spouses
-
Russia-Ukraine war: చేజారిన తోడే.. బొడ్డుతాడై...
ఉక్రెయిన్. ఒకప్పటి అందాల దేశం. ఇప్పుడు రష్యా రక్త దాహానికి బలైన శిథిల చిత్రం. యుద్ధం మిగిల్చే బీభత్సానికి సాక్షి. పోరులో ప్రాణాలొదిలిన వేలాది మంది ఉక్రెయిన్ యువ సైనికుల జీవిత భాగస్వాములది మాటలకందని దైన్యం. వారిలోనూ అసలు సంతానమే లేనివారిదైతే చెప్పనలవి కాని వ్యథ. ఎవరి కోసం బతకాలో తెలియని నైరాశ్యం. అయితే తమ జీవిత భాగస్వాములు ముందుజాగ్రత్తగా భద్రపరిచి వెళ్లిన వీర్యం/అండాలు వారిలో కొత్త ఆశలు నింపుతున్నాయి. వాటి సాయంతో బిడ్డలను కంటున్నారు. తమను శాశ్వతంగా వీడి వెళ్లిన తోడు తాలూకు నీడను వారిలో చూసుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు... ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై రెండేళ్లవుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై రష్యా సైన్యం హఠాత్తుగా విరుచుకుపడింది. రోజుల్లో తల వంచుతుందనుకున్న ఉక్రెయిన్ దీటుగా పోరాడుతోంది. దాంతో రెండేళ్లయినా పోరు కొనసాగుతూనే ఉంది. యుద్ధమంటేనే ప్రాణనష్టం! ఇప్పటిదాకా ఏకంగా 70,000 మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించినట్లు అంచనా. మరో లక్షన్నర మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. యుద్ధంలో జవాను వీరమరణం పొందితే అతడి/ఆమె వంశం అంతమైపోవాల్సిందేనా? బతికుండగానే అండాలు, వీర్యం భద్రపర్చుకొని, తాము లేకపోయినా జీవిత భాగస్వామి ద్వారా సంతానం పొందే వెసులుబాటును ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇలాంటి ప్రశ్నలు ఉక్రెయిన్ సైన్యం నుంచి గట్టిగా వినిపించాయి. దీనిపై ప్రభుత్వమూ సానుకూలంగా స్పందించింది. పార్లమెంటులో ఇటీవలే ఒక బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్స్కీ సంతకం చేస్తే చట్టంగా మారనుంది. ఇదొక విప్లవాత్మక చట్టం కానుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. యుద్ధంలో మరణించినవారి వీర్యం/అండాలతో సంతానం పొందే అవకాశం ఇప్పటిదాకా ఉక్రెయిన్‌లో చట్టపరంగా లేదు. ఇక ఈ పరిస్థితి మారనుంది... ► ఉక్రెయిన్ పార్లమెంట్లో ఆమోదించిన బిల్లు ప్రకారం జవాన్లు తమ వీర్యం, అండాలు భద్రపర్చుకోవచ్చు. వారు యుద్ధంలో అమరులైతే వాటి సాయంతో జీవిత భాగస్వాములు సంతానం పొందవచ్చు. ► ఈ కొత్త చట్టాన్ని అంతా స్వాగతిస్తున్నారు. దీని ద్వారా అమర సైనికుల కుటుంబ వారసత్వం కొనసాగుతుందంటున్నారు. ► జవాన్ల వీర్యం/అండాలు ఉచితంగా భద్రపరుస్తామని ఉక్రెయిన్‌లో పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. యుద్ధం మొదలైనప్ప టి నుంచే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాయి. ► ఇందుకు వీలుగా యుద్ధంలో మృతి చెందిన జవాన్ల వీర్యం/అండాలను మూడేళ్ల పాటు భద్రపరుస్తారు. ఇందుకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తుంది. ► వీర్యం/అండాలు భద్రపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న సైనికుల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. ప్రభుత్వం అనుమతితో పాటు ఆర్థిక సాయమూ అందిస్తుందని స్పష్టత రావడమే కారణమని తెలుస్తోంది. ► యుద్ధంలో క్షతగాత్రులై, ఆరోగ్యం దెబ్బతిని సంతానోత్పత్తికి, బిడ్డలకు జన్మనిచ్చే సామర్థ్యానికి దూరమైన సైనికులు కూడా వీర్యం/అండాలను భద్రపర్చుకుని సంతానం పొందవచ్చు. ► యుద్ధంలో గాయపడిన పలువురు జవాన్లు ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ► ఇలా భద్రపర్చిన వీర్యం/అండాలతో పుట్టే పిల్లలకు చట్టబద్ధంగా అన్ని హక్కులూ ఉంటాయి. అమర వీరులైన తల్లి/తండ్రి పేరును వారి బర్త్ సరి్టఫికెట్లో ముద్రిస్తారు! ► ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నవారు కూడా మరో బిడ్డను కనడానికి ముందుకొస్తున్నారు. ఇలా భద్రపర్చుకుంటున్న జవాన్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. మన పాప నవ్వుల సాక్షిగా... నువ్వెప్పటికీ నాతోనే... మనసుతో చూడగలిగితే లక్ష భావాలను, కోటి ఊసులను కళ్లకు కట్టే ఫొటో ఇది. ఇందులో నేపథ్యంలోని పోస్టర్లో కనిపిస్తున్నది రష్యాతో పోరులో మరణించిన ఉక్రెయిన్ సైనికుడు విటాలీ. బుల్లి పాపాయిని ఎత్తుకున్నది అతని భార్య విటాలినా. భర్త మరణానంతరం ఆయన వీర్యంతో గర్భం దాల్చి ఈ పండంటి పాపాయికి జన్మనిచి్చందామె. కూతురిని భర్త ఫొటోకు చూపిస్తూ ఇలా భావోద్వేగానికి గురైంది. రష్యాతో యుద్ధం మొదలయ్యే కొద్ది నెలల ముందే విటాలీ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ యుద్ధం మొదలైన తొలి నాళ్లలోనే మరణించాడు. అప్పటికే విటాలినా 13 వారాల గర్భవతి. కానీ ఆ గర్భం నిలవలేదు. భర్త క్షేమం తాలూకు ఆందోళనే అందుకు ప్రధాన కారణమని ఇప్పటికీ కన్నీళ్లపర్యంతం అవుతుంటుంది విటాలినా. ‘‘అటు జీవితాంతం తోడుండాల్సిన భర్తను, ఇటు ఇంకా లోకమే చూడని మా కలల పంటను కొద్ది రోజుల తేడాతో శాశ్వతంగా కోల్పోయా. బతుకంతా ఒక్కసారిగా శూన్యంగా తోచింది’’ అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుందామె. ‘‘ఇలాంటి పరిస్థితిని ఊహించే నా భర్త వీర్యాన్ని భద్రపరిచి వెళ్లాడు. దాని సాయంతో తల్లిని కావాలని నిర్ణయించుకున్నా. అలా ఈ చిట్టి తల్లి ఈ లోకంలోకి అడుగు పెట్టింది. తన రాకతో నాకు నిజంగా సాంత్వన చేకూరింది. పాప వాళ్ల నాన్న పోలికలనే గాక హావభావాలను కూడా ముమ్మూర్తులా పుణికి పుచ్చుకుంది. దైవ కృప అంటే బహుశా ఇదేనేమో. నిజానికి గంపెడు సంతానాన్ని కనాలని, మాది పెద్ద కుటుంబం కావాలని పెళ్లికి ముందు నుంచీ ఎన్నెన్నో కలలు కన్నాం. కానీ విధి రాత మరోలా ఉంది. అయినా తను ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఈ చిట్టితల్లి రూపంలో ఇలా ఫలించింది’’ అంటుంటే విని చెమర్చని కళ్లు లేవు. కాస్త అటూ ఇటుగా ఉక్రెయిన్ సైనిక వితంతువులందరి గాథ ఇది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుటుంబాలు కూలిపోయి.. బంధాలు కాలిపోయి! అమ్మా నాన్న మీకోసం.......
నేను బాగుంటే చాలు అనుకోవడంతోనే రోజు మొదలవుతోంది. తోడబుట్టిన వాళ్లు.. బంధువులు కూడా డబ్బు ముందు కానివారవుతున్నారు. ఆస్తులు అంతస్తులు.. పిల్లలు సాధించిన విజయాలు.. గడుపుతున్న విలాసవంతమైన జీవితం.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ. వ్యక్తిత్వం ఎక్కడో ఒక మూలన మాత్రమే కనిపిస్తుంది. ఆప్యాయత కరువవుతోంది. బంధాలు పలుచన కాగా.. అసూయ పెరిగిపోతుంది. తనకు కష్టం వచ్చినా, ఇతరులు బాధపడినా కన్నీళ్లే వస్తాయనే విషయం బోధపడితే కానీ తెలియని పరిస్థితి. పెద్దగా ఆస్తులు లేకపోయినా.. ఆదాయ వనరులు అంతంత మాత్రమే ఉన్నా.. అప్పట్లో ఉమ్మడి కుటుంబం కష్టసుఖాల్లో తోడు నిలిచింది. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండటం.. అరమరికలు లేని జీవనం ఉన్నంతలో సంతృప్తి నిచ్చింది. కానీ ఆధునిక ప్రపంచం గుండెలో గోడలు కట్టుకోవడం బంధాలను పలుచన చేస్తోంది. – సాక్షి, కర్నూలు డెస్క్ 29.05.2023 మెడికల్ షాపు నిర్వహణతో భార్యాభర్తలు ఏ లోటు లేకుండా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాగా చదివించారు.. ఉద్యోగం రావడం.. పెళ్లి చేయడంతో రెక్కలొచ్చి ఎవరి దారిని వాళ్లు ఎగిరిపోయారు. కుటుంబ యజమాని మంచం పట్టడంతో ఆయన బాగోగులు చూసుకోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. చివరకు భర్త మరణం ఆమెను కలచివేసింది. ఇంట్లో ఓదార్చే దిక్కులోదు.. ధైర్యం చెప్పే మనుషుల్లేరు. కొడుకులు వస్తారంటే ఒకరు సప్త సముద్రాల ఆవల.. మరొకరు వందల కిలోమీటర్ల దూరం.. ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లోనే దహన సంస్కారాలు పూర్తి చేసింది. .. పత్తికొండలో చోటు చేసుకున్న ఈ ఘటన మాయమవుతున్న బంధాలకు అద్దం పట్టింది. చిన్నటేకూరుకు చెందిన రంగయ్య విశ్రాంత ఆర్టీసీ మెకానిక్. భార్య, కుమార్తెలు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా అనాథాశ్రమంలో కడుపు నింపుకుంటున్నాడు. చివరకు తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కేందుకు ఆరోగ్యం కూడా సహకరించక నీరసించాడు. కర్నూలులోని అశోక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి ఆస్తిని దాన విక్రయంగా పొంది తల్లి, సోదరిని ఇంటి నుంచి గెంటేశాడు. కనీసం చట్ట ప్రకారం ఆస్తి ఇవ్వాలని కోరినా దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు. కోర్టును ఆశ్రయించినా న్యాయం జరిగేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో బతికేందుకు ఆర్థిక వనరులు లేక దిక్కులు చూస్తున్నారు. ప్రపంచం వేగంగా అడుగులు వేస్తుండటంతో ఎవరికి వారు జీవితంలో స్థిరపడాలనే ఉరుకులు పరుగుల జీవనానికి అలవాటుపడ్డారు. చదువు.. ఉద్యోగం.. ఈ రెండింటికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఆ తర్వాత ఇల్లు, పిల్లలు వీటితోనే జీవితం గడిచిపోతుంది. డబ్బు.. డబ్బు.. ఈ కరెన్సీ నోట్ల మధ్య సమయం నలిగిపోతుంది. మానవత్వం ఎప్పుడో కానీ ఉనికి చాటుకోలేకపోతుంది. సౌకర్యాలు.. విలాసాలు పెరిగిపోవడంతో వీటి ముందు వ్యక్తిత్వం చిన్నబోతుంది. కుటుంబం అన్న మాటే కానీ.. ఎవరికి వారుగా జీవిస్తున్నారు. చాలా కుటుంబాలు ఇప్పటికే బాగా పలుచబడ్డాయి. విద్య.. ఉద్యోగం.. ఉపాధి.. కారణం ఏదైనా ఇంటికి దూరంగా బతకడం అలవాటైపోయింది. ఇక అక్కడో ఇక్కడో కొంతమంది కలసిమెలసి ఉంటున్నా.. అరమరికలతో తుమ్మితే ఊడిపోయే బంధంగా మారుతోంది. పెద్దల పట్ల గౌరవం తగ్గిపోతుండటంతో ఒకే ఇంట్లో జీవిస్తున్నా ఆత్మీయతలు కనుమరుగవుతున్నాయి. రాక, పోక ఇష్టానుసారం కాగా.. విలువలు గాలికి కొట్టుకుపోయి బంధాలు ఒంటరిగా మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎవరికి వారే భోజనం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో అందరూ కలసి భోజనం చేయడం పరిపాటి. ఆ తర్వాత సంఖ్య కాస్త పలుచబడినా రోజులో ఏదో ఒక పూట భోజనం చేయనిదే తృప్తి కలగని పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఏ సమయంలో తింటారో తెలియదు, ఏం తింటున్నారో కూడా అడిగేందుకు సమయం ఉండకపోవడం కుటుంబంలో అనారోగ్య వాతావరణానికి కారణమవుతోంది. అందరూ కలసి కూర్చొని భోజనం చేయడం ద్వారా కష్టసుఖాలు పాల్పంచుకునే అవకాశం ఉంటుంది. దీని వెనుక ఉద్దేశం మారిపోయి.. ఆకలి అయినప్పుడు తింటామనో, బయట తిని వచ్చామనే మాటలు వినిపించడం సర్వసాధారణమైంది. హాస్టళ్లలో చదువు ఇది పోటీ ప్రపంచం. మా పిల్లాడు అందరికంటే ముందుండాలనే భావన ప్రతి ఒక్క తల్లిదండ్రిలో కనిపిస్తుంది. ఈ కారణంగా పిల్లలను ఇంట్లో ఉంచుకోకుండా కార్పొరేట్ హాస్టళ్లలో ఉంచి చదివించడం ఫ్యాషన్ అయిపోయింది. అగ్గి పెట్టెల్లాంటి రూముల్లో.. మంచీచెడు తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయి. అమ్మానాన్నల ఆప్యాయతకు దూరమవుతూ.. బంధాల విలువ తెలియకుండా ర్యాంకుల వెంట పరుగులు తీయడంతోనే బాల్యం దాటిపోతుంది, యవ్వనం చేజారిపోతుంది. ఆ తర్వాత కూడా ఇంటికి చుట్టపుచూపుగానే వస్తుండటంతో విలువలు వీధిపాలవుతున్నాయి. పండగలూ పబ్బాలకే.. గతంలో శుభకార్యమైనా, చావుకైనా పది మంది కలిసేవాళ్లు. మంచీచెడు చెప్పి వెళ్లేవాళ్లు. రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకొని పొద్దుపోయే దాకా కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకునేవాళ్లు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే కనీసం ఖర్మకాండలు ఎలా చేయాలనే విషయం కూడా తెలియక తికమకపడుతున్నారు. పెళ్లిళ్లు.. శుభకార్యాలంటే ప్రతి ఒక్కరి అడుగు ‘బ్రాహ్మణుల’ ఇంటి వైపునకే పడుతోంది తప్పితే ఒక్కటంటే ఒక్కటీ సొంతంగా చేసుకోలేకపోవడం ఆధునికత ఏ పరిస్థితికి దారితీస్తుందో అర్థమవుతోంది. ఆహా్వనాలు, హాజరు కూడా మొక్కుబడిగానే ఉండటం చూస్తే మనిషికి, బంధాలకు మధ్య దూరం ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుస్తోంది. సెల్ఫోన్లతో సరి.. సర్దుబాటు ధోరణి మచ్చుకైనా కనిపించడం లేదు. పక్కోడి నీడను కూడా సహించలేని పరిస్థితి. వయస్సు పెరిగే కొద్దీ సహనం, ఓర్పు కనిపించాల్సి ఉండగా.. అసూయ ద్వేషాలకు పెద్దపీట వేస్తున్నారు. చిన్న చిన్న మాటలకు పట్టింపులకు పోయి బంధాలనే వదులుకోవడం, అసలు వాళ్లతో ఏమి అవసరం ఉందనే భావన అధికమైంది. ఇందుకు సెల్ఫోన్లతో కాలం గడపటం, గంటల కొద్దీ వాటితోనే సావాసం చేయడం ప్రధాన కారణం. ఇంట్లోనే ఉంటున్నా ఎవరూ మాట్లాడుకోకుండా సెల్‌ఫోన్‌పై చేతులు కదుపుతున్నారు. ఫ్రెండ్స్ కలిశామన్న మాటే కానీ చూపంతా సెల్‌ఫోన్ పైనే ఉంటోంది. ఒక్కరు మరణించినా.. పిల్లలు మంచి హోదాలో ఉండాలని తల్లిదండ్రులు ఎంతగానో తపిస్తున్నారు. ఇందుకోసం తమ జీవితాలను ఫణంగా పెడుతున్నారు. పైసాపైసా కూడబెట్టి మరీ భవితకు బాటలు వేస్తున్నారు. తీరా లక్ష్యం చేరుకోగానే.. పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు. పిల్లోడు బాగుపడితే చాలనుకొని కొంత కాలం దంపతులు ఇద్దరూ నెట్టుకొస్తున్నా.. వృద్ధాప్యంలో మనోవేదనతో మంచం పడుతున్నారు. ఈ సమయంలో ఇద్దరిలో ఒకరు మరణించిన మరొకరి జీవనం దుర్భరంగా మారుతోంది. మరీ ముఖ్యంగా భార్య మరణిస్తే.. ఆ వెంటనే భర్త కన్నుమూయడం చూస్తే.. పిల్లలు దూరమైతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థమవుతుంది. పిల్లలకు సమయం కేటాయించాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలి. మరీ ముఖ్యంగా వారితో గడిపేందుకు సమయం కేటాయించాలి. ప్రతి ఒక్కరూ ఐదు టీలు(టైం, టాక్, ట్రీట్, టచ్, ట్రస్ట్) పాటించాలి. అప్పుడే పిల్లలతో బంధం బలపడుతుంది. తల్లిదండ్రుల స్పర్శ పిల్లలకు సరికొత్త అనుభూతితో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. నమ్మకం పెంపొందింనప్పుడే కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. – సి.జ్యోతిర్మయి, ఫ్యామిలీ కౌన్సిలర్, బిహేవియర్ థెరపిస్ట్, కర్నూలు -
H-1B వీసాదారులకు శుభవార్త..
-
ఇండియన్ టెక్కీలకు ఊరట.. హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు
అమెరికాలోని ఇండియన్ టెక్కీలకు ఊరట నిస్తూ హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. యూఎస్ టెక్ సెక్టార్‌లోని విదేశీ ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయవచ్చని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కొన్ని వర్గాల హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు ఉపాధి అధికార కార్డులను ఇచ్చే ఒబామా కాలం నాటి నిబంధనలను కొట్టివేయాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!) సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అమెజాన్ , యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు కూడా వ్యతిరేకించాయి. హెచ్-1బీ వర్కర్ల జీవిత భాగస్వాములకు యూఎస్ ఇప్పటివరకు దాదాపు లక్ష వర్క్ ఆథరైజేషన్ కార్డులు జారీ చేసింది, వీరిలో గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేలా కోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు, వలసదారుల హక్కుల కోసం పోరాడే న్యాయవాది అజయ్ భూటోరియా హర్షం వ్యక్తం చేశారు. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ వెళ్లనున్నట్లు సేవ్ జాబ్స్ యూఎస్ఏ తెలిపింది. (గంగూలీ ముద్దుల తనయ.. అప్పుడే ఉద్యోగం చేస్తోంది.. జీతమెంతో తెలుసా?) -
తెలంగాణ విద్యాశాఖ తీరు వివాదాస్పదం.. ఓటు హక్కు లేదని వివక్ష.. !
సాక్షి, హైదరాబాద్: స్పౌజ్‌లుగా ఉన్న ఎస్జీటీల విషయంలో విద్యాశాఖ అనుసరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్కూల్ అసిస్టెంట్లకు ఓటు హక్కు ఉండబట్టే వారికి అవకాశం ఇచ్చారని, తమకు లేదంటూ వివక్ష చూపుతున్నారని ఎస్జీటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 317 జీవో కారణంగా జరిగిన బదిలీల్లో భార్యాభర్తలను వేర్వేరు ప్రాంతాలకు పంపారు. దీనిపై ఏడాదిగా పోరాటాలు నడుస్తున్నాయి. తాజాగా జరుగుతున్న బదిలీల్లో స్కూల్ అసిస్టెంట్స్ 615 మందికి సొంత జిల్లాలకు వెళ్ళేందుకు అనుమతించారు. కానీ 1,585 మంది ఎస్జీటీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారిలో నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు వినాలని వారు కోరుతున్నారు. మా ఇద్దరి మధ్య 250 కి.మీ. దూరం నేను మహబూబాబాద్‌లో, నా భర్త సిద్దిపేటలో పనిచేస్తున్నాం. ఇద్దరు పనిచేసే ప్రాంతాల మధ్య దూరం 250 కిలోమీటర్లు. దీంతో ఇద్దరు పిల్లలను చెరొకరం పంచుకున్నాం. తీవ్రమైన మానసిక వ్యథతో 13 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నాం. తల్లిగా ఓడిపోతున్నాను. భర్తకు దూరమవుతున్నాను. ఈ బదిలీల్లోనైనా న్యాయం జరుగుతుందనే ఆశ కన్పించడం లేదు. – ఎస్.మమత (ఎస్జీటీ, మహబూబాబాద్) -
వర్క్‌పర్మిట్లపై యూఎస్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు, హెచ్1బీ వీసా హోల్డర్ల జీవితభాగస్వాములు సహా కొన్ని ఇమ్మిగ్రెంట్ కేటగిరీలకు చెందినవారి వర్క్ పర్మిట్ కాలపరిమితిని 18నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో యూఎస్‌లో పనిచేస్తున్న పలువురు భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించనుంది. కాలపరిమితి ముగిసిన వర్క్‌పర్మిట్లకు 18నెలల పొడిగింపు ఇచ్చే వెసులుబాటు ఈనెల 4నుంచి అమలవుతుంది. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న వీరి వర్క్‌పర్మిట్ కాలపరిమితి ఆటోమేటిగ్గా 180 నుంచి 540 రోజులకు పెరుగుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న ఈఏడీ దరఖాస్తులతో పనిభారం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ (అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ) డైరెక్టర్ జడోయ్ చెప్పారు. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారం యూఎస్ పౌరులు కానివారు వర్క్‌పర్మిట్ కాలపరిమితి ముగిశాక మరో 180 రోజుల పొడిగింపు ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ గడువులో వాళ్లు పర్మిట్ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిర్ణయం దాదాపు 87వేల మంది ఇమ్మిగ్రెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయాన్ని ఇండో అమెరికన్ సంఘాలు స్వాగతించాయి. -
పక్కపక్కనే పోస్టింగ్‌లు
సాక్షి, అమరావతి: భార్యాభర్తలు ఇద్దరూ అఖిల భారత సర్వీసుల అధికారులైతే వేర్వేరు ప్రాంతాల్లో కొలువు తçప్పదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో భార్యాభర్తలైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఒకేచోట కాకపోయినా పక్క పక్క జిల్లాల్లో విధులు నిర్వహించే సువర్ణావకాశం లభించింది. రాష్ట్రంలో 13 జిల్లాలు 26 జిల్లాలుగా ఆవిర్భవించడంతో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ దంపతులకు పక్క పక్క జిల్లాల్లోనే ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆయా జంటల్లో కొందరు వీరు.. ► పూర్వ తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలుగా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. వాటిలో కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. వీరిద్దరూ భార్యభర్తలు. ► ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయ ఇద్దరూ దంపతులే. అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఇద్దరూ భార్యాభర్తలు. è నంద్యాల జేసీగా పనిచేసిన డాక్టర్ మనబీర్ జిలానీ శామూన్‌ను ప్రభుత్వం నంద్యాల కలెక్టర్‌గా నియమించింది. ఆయన భార్య తమీమ్ అన్సారియా శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ అన్నమయ్య జిల్లా జేసీ గా బాధ్యతలు చేపట్టారు. è ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా దంపతులే. -
H-1B Visa: భాగస్వాముల వీసాలకు గూగుల్ మద్దతు
వాషింగ్టన్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం కలిగిన వలసదారులైన హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్ వీసాలు అందించేందుకు గూగుల్ సంస్థ మద్దతు ప్రకటించింది. ఈ విషయంపై ఇప్పటికే పలు సంస్థలు సానుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ సైతం ఈ జాబితాలో చేరింది. అమెరికాకు వచ్చే వలసదారులకు గూగుల్ మద్దతుగా ఉంటుందని ఆ సంస్థ సీఈవో సుందర్‌పిచాయ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్4ఈఏడీ(ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆవిష్కరణలు పెరిగి ఉద్యోగ సృష్టి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. Google is proud to support our nation’s immigrants. We joined 30 other companies to protect the H-4 EAD program which spurs innovation, creates jobs and opportunities, and helps families. https://t.co/AvmEbLve3C — Sundar Pichai (@sundarpichai) May 14, 2021 హెచ్4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీ తత్వం దెబ్బతింటోందని అక్కడి కోర్టులో దాఖలైన కేసులో గూగుల్ మరో 30 సంస్థల తరపున అఫిడవిట్ సమర్పించింది. హెచ్1బీ వీసాదారు కుటుంబసభ్యులకు అవకాశం కల్పించే వ్యవస్థను కోరుకుంటున్నామని పేర్కొంది. దాని ద్వారా సుమారు 90వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆ సంస్థ న్యాయ విభాగం ఉపాధ్యక్షురాలుకేథరిన్ లఖవేరా తెలిపారు. హెచ్1బీ వీసా కలిగిన వారు తమ భాగస్వామితో పాటు పిల్లలు కూడా అమెరికాలో ఉండేందుకు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అనుమతి ఇస్తుంది. ‘వలసదారులకు మద్దతుగా నిలిచేందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మరో 30 సంస్థలతో కలిసి హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాం. దీని వల్ల ఆవిష్కరణలు, ఉద్యోగ అవకాశాలుపెరుగుతాయి. ఈ కార్యక్రమం వారి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది’ అని పిచాయ్ ట్వీట్ చేశారు. అడోబ్, అమెజాన్, యాపిల్, ఈబే, ఐబీఎం, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, పేపాల్, ట్విటర్ సహా ఇతర కంపెనీలు హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అనేక ఆంక్షలు విధించారు. ఇక జోబైడెన్ అధ్యక్షుడుఅయిన తర్వాత ట్రంప్ విధించిన నియమ నిబంధనలు, ఆంక్షలను ఉపసంహరించిన విషయం తెలిసిందే. చదవండి: భారతీయ టెక్కీలకు భారీ ఊరట -
హెచ్1బీ వీసా: వారికి భారీ ఊరట
వాషింగ్టన్: హెచ్1బీ, ఇతర వర్క్ వీసాలను రద్దుచేసిన అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం, లాక్డౌన్ నిబంధనల కారణంగా భారతదేశంలో చిక్కుకున్న హెచ్1బీ వీసా హోల్డర్ల భార్య లేదా భర్త, ఇతర ఆధారితులు ఇండియా నుంచి తిరిగి అమెరికాకు వచ్చేందుకు అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి వారు వీసా స్టాంపింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. హెచ్1బీ వీసాదారుని జీవిత భాగస్వామి లేదా బిడ్డలు, తల్లిదండ్రులు తిరిగి అమెరికాకు చేరుకోవచ్చని ప్రకటించి వారికి భారీ ఊరట కల్పించింది. (డాలర్ డ్రీమ్స్‌పై ట్రంప్ పంజా) హెచ్2బీ, హెచ్4తో సహా వివిధవలసేతర వీసాల నిషేధంపై మినహాయింపు ప్రకటించింది. తాజా ఆదేశాల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్1బీ, వీసాదారుడి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు (భారతదేశంలో చిక్కుకు పోయిన) తిరిగి అమెరికా వెళ్ళడానికి అనుమతి లభించింది. అర్హులైన వారికి హెచ్4, ఎల్-2 వీసాలను జారీ చేయనుంది. అయితే ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు భారతదేశంలో యూస్ ఎంబసీ, కాన్సులేట్లు తెరిచేవరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే జూన్ 24 నాటికి చెల్లుబాటు అయ్యే వీసా లేని హెచ్1 బీ, హెచ్ 4, జే1, హెచ్2ఏ వీసాదారులకు డిసెంబర్ 31,2020 వరకు అనుమతి ఉండదని మరోసారి స్పష్టం చేసింది. కాగా కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఉపాధి ఆధారిత వీసాలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
వైట్ హౌస్‌కు ‘హెచ్1బీ’ సవరణలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణులకు జారీచేస్తున్న హెచ్1బీ వీసాకు సంబంధించి సవరించిన నిబంధనలు వైట్‌హౌస్‌కు చేరుకున్నాయి. అమెరికాలో హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఇకపై ఉద్యోగం చేసుకునేందుకు వీలులేకుండా వీటిని రూపొందించారు. వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ బడ్జెట్‌కు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సమర్పించిన ఈ ప్రతిపాదనల కారణంగా 90,000 మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇలా నష్టపోయేవారిలో భారతీయులే పెద్ద సంఖ్యలో ఉన్నారని అధికారులు అంటున్నారు. అమల్లోకి వచ్చేందుకు మరింత సమయం అయితే హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల ఉద్యోగాలపై నిషేధం విధిస్తున్న ఈ నిబంధనలు అమల్లోకి రావడానికి మరింత సమయం పడుతుందని వైట్‌హౌస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలుత ఈ ప్రతిపాదనలపై శ్వేతసౌధం సమీక్ష నిర్వహిస్తుందనీ, వేర్వేరు ప్రభుత్వ విభాగాలతో పాటు సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుందని వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. ఓసారి ఈ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త హెచ్1బీ నిబంధనలకు వైట్‌హౌస్ ఆమోదం తెలుపుతుంది. అనంతరం ఈ నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్లో 30 రోజుల కాలపరిమితితో పబ్లిష్ చేస్తారు. ఈ గడువు ముగిశాక నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపారు. మనవారే ఎక్కువమంది హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసుకోవడానికి 2015లో ఒబామా ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు కూడా పనిచేసుకునే అవకాశం కల్పిస్తే వాళ్లంతా అమెరికాలోనే ఉంటారన్న ఉద్దేశంతో ఒబామా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అందరికంటే ఎక్కువగా భారతీయులే లబ్ధి పొందారు. అమెరికా ప్రభుత్వం జారీచేసిన హెచ్4 వీసాల్లో 93 శాతం భారతీయులే దక్కించుకున్నారు. అయితే విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనీ, తాను అధ్యక్షుడ్ని అయితే హెచ్1బీ వీసా నిబంధనల్ని సవరిస్తానని 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అప్పట్లో ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ నేతలతో పాటు టెక్నాలజీ దిగ్గజాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ హెచ్1బీ నిబంధనల విషయంలో ట్రంప్ మొండిగా ముందుకెళుతున్నారు. నష్టపోతామంటున్న నిపుణులు హెచ్1బీ జీవిత భాగస్వాముల్ని ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని సెనెటర్ కమలా హారిస్ సహా పలువురు చట్టసభ్యులు, సిలికాన్ వ్యాలీ కంపెనీలు ట్రంప్‌ను కోరుతున్నాయి. లేదంటే నిపుణులను కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ‘సేవ్ జాబ్స్ అమెరికా’ సంస్థ వాషింగ్టన్‌లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో పిటిషన్ వేసింది. కాగా, ఇటీవల అమెరికా పాక్షిక షట్‌డౌన్ నేపథ్యంలో ఈ కేసు విచారణ ప్రక్రియను కోర్టు నెల పాటు వాయిదా వేసింది. తాజాగా అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కోర్టుకు తెలపనుంది. ప్రస్తుతం అమెరికాలో 4,19,637 మంది విదేశీ నిపుణులు హెచ్1బీ వీసాపై పనిచేస్తుండగా, వీరిలో 3,09,986 మంది భారతీయులే. -
‘హెచ్–1బీ’పై ట్రంప్ మరో పిడుగు!
హెచ్–1బీ వీసాదారుల కుటుంబాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పిడుగు వేయనున్నారు. సాధారణంగా హెచ్–1బీ వీసా ఉన్నవారు పెళ్లయ్యాక జీవిత భాగస్వామిని హెచ్–4 వీసాపై అమెరికా తీసుకెళ్తారు. హెచ్–4 వీసా ఉన్నవారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా అనుమతులిచ్చారు. తాజాగా ఆ అనుమతులను రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా హోంల్యాండ్ శాఖ ప్రకటించింది. ఒకవేళ ఈ అనుమతులు రద్దయితే భారతీయులు సహా దాదాపు లక్ష మంది అమెరికాలో ఉద్యోగాలు మానుకుని మళ్లీ ఇళ్లలో కూర్చోవాల్సి ఉంటుంది. సొంతంగా సంపాదించుకోగలిగిన ప్రతిభ ఉన్నప్పటికీ వారంతా తమ భర్తలు/భార్యల సంపాదన మీదే ఆధారపడే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో హెచ్–4 వీసాపై పనిచేస్తున్న భారతీయులు దాదాపు 70 వేల మంది ఉంటారనీ, వారిలోనూ 90 శాతం భార్యలేనని ఓ అంచనా. నాడు సానుకూలంగా స్పందించిన ఒబామా ‘హెచ్–1బీ వీసా కలిగిన తమ జీవిత భాగస్వామితో కలసి ఉండేందుకు సొంత దేశాన్ని వదిలి హెచ్–4 వీసాపై అమెరికా వచ్చేవారిలో ఎక్కువ మంది విద్యావంతులు, తగిన ప్రతిభ ఉన్నవారే. వీరంతా ఇళ్లకు ఎందుకు పరిమితం కావాలి? వీరికి ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే. వీరినీ పనిచేసేందుకు అనుమతించాలి’ అని డిమాండ్లు రావడంతో హెచ్–4 వీసాపై వచ్చినవారు 2015 మే 26 నుంచి అమెరికాలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఒబామాæ సర్కారు ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందు వరకు హెచ్–1బీ వీసా ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా కంపెనీల్లో పనిచేయాలంటే తమ భార్యలు/భర్తలకు గ్రీన్‌కార్డ్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పటికే లక్ష మందికి అనుమతులు 2015 జూన్–2017 జూన్ మధ్య వివిధ దేశాలకు చెందిన 1,04,748 మంది హెచ్–4 వీసాదారులు ఉద్యోగం చేసేందుకు అనుమతులు పొందారు. 2015లో 26,856 మంది, 2016లో 41,526 మంది 2017 జూన్ వరకు 36, 366 మంది హెచ్–4 వీసాదారులకు ఉద్యోగం చేసే అనుమతులు లభించాయి. ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం హెచ్–4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు నిలిపేస్తే వీరందరూ కొలువులు కోల్పోతారు. కొత్తగా ఉద్యోగాలు చేయాలనుకునే వారికీ ఇబ్బందే. కొన్ని కుటుంబాల్లో పిల్లలు అమెరికాలోనే పుట్టి వారికి అమెరికా పౌరసత్వమే సంక్రమించింది. అమెరికా పౌరసత్వం ఉన్న పిల్లలు కలిగిన హెచ్–4 వీసాదారులను పనిచేసేందుకు అనుమతించకపోవడం అన్యాయమేనని ఓ వాదన. ఎన్నికల హామీలో భాగమే! అమెరికా జాతీయుల ఉద్యోగాలను ఇతర దేశాల వారు కొల్లగొడుతున్నారనీ, తాను గెలిస్తే దీనిని కట్టడి చేస్తానన్నది ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీ. హెచ్–1బీ సహా పలు వర్క్ వీసాల విధానాలను సమీక్షించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు తీసుకొస్తూనే ఉంది. హెచ్–4 వీసా కలిగిన వారికి పనిచేసేందుకు ఉన్న అనుమతులను రద్దు చేసే ప్రతిపాదనను మొదట ఈ ఏప్రిల్‌లోనే ప్రభుత్వం తెచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చొచ్చు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జాబ్‌లెస్ జీవితభాగస్వామిని ఎలా చూస్తున్నారు?
ఒక్కోసారి మన ప్రమేయం ఏమీ లేకుండానే ఉద్యోగం పోతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయినవారికి, వారి కుటుంబమే అండగా నిలవాలి. ముఖ్యంగా జీవితభాగస్వామి తమ పార్ట్నర్కు సపోర్ట్ ఇవ్వాలి. మీ జీవితభాగస్వామి ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారిపట్ల మీ ప్రవర్తన ఎలా ఉంది? 1. ఉద్యోగం పోయిన మీ జీవితభాగస్వామితో చాలా సమయాన్ని స్పెండ్ చేస్తారు. ఎ. అవును బి. కాదు 2. కోల్పోయిన ఉద్యోగం గురించి ఎక్కువగా ప్రస్తావించరు. కొత్త ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందని విసిగించరు. ఎ. అవును బి. కాదు 3. మీ పార్ట్నర్ స్కిల్స్ వారికై వారే తెలుసుకొనేలా చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 4. ఉద్యోగం లేదని మీ జీవితభాగస్వామిని ఇంటిపనులకే పరిమితం చేయాలనుకోరు. జాబ్ సెర్చ్ కోసం వారికి సమయం అవసరమని గుర్తిస్తారు. ఎ. అవును బి. కాదు 5. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మీ పార్ట్నర్కు ఆర్థికంగా చేయూత ఇస్తారు. అదే సమయంలో డబ్బు ఆదా గురించి ఆలోచిస్తారు. ఎ. అవును బి. కాదు 6. విమర్శలకు దూరంగా ఉంటారు. మాటలతో మీ పార్ట్నర్ను బాధపెట్టరు. ఎ. అవును బి. కాదు 7. మీ పరిధిలో జీవితభాగస్వామి కోసం ఉద్యోగాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 8. ఒత్తిడిలో ఉన్న మీ లైఫ్పార్ట్నర్ను వివిధరకాలుగా ఎంటర్టైన్ చేయటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 9. వారిపై సానుభూతి చూపించే ప్రయత్నం ఎప్పటికీ చేయరు. ఎ. అవును బి. కాదు 10. ఉద్యోగం పోయినందున కలిగే అభద్రతాభావం నుంచి మీ పార్ట్నర్కు సాంత్వన కలిగేలా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఆరు దాటితే మీ లైఫ్‌పార్ట్‌నర్‌కు అన్ని విధాలా సహాయాన్ని అందింస్తారు. వారు సంపాదించడంలేదని తేలిగ్గా చూడరు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే ఉద్యోగం లేని మీ పార్ట్నర్కు ఎలా సపోర్ట్ ఇవ్వాలో మీకు తెలియదు. ‘ఎ’ లు సూచనలుగా తీసుకొని పార్ట్నర్ జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయండి. -
హెచ్-1బీ వీసాదారుల నెత్తిన మరో బాంబు
వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాదారులకు మరో బాంబు వేయడానికి రడీ అవుతోంది. వీసా సంస్కరణలు, ప్రీమియం వీసాలపై తాత్కాలిక నిషేదం లాంటి సంచలన నిర్ణయాలతో భారత ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులుపుట్టిస్తున్న అమెరికా ప్రభుత్వం మరో షాకింగ్ చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. హెచ్-1బీ వీసా హోల్డర్ల భాగస్వాములకు(భార్యలేదా భర్త), హెచ్-4 వీసాదారులపై వేటు వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం వలస కార్మికులు విదేశీ ఉద్యోగులను ఏరివేసే క్రమంలో మరింత దూకుడుగా కదులుతోంది. చట్టబద్దంగా అనుమతి వున్న ఉద్యోగులపై వేటు వేసేందుకు యోచిస్తోంది. ఈ క్రమంలో హెచ్-1బీ వీసా దారులు అమెరికాలో పనిచేయడానికి అనుమతి ఉంటుంది. అయితే ఇప్పుడా అనుమతిని రద్దు చేసే యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దీనిపై వాషింగ్టన్ కోర్టులో డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ 60 రోజుల గడువు కోరింది. దీంతో వేలాదిమంది భారతీయ ఐటీ ఉద్యోగుల భాగస్వాముల( హెచ్-4 వీసాదారులు) ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నాయనే ఆందోళన నెలకొంది. అయితే హెచ్-4 వీసాదారులు (హెచ్-1బీ వీసాదారులపై ఆధారపడేవాళ్లు) ఎన్నో ఏళ్లపాటు పోరాడి ఈ అనుమతిని సంపాదించారు. 2015, ఫిబ్రవరిలో అప్పటి ఒబామా ప్రభుత్వం ఈ అనుమతినిచ్చింది. తద్వారా గ్రీన్‌కార్డు కోసం వేచి చేస్తున్న హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములకు ఈ అవకాశం లభించింది. ఒబామా ప్రభుత్వ నిర్ణయంపై సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే గ్రూప్ కోర్టుకు వెళ్లింది. కానీ ఇందులో తాము జోక్యం చేసుకోలేమని అప్పట్లో కోర్టు చెప్పింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే ఈ గ్రూప్ మరోసారి అప్పీల్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మద్దతు కూడా లభించింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి 60 రోజుల సమయం కోరింది. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా ఉన్న జెఫ్ సెషన్స్.. అప్పట్లో సెనేటర్‌గా ఒబామా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అయితే అమెరికాలో భారీగావున్న ఈ హెచ్-4 వీసాదారుల తరఫున ఇమ్మిగ్రేషన్ వాయిస్ అధ్యక్షుడు అమన్ కపూర్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అసలు ఈ పిటిషన్ దాఖలు చేయడానికి సరైన ఆధారమే లేదని అమన్ కపూర్ వాదిస్తున్నారు. -
'పుట్టింటి పేరుకోసం పోరాడి ఓడారు'
టోక్యో: జపాన్ సుప్రీంకోర్టు అక్కడి మహిళలను కంట తడిపెట్టించింది. తమ అస్తిత్వాన్ని కోల్పోయామే అనే బాధను కలిగించింది. ఎంతపోరాడినవారిపక్షాన తీర్పురాకపోవడంతో ఆ మహిళలంతా కలత చెందుతూ తీరని వేదనలోకి జారుకున్నట్లుగా మారిపోయారు. పెళ్లిచేసుకున్నవారు కచ్చితంగా ఒకే ఇంటిపేరును కలిగి ఉండాలని జపాన్ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎప్పుడో 19శతాబ్దంలో చేసిన చట్టాన్ని దృఢపరుస్తూ ఇందులో ఎలాంటి మార్పు లేదని పెళ్లయ్యాక తప్పకుండా ఒకే ఇంటి పేరు కలిగి ఉండాలే తప్ప రెండు పేర్లు ఉపయోగించడానికి వీల్లేదని తెలిపింది. సాధారణంగా ఓ సారి పెళ్లయ్యాక ఏ భర్త అయినా భార్య కోసం ఇంటి పేరు మార్చుకోడు.. భార్య ఇంటి పేరే మారుతుంది. ప్రస్తుతం జపాన్ లో కూడా అందరిలాగానే భర్తల ఇంటి పేర్లే భార్యలకు వర్తిస్తున్నాయి. కానీ, ఎంతోకాలం నుంచి తమకు అత్తింటివారి పేరుతోపాటు, పుట్టిల్లువారి ఇంటిపేరు కూడా కొనసాగించేలా అవకాశం ఇవ్వాలంటూ మహిళలు పోరాడుతున్నారు. ఇటీవల ఐదుగురు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయగా దానిని విచారించిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. దీంతో పిటిషన్ వేసినవారు కోర్టులోనే గొల్లుమన్నారు. దీంతోపాటు, విడాకులు పొందిన స్త్రీ ఆరునెలలపాటు ఆగాలనే పాత నిబంధనను సుప్రీంకోర్టు కొట్టి వేస్తూ దానిని 100 రోజులకు తగ్గించింది. ఇంటి పేరు విషయంలో తీర్పు అనంతరం క్యోకో సుఖమోతో అనే మహిళ మాట్లాడుతూ 'నేను తీర్పు వినే సమయంలో నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నేను చాలా విచారంగా ఉన్నాను. చాలా బాధగా ఉంది.. నా పేరు.. నా గుర్తింపు..' అంటూ ఆమె కోర్టు ప్రాంగణంలోనే విలపించింది. మరోపక్క, ఎంతోమంది మహిళలు, లింగ సమానత్వ నిపుణులు జపాన్ లోని కొన్ని చట్టాలకు కాలదోషం పట్టిందని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. -
పిల్లల్ని నాతోనే ఉంచుకోవడానికి చట్టం సాయం చేస్తుందా?
నా వయసు 32. ఇద్దరు పిల్లలు. బాబుకి ఆరేళ్లు, పాపకి రెండేళ్లు. మా వారికీ, నాకూ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆయన నాతో ఉండలేను, విడిపోతానంటున్నారు. నాకు ఆయనంటే చాలా ప్రేమ. కాని పొసగనప్పుడు విడిపోవడంలో తప్పులేదనిపిస్తోంది. ఆయన పిల్లల్ని తనకు ఇచ్చేయమంటున్నారు. కానీ నాకది ఇష్టం లేదు. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. నెలకు ముప్పైవేలు సంపాదిస్తున్నాను. వాళ్లని పెంచుకోగలను. పైగా వాళ్లని వదిలి ఉండలేను. ఎంతచెప్పినా ఆయనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? పిల్లల్ని నాతోనే ఉంచుకోవడానికి చట్టం సాయం చేస్తుందా? - సంధ్యారాణి (పేరు మార్చాం), రాజమండ్రి భార్యాభర్తలు విడిపోవడం అన్నది వాళ్ల వాళ్ల పరిస్థితులు, మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అయితే పిల్లలు ఉన్నప్పుడే సమస్య. తల్లిదండ్రులు విడిపోవడమన్నది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి, ఇక దానిగురించి చెప్పేదేమీ లేదు. ఇక మీరడిగిన దాని గురించి... మైనర్ పిల్లలు తల్లి సంరక్షణలోనే ఉండాలని ఇప్పటికే పలు కేసుల్లో తీర్పు వెలువడింది. చట్టం ప్రకారం పిల్లలకు తండ్రే సంరక్షకుడు. అయితే తల్లి ప్రేమ, తండ్రి కంటే తల్లే పిల్లల పట్ల ఎక్కువ అప్రమత్తంగా, బాధ్యతగా ఉంటుందన్న విషయాలు నిరూపితమయ్యాయి కాబట్టి... చాలావరకూ కేసుల్లో పిల్లల్ని తల్లికే అప్పగిస్తూ తీర్పు ఇస్తోంది న్యాయస్థానం. పైగా మీరు బాగా సంపాదిస్తున్నారు. పిల్లల్ని చూసుకునే స్థోమత ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా పిల్లల కస్టడీ కోసం కేసు వేయవచ్చు. కస్టడీ కేసుల్లో తీర్పు ఇచ్చే ముందు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిత్వం, ప్రవర్తన వంటి అన్ని విషయాలనూ పరిశీలిస్తారు. తండ్రి స్థోమత సరిగ్గా లేకపోయినా, అతడు మరో పెళ్లి చేసుకున్నా అతడికి పిల్లల్ని అప్పగించరు. కాకపోతే జీవితాంతం అతడికి పిల్లల్ని కలుసుకునే హక్కు మాత్రం ఉంటుంది. ఒకవేళ అతడి వల్ల పిల్లలకు ఏదైనా ప్రమాదం జరుగుతుందనిపిస్తే... కోర్టులో తల్లి పిటిషన్ వేసుకోవచ్చు. కోర్టు విజిటేషన్ రైట్స్‌ని క్యాన్సిల్ చేస్తుంది. అంతేకాదు... మీరు సంపాదిస్తున్నా కూడా, పిల్లల పోషణ కోసం మీరు అతడి నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు ఆయన ఆస్తిలో హక్కు ఉంటుంది. దాని కూడా మీరు పొందవచ్చు. అయితే ఒకటి... ముందు మీ వారితో స్పష్టంగా మాట్లాడండి. అన్నీ వివరించి ఒప్పించేందుకు ప్రయత్నించండి. ఆయన ఇక అంగీకరించరని తేల్చుకున్నాకే కోర్టుకు వెళ్లండి. ఏ సమస్య అయినా ఇంట్లో పరిష్కారమైతే బాగుంటుంది కదా!