సాక్షి, హైదరాబాద్: స్పౌజ్‌లుగా ఉన్న ఎస్‌జీటీల విషయంలో విద్యాశాఖ అనుసరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్కూల్ అసిస్టెంట్లకు ఓటు హక్కు ఉండబట్టే వారికి అవకాశం ఇచ్చారని, తమకు లేదంటూ వివక్ష చూపుతున్నారని ఎస్‌జీటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 317 జీవో కారణంగా జరిగిన బదిలీల్లో భార్యాభర్తలను వేర్వేరు ప్రాంతాలకు పంపారు.
దీనిపై ఏడాదిగా పోరాటాలు నడుస్తున్నాయి. తాజాగా జరుగుతున్న బదిలీల్లో స్కూల్ అసిస్టెంట్స్ 615 మందికి సొంత జిల్లాలకు వెళ్ళేందుకు అనుమతించారు. కానీ 1,585 మంది ఎస్‌జీటీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారిలో నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు వినాలని వారు కోరుతున్నారు.
మా ఇద్దరి మధ్య 250 కి.మీ. దూరం
నేను మహబూబాబాద్‌లో, నా భర్త సిద్దిపేటలో పనిచేస్తున్నాం. ఇద్దరు పనిచేసే ప్రాంతాల మధ్య దూరం 250 కిలోమీటర్లు. దీంతో ఇద్దరు పిల్లలను చెరొకరం పంచుకున్నాం. తీవ్రమైన మానసిక వ్యథతో 13 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నాం. తల్లిగా ఓడిపోతున్నాను. భర్తకు దూరమవుతున్నాను. ఈ బదిలీల్లోనైనా న్యాయం జరుగుతుందనే ఆశ కన్పించడం లేదు.
– ఎస్.మమత (ఎస్‌జీటీ, మహబూబాబాద్)
Comments
Please login to add a commentAdd a comment