ఒక్కోసారి మన ప్రమేయం ఏమీ లేకుండానే ఉద్యోగం పోతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయినవారికి, వారి కుటుంబమే అండగా నిలవాలి. ముఖ్యంగా జీవితభాగస్వామి తమ పార్ట్‌నర్‌కు సపోర్ట్ ఇవ్వాలి. మీ జీవితభాగస్వామి ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారిపట్ల మీ ప్రవర్తన ఎలా ఉంది?
1. ఉద్యోగం పోయిన మీ జీవితభాగస్వామితో చాలా సమయాన్ని స్పెండ్ చేస్తారు.
ఎ. అవును బి. కాదు
2. కోల్పోయిన ఉద్యోగం గురించి ఎక్కువగా ప్రస్తావించరు. కొత్త ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందని విసిగించరు.
ఎ. అవును బి. కాదు
3. మీ పార్ట్‌నర్ స్కిల్స్ వారికై వారే తెలుసుకొనేలా చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తారు.
ఎ. అవును బి. కాదు
4. ఉద్యోగం లేదని మీ జీవితభాగస్వామిని ఇంటిపనులకే పరిమితం చేయాలనుకోరు. జాబ్ సెర్చ్ కోసం వారికి సమయం అవసరమని గుర్తిస్తారు.
ఎ. అవును బి. కాదు
5. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మీ పార్ట్‌నర్‌కు ఆర్థికంగా చేయూత ఇస్తారు. అదే సమయంలో డబ్బు ఆదా గురించి ఆలోచిస్తారు.
ఎ. అవును బి. కాదు
6. విమర్శలకు దూరంగా ఉంటారు. మాటలతో మీ పార్ట్‌నర్‌ను బాధపెట్టరు.
ఎ. అవును బి. కాదు
7. మీ పరిధిలో జీవితభాగస్వామి కోసం ఉద్యోగాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు.
ఎ. అవును బి. కాదు
8. ఒత్తిడిలో ఉన్న మీ లైఫ్‌పార్ట్‌నర్‌ను వివిధరకాలుగా ఎంటర్‌టైన్ చేయటానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
9. వారిపై సానుభూతి చూపించే ప్రయత్నం ఎప్పటికీ చేయరు.
ఎ. అవును బి. కాదు
10. ఉద్యోగం పోయినందున కలిగే అభద్రతాభావం నుంచి మీ పార్ట్‌నర్‌కు సాంత్వన కలిగేలా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ లు ఆరు దాటితే మీ లైఫ్‌పార్ట్‌నర్‌కు అన్ని విధాలా సహాయాన్ని అందింస్తారు. వారు సంపాదించడంలేదని తేలిగ్గా చూడరు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే ఉద్యోగం లేని మీ పార్ట్‌నర్‌కు ఎలా సపోర్ట్ ఇవ్వాలో మీకు తెలియదు. ‘ఎ’ లు సూచనలుగా తీసుకొని పార్ట్‌నర్ జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయండి.
Comments
Please login to add a commentAdd a comment