవోల నేతృత్వంలో ఖాళీలను గుర్తిస్తా రు. కౌన్సెలింగ్‌ నిర్వహణ కేంద్రం ప్రకటిస్తారు. 
24–10–2019: జిల్లాల్లో ఎస్‌జీటీ ఖాళీలను ఖరా రు చేసి వివరాలను నోటీసు బోర్డులో, వెబ్‌సైట్‌లో ఉంచుతారు. కమిటీ ఖరారు చేసిన పాఠశాల వారీ ఖాళీలు, ప్రాంతం, కేటగిరీ, ఎన్‌రోల్‌మెంట్‌ పనిచేస్తున్న టీచర్లు, ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆమోదానికి పంపిస్తారు. 
25, 26–10–2019: నిబంధనల ప్రకారం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్‌ సరి్టఫికెట్లను పరిశీలిస్తారు. 
28, 29–10–2019: ఎస్‌జీటీ తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి నియామక పత్రాలు అందజేస్తారు. 
29–10–2019: అభ్యర్థులు పోస్టింగ్‌లు పొందిన ప్రదేశాలు, స్కూళ్ల వివరాలను నోటీసు బోర్డులో, జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. 
30–10–2019: నియామకాలు పొందిన టీచర్లు పాఠశాలల్లో రిపోర్టు చేయాలి. 
2–11–2019: స్కూళ్లలో రిపోర్టు చేయని, పోస్టు ల్లో చేరని వారి వివరాలు డీఈవోలు సేకరిస్తారు. 
4–11–2019: పోస్టులకు ఎంపికై, నియామకాల కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి విద్యాశాఖ నిబంధనల ప్రకారం పోస్టింగ్‌ ఆర్డర్లను రిజిస్టర్‌ పోస్టుల్లో పంపిస్తారు. 
5–11–2019: టీచర్ల జాయినింగ్‌ రిపోర్టులను డీఈవోలకు ఎంఈవో/హెడ్‌మాస్టర్లు పంపిస్తారు. విధుల్లో చేరిన వారి జాబితా వివరాలతో నోటీసు బోర్డులు, జిల్లా వెబ్‌సైట్‌లో పెడతారు. 
07–11–2019: నాన్‌ రిపోర్టింగ్, నాన్‌ జాయినింగ్‌ వివరాల జాబితా టీఎస్‌పీఎస్సీకి సమర్పిస్తారు. అలాగే జిల్లాల వారీగా పూర్తిస్థాయి జాబితా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందజేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement