new teachers
-
కొత్త టీచర్లు ఎలా ఉన్నారు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన కొత్త ఉపాధ్యాయుల పనితీరుపై విద్యాశాఖ ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయి నివేదికలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ జిల్లా విద్యాశాఖాధికారులను కోరింది. దీంతో డీఈవోలు ఈ బాధ్యతను మండల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక అంశాలను ఎంఈవోలకు సూచించారు. ఇటీవల డీఎస్సీ ద్వారా 11,062 మందికి టీచర్ పోస్టులు వచ్చాయి. ఇందులో చాలామందిని ఏకోపాధ్యాయ పాఠశాలల్లోనే నియమించారు. కొత్తగా చేరినవారి బోధనా సరళి ఏ విధంగా ఉంది? విద్యార్థులతో ఎలా మమేకమవుతున్నారు? స మస్యలు వస్తున్నాయా? ఏమేరకు చొరవ చూపుతున్నారు? అనే అంశాలపై ప్రధా నంగా నివేదిక కోరారు. దీంతోపాటు పాలనాపరమైన విధులు, విద్యాశాఖ నిబంధనావళిని ఎంతవరకు పాటిస్తున్నారనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఎంపికైన టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలని అధికారులు భావించినప్పటికీ అది సాధ్యంకాలేదు. ముందుగా రిసోర్స్ పర్సన్స్‌ను ని యమించి, వారి ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పాఠశాల విద్య అధికారులు తెలిపారు. ఈలోగా వారి బోధన విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని, ఆయా అంశాలను కూడా శిక్షణలో జోడించే వీలుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
తరగతి గదిలో కొత్త తరం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త ఉపాధ్యాయులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరారు. వాస్తవానికి వారి నియామక తేదీ ఈనెల 10 అని, అన్ని జిల్లాల డీఈవోలు పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలోను కౌన్సెలింగ్ చేపట్టిన తర్వాత వారికి ప్రభుత్వ స్కూళ్లను కేటాయించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఎక్కువ మంది సొంత మండలాల్లోనే విధుల్లో చేరారు. ఇతర మండలాలకు వెళ్లిన వాళ్లు 20 శాతం ఉండొచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎస్జీటీలు చేరిన వాటిలో 85 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నట్టు తెలిసింది. వీటిలో గరిష్టంగా 20 మంది విద్యార్థులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తికానందున బుధవారం కూడా కొనసాగినట్టు వార్తలొచ్చాయి. టీచర్లు రిలీవ్...ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు, పదోన్నతుల్లో స్థాన చలనం జరిగిన ఉపాధ్యాయులకు కొత్త టీచర్లు రావడంతో విముక్తి లభించింది. ఒకే ఉపాధ్యాయుడు ఉండటం, ఇతర ప్రాంతాల నుంచి తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో దాదాపు 7 వేల మంది టీచర్లు బదిలీ అయినప్పటికీ ఇంతకాలం రిలీవ్ కాలేదు. డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లు రావడంతో వారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. అయితే మూడు నెలలుగా ఎదురుచూస్తున్న 317 మంది బాధితుల వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కొత్త నియామకాలకు ముందే ఈ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు.ఆగని డిప్యుటేషన్లుకొత్త టీచర్ల నియామకంతో ఖాళీలు భర్తీ అవుతున్న నేపథ్యంలో... మళ్లీ డిప్యుటేషన్ల అంశం విద్యాశాఖలో కలకలం రేపుతోంది. అనారోగ్య కారణాలతో డిప్యుటే షన్లు చేస్తున్న వైనం విమర్శలకు దారితీస్తోంది. డిప్యుటే షన్ల కమిటీ పరిశీలనకు పంపకుండానే ఇష్టానుసారం డిప్యూటేషన్ బాధ్యతలు ఇస్తున్నారని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి తెలిపారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఏడుగురికి ఈ తరహాలో అనుమతి ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మరి కొన్ని డిప్యుటేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయని, ఇవన్నీ పైరవీలేనని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు ఇతర ప్రాంతాల నుంచి సర్దుబాటు పేరుతో అక్రమ డిప్యుటేషన్లు ఇస్తున్నారని పీఆర్టీయూ–తెలంగాణ నాయకుడు ఎం.చెన్నయ్య ఆరోపించారు. చదివిన బడిలో ఉపాధ్యాయుడిగా!ఖానాపురం: విద్యాబుద్ధులు నేర్చిన పాఠశాల లోనే ఉపాధ్యా యునిగా ఉద్యో గం వస్తే?.. అలా ంటి అరుదైన అవకాశం పొందారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వెంకటేశ్వర్లు. ఆయన 1998 నుంచి 2002 వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడు నుంచి పదో తరగతి వరకు చదివారు. డీఎస్సీ–2024లో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయునిగా ఎంపికైన వెంకటేశ్వర్లు బుధవా రం విధుల్లో చేరగా.. స్థానికులు అభినందించారు. -
ఆ నియామక పత్రాల జాడేది?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో వివిధ కేటగిరీల్లో కొత్తగా ఉద్యోగాలు దక్కించుకున్న అభ్యర్థులు ఇంకా కొలువుదీరలేదు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని దాదాపు నాలుగునెలలు కావొస్తున్నా, వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీల పరిధిలో 9వేలకు పైబడి ఉద్యోగాల భర్తీకి అర్హత పరీక్షలు పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) 8,600 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్(పిడీ), లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్(డీఎల్) కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నియామక పత్రాలు ఇచ్చేందుకు గురుకులబోర్డు చర్యలు చేపట్టింది. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాదాపు 7,100 మందికి రెండు దఫాలుగా నియామక పత్రాలు అందజేసింది.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేయలేదు. కోడ్ ముగిసిన తర్వాత ఇవ్వాలని గురుకులబోర్డు నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు కావొస్తున్నా వీటి పంపిణీపై స్పష్టత లేదు. పోస్టింగ్‌కు లింకు... రాష్ట్రవ్యాప్తంగా గురుకుల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గురుకుల సొసైటీలు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇందుకు కారణం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్తిస్థాయిలో నియామక పత్రాలు అందించకపోవడమే. నియామకపత్రాలు అందించిన వారికి ముందుగా పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా, సరీ్వసులో వ్యత్యాసం నెలకొంటుందనే భావన, మరోవైపు కౌన్సెలింగ్‌లో నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు వెనక్కి తగ్గారు.ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్తిస్థాయిలో నియామక పత్రా లు ఇచి్చన తర్వాత పోస్టు కేటగిరీల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ప్రాధాన్యత క్రమంలో పోస్టింగ్ ఇచ్చేందుకు సొసైటీలు నిర్ణయించాయి. జూన్ 6వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. కానీ కోడ్ ముగిసి పదిరోజులు కావొస్తున్నా... గురుకుల బోర్డు నుంచి ఎలాంటి ఉలుకూపలుకూ లేకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభించినా, పూర్తి చేసేందుకు కనీసం రెండువారాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కనీసం వచ్చే నెల నుంచైనా కొత్త టీచర్లు విధుల్లో చేరతారో లేదో వేచి చూడాలి. -
కొత్త టీచర్లు వస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 30న కొత్త టీచర్లు రాబోతున్నారు. విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా 3,325 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైన అభ్య ర్థుల జిల్లాల వారీ జాబితాలు విద్యాశాఖకు అందాయి. దీంతో వారికి పోస్టింగ్‌లు ఇచ్చేం దుకు విద్యాశాఖ సోమవారం కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసింది. ఈనెల 23 నుంచి పోస్టింగ్‌ల ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాత పది జిల్లాల ప్రాతిపదికన పోస్టింగ్‌ల ప్రక్రియ నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఈనెల 29లోగా పూర్తి చేయనున్నారు. 3,786 ఎస్జీటీ పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్ జారీ చేయగా.. 2018లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించారు. అయితే, పోస్టింగులు ఇచ్చే సమయంలో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఎట్టకేలకు కోర్టు ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ అన్ని చర్యలు చేపట్టి, ఎస్జీటీ తెలుగు మీడియం టీచర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. త్వరలోనే మరో 910 ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం స్థానికత ఖరారు కాని ఏజెన్సీ పోస్టులు, వికలాంగుల మెడికల్ రిపోర్టు లు అందనివి, కోర్టు వివాదాల్లో ఉన్న 461 పోస్టులు మినహా మిగతా 3,325 మంది అభ్యర్థులకు పోస్టింగ్ పత్రాలను విద్యాశాఖ ఆధ్వ ర్యంలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే జిల్లా స్థాయి కమిటీలు జారీ చేయనున్నాయి. ఇదీ షెఢ్యూల్.. ►23–10–2019: ఆయా జిల్లాల్లో పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలు నోటీసు బోర్డులో ప్రదర్శించడంతోపాటు వెబ్సైట్లోనూ పొందుపరుస్తారు. డీఈవోల నేతృత్వంలో ఖాళీలను గుర్తిస్తా రు. కౌన్సెలింగ్ నిర్వహణ కేంద్రం ప్రకటిస్తారు. ►24–10–2019: జిల్లాల్లో ఎస్జీటీ ఖాళీలను ఖరా రు చేసి వివరాలను నోటీసు బోర్డులో, వెబ్సైట్లో ఉంచుతారు. కమిటీ ఖరారు చేసిన పాఠశాల వారీ ఖాళీలు, ప్రాంతం, కేటగిరీ, ఎన్రోల్మెంట్ పనిచేస్తున్న టీచర్లు, ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆమోదానికి పంపిస్తారు. ►25, 26–10–2019: నిబంధనల ప్రకారం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సరి్టఫికెట్లను పరిశీలిస్తారు. ►28, 29–10–2019: ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేస్తారు. ►29–10–2019: అభ్యర్థులు పోస్టింగ్‌లు పొందిన ప్రదేశాలు, స్కూళ్ల వివరాలను నోటీసు బోర్డులో, జిల్లా వెబ్సైట్లో పొందుపరుస్తారు. ►30–10–2019: నియామకాలు పొందిన టీచర్లు పాఠశాలల్లో రిపోర్టు చేయాలి. ►2–11–2019: స్కూళ్లలో రిపోర్టు చేయని, పోస్టు ల్లో చేరని వారి వివరాలు డీఈవోలు సేకరిస్తారు. ►4–11–2019: పోస్టులకు ఎంపికై, నియామకాల కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి విద్యాశాఖ నిబంధనల ప్రకారం పోస్టింగ్ ఆర్డర్లను రిజిస్టర్ పోస్టుల్లో పంపిస్తారు. ►5–11–2019: టీచర్ల జాయినింగ్ రిపోర్టులను డీఈవోలకు ఎంఈవో/హెడ్మాస్టర్లు పంపిస్తారు. విధుల్లో చేరిన వారి జాబితా వివరాలతో నోటీసు బోర్డులు, జిల్లా వెబ్సైట్లో పెడతారు. ►07–11–2019: నాన్ రిపోర్టింగ్, నాన్ జాయినింగ్ వివరాల జాబితా టీఎస్పీఎస్సీకి సమర్పిస్తారు. అలాగే జిల్లాల వారీగా పూర్తిస్థాయి జాబితా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందజేస్తారు. -
రెగ్యులర్ టీచర్లు ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పారా టీచర్ సహా ఏ రకమైన పేరుతో తాత్కాలిక టీచర్లు ఉన్నా ఆ వ్యవస్థను తొలగించాల్సిందేనని నూతన విద్యా విధానం ముసాయిదా రూపొందించిన కమిటీ సిఫారసు చేసింది. ‘సమాజంలో సుదీర్ఘకాలం ఉండే బలమైన బంధాన్ని కల్పించేది విద్యా వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో టీచర్లే కీలకం. పారా టీచర్, శిక్షా కర్మి, శిక్షా మిత్ర తదితర పేర్లతో ఉండే తాత్కాలిక టీచర్లు ఆ పనిని పక్కాగా చేపట్టలేరు. అందుకే 2022 నాటికి తాత్కాలిక టీచర్ల వ్యవస్థను రద్దు చేయాల్సిందే’అని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో గతంలో పారా టీచర్ల వ్యవస్థ ఉన్నా, సర్వ శిక్షా అభియాన్ వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో విద్యా వలంటీర్ల పేరుతో ఉపాధ్యాయ ఖాళీల్లో తాత్కాలిక టీచర్ల నియామకాలను ప్రభుత్వం చేపడుతోంది. రెగ్యులర్ టీచర్ల నియామకాలు ఆలస్యమైనప్పుడు, నియామకాలు సకాలంలో చేపట్టలేకపోయినప్పుడు, పాఠశాలల్లో టీచర్ల అవసరం ఏర్పడినప్పుడు విద్యా వలంటీర్లను నియమించి ప్రభుత్వం విద్యా బోధనను కొనసాగిస్తోంది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందాలన్నా, సమాజ నిర్మాణం సరిగ్గా ఉండాలన్నా రెగ్యులర్ టీచర్లతోనే సాధ్యం అవుతుందని కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లుగా లేని నియామకాలు.. రాష్ట్రంలో 2012 డీఎస్సీ నియామకాల తరువాత కొత్త టీచర్లు బడులకు రాలేదు. 2017లో నోటిఫికేషన్ జారీ చేసి 8,792 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినా నియామకాలు పూర్తి కాలేదు. న్యాయ వివాదాలు, ఎలక్షన్ కోడ్ పేరుతో కొన్నాళ్లు, విద్యా శాఖ అధికారులు పట్టించుకోక మరికొన్నాళ్లు ఆలస్యమైంది. మళ్లీ ఇప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్ వంటి కొన్ని పోస్టుల భర్తీ వ్యవహారం కూడా న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. దీంతో పోస్టుల భర్తీ ఆలస్యం అవుతూనే ఉంది. వివాదాలు లేని పోస్టుల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో బడులకు కొత్త టీచర్లు రాలేని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి వేలల్లో విద్యా వలంటీర్లు.. రాష్ట్రంలో గత ఏడేళ్లుగా రెగ్యులర్ టీచర్లు లేకపోవడంతో విద్యా వలంటీర్లతోనే పాఠశాలలను కొనసాగించాల్సి వస్తోంది. ఏటా కనీసం పది వేల మందికి తగ్గకుండా విద్యా వలంటీర్లను నియమిస్తూ పాఠశాలల్లో విద్యా బోధనను విద్యాశాఖ కొనసాగిస్తోంది. ఉపాధ్యాయ ఖాళీలు, అదనపు అవసరం ఉన్న స్కూళ్లలో మొత్తంగా గతేడాది 15,661 మంది విద్యా వలంటీర్లను నియమించి విద్యా బోధనను కొనసాగించిన విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరంలోనూ అదే చర్యలు చేపట్టింది. చివరకు విద్యా వలంటీర్ల నియామకం విషయంలోనూ కోర్టు ఆదేశాలు ఇస్తే తప్ప ముందుగా నియమించలేని పరిస్థితికి చేరుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అది కూడా గతేడాది నియమించిన విద్యా వలంటీర్ల సంఖ్యకు మించకుండా నియమించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో విద్యా వలంటీర్ల రెన్యువల్‌కు చర్యలు చేపట్టింది. సిఫారసుల మేరకైనా వేగవంతం చేయాలి.. రాష్ట్రంలోని పాఠశాలల్లో రెగ్యులర్ టీచర్ల నియామకం విషయంలో గత ఏడేళ్లుగా తంటాలు తప్పడం లేదు. చివరకు హైకోర్టు జోక్యం చేసుకున్నా నియామకాల వ్యవహారం ముందుకు సాగడం లేదు. మహబూబ్‌నగర్‌లో టీచర్లు లేరంటూ హైకోర్టులో పిల్ దాఖలు అవ్వడంతో ప్రభుత్వం స్పందించి తాత్కాలికంగా విద్యా వలంటీర్లను నియమించి బోధన కొనసాగిస్తోంది. ప్రస్తుతం నూతన విద్యా విధానం ముసాయిదాలో 2022 నాటికి ఎలాంటి పేరుతోనూ తాత్కాలిక టీచర్లు ఉండొద్దని, ఆ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని, రెగ్యులర్ టీచర్లు ఉండాల్సిందేనని పేర్కొంది. అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత అయినా రాష్ట్రంలో రెగ్యులర్ టీచర్ల నియామకాలు వేగవంతం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కొత్త ఉపాధ్యాయులకు త్వరలో జీతాలు
రంపచోడవరం : డీఈఓ పూల్ ద్వారా 2014 డీఎస్సీలో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు త్వరలో జీతాలు విడుదలవుతాయని డీఈఓ ఆర్.నరసింహరావు తెలిపారు. పాఠశాలల్లో రసాయన రహిత పోషక విలువలతో కూడిన కూరగాయల పెంపకంపై మండల రీసోర్స్ సెంటర్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు శనివారం ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2014 డీఎస్సీలో ఎంపికైన 200 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్ ప్లేస్ లేకపోవడంతో జీతాల విడుదలకు సంబంధించి ఇబ్బంది ఉందని అన్నారు. వచ్చే నెలలో జీతాలు విడుదల చేస్తామన్నారు. జిల్లాలోని 400 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు అవకాశం ఉందన్నారు. అయితే నిధుల కొరతతో కంప్యూటర్ బోధకులను నియమించకపోవడంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడం లేదన్నారు. జిల్లా పరిషత్ నుంచి నిధులిస్తే ఔట్సోర్సింగ్ ద్వారా కంప్యూటర్ విద్యాబోధన సాధ్యమవుతుందన్నారు. పాఠశాలల వాచ్‌మన్ పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో నిధులు సమకూర్చుకుని వాచ్‌మన్‌ను నియమించుకోవాలని ఆయన సూచించారు.