ఫైల్ ఫోటో
వాషింగ్టన్: హెచ్1బీ, ఇతర వర్క్ వీసాలను రద్దుచేసిన అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ నిబంధనల కారణంగా భారతదేశంలో చిక్కుకున్న హెచ్1బీ వీసా హోల్డర్ల భార్య లేదా భర్త, ఇతర ఆధారితులు ఇండియా నుంచి తిరిగి అమెరికాకు వచ్చేందుకు అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి వారు వీసా స్టాంపింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. హెచ్1బీ వీసాదారుని జీవిత భాగస్వామి లేదా బిడ్డలు, తల్లిదండ్రులు తిరిగి అమెరికాకు చేరుకోవచ్చని ప్రకటించి వారికి భారీ ఊరట కల్పించింది. (డాలర్ డ్రీమ్స్‌పై ట్రంప్ పంజా)
హెచ్2బీ, హెచ్4తో సహా వివిధవలసేతర వీసాల నిషేధంపై మినహాయింపు ప్రకటించింది. తాజా ఆదేశాల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్1బీ, వీసాదారుడి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు (భారతదేశంలో చిక్కుకు పోయిన) తిరిగి అమెరికా వెళ్ళడానికి అనుమతి లభించింది. అర్హులైన వారికి హెచ్4, ఎల్-2 వీసాలను జారీ చేయనుంది. అయితే ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు భారతదేశంలో యూస్ ఎంబసీ, కాన్సులేట్లు తెరిచేవరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే జూన్ 24 నాటికి చెల్లుబాటు అయ్యే వీసా లేని హెచ్1 బీ, హెచ్ 4, జే1, హెచ్2ఏ వీసాదారులకు డిసెంబర్ 31,2020 వరకు అనుమతి ఉండదని మరోసారి స్పష్టం చేసింది. కాగా కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఉపాధి ఆధారిత వీసాలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment