కొత్త టీచర్లు ఎలా ఉన్నారు? | The education department is investigating the performance of new teachers | Sakshi
Sakshi News home page

కొత్త టీచర్లు ఎలా ఉన్నారు?

Published Thu, Oct 24 2024 4:20 AM | Last Updated on Thu, Oct 24 2024 4:20 AM

The education department is investigating the performance of new teachers

ఆరాతీస్తున్న విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన కొత్త ఉపాధ్యాయుల పనితీరుపై విద్యాశాఖ ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయి నివేదికలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ జిల్లా విద్యాశాఖాధికారులను కోరింది. దీంతో డీఈవోలు ఈ బాధ్యతను మండల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక అంశాలను ఎంఈవోలకు సూచించారు. ఇటీవల డీఎస్సీ ద్వారా 11,062 మందికి టీచర్‌ పోస్టులు వచ్చాయి. 

ఇందులో చాలామందిని ఏకోపాధ్యాయ పాఠశాలల్లోనే నియమించారు. కొత్తగా చేరినవారి బోధనా సరళి ఏ విధంగా ఉంది? విద్యార్థులతో ఎలా మమేకమవుతున్నారు? స మస్యలు వస్తున్నాయా? ఏమేరకు చొరవ చూపుతున్నారు? అనే అంశాలపై ప్రధా నంగా నివేదిక కోరారు. దీంతోపాటు పాలనాపరమైన విధులు, విద్యాశాఖ నిబంధనావళిని ఎంతవరకు పాటిస్తున్నారనే అంశాలను పరిశీలిస్తున్నారు. 

ఎంపికైన టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలని అధికారులు భావించినప్పటికీ అది సాధ్యంకాలేదు. ముందుగా రిసోర్స్‌ పర్సన్స్‌ను ని యమించి, వారి ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పాఠశాల విద్య అధికారులు తెలిపారు. ఈలోగా వారి బోధన విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని, ఆయా అంశాలను కూడా శిక్షణలో జోడించే వీలుందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement