Bud Light Controversy Glass Bottling Plants Forced to Shut Down and 600 Employees Job Less - Sakshi
Sakshi News home page

బడ్ లైట్ వివాదం.. గ్లాస్ బాట్లింగ్ కంపెనీలో 600 మంది ఔట్!

Published Tue, Jul 4 2023 4:26 PM | Last Updated on Tue, Jul 4 2023 5:15 PM

Bud light controversy Glass bottling plants forced to shut down and 600 employees job less  - Sakshi

బడ్ లైట్ వివాదానికి ప్రభావితమైన 'గ్లాస్ బాట్లింగ్' (Glass Bottling) కంపెనీ ఎట్టకేలకు తన రెండు ప్లాంట్స్ మూసివేయనుంది. అమ్మకాల పరంగా అస్థిరమైన ఆర్ధిక నష్టాలను చవి చూస్తున్న కారణంగా ఈ ప్లాంట్స్‌లో ఏకంగా 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బాట్లింగ్ కంపెనీ మూసివేయడానికి కారణాన్ని వెల్లడించలేదు. అయితే రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బార్‌లు, కాంట్రాక్ట్ కంపెనీలు వివాదాస్పద బడ్‌పై దేశవ్యాప్త బహిష్కరణల ఆగ్రహాన్ని అనుభవిస్తున్నందున, బడ్ లైట్ అమ్మకాలను ట్యాంకింగ్ చేయడం వల్ల ప్లాంట్లు మూతపడుతున్నాయని భావిస్తున్నారు.

గతంలో వెల్లడైన కొన్ని నివేదికల ప్రకారం, బాట్లింగ్ కంపెనీ ప్లాంట్‌లలోని కార్మికులు ఉత్పత్తి తగ్గినట్లు, డిమాండ్ తగ్గడం వల్ల లూసియానా అండ్ నార్త్ కరోలినా ప్లాంట్లు తమ మెషీన్‌లలో కొన్నింటిని ఆఫ్‌లైన్‌లో ఉంచవలసి వచ్చిందని సమాచారం. అయితే కంపెనీ పరిస్థితి రోజు రోజుకి క్షీణించడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి ఉంటుందనుకుంటున్నారు.

కంపెనీ మూసి వేసిన ప్లాంట్లలో బడ్‌వైజర్ అండ్ బడ్ లైట్ కోసం బాటిళ్లను ఉత్పత్తి చేసేవారు. అయితే బడ్‌వైజర్ ఇకపై బాటిల్‌ను విక్రయించనందున, వారికి ఇకపై బాట్లింగ్ ఉత్పత్తి అవసరం లేదు. ఇది కూడా కంపెనీ మూసివేతకు ప్రధాన కారణం. ఇది మాత్రమే కాకుండా గత ఏప్రిల్ నెలలో బీర్‌మేకర్ ఒక బాలిక సెలబ్రేషన్ సమయంలో ప్రత్యేక డబ్బాలను బహుమతిగా ఇచ్చినప్పటి నుంచి బడ్ లైట్ అమ్మకాలు క్షీణించాయి.

(ఇదీ చదవండి: ఈ ఒక్క వైన్ బాటిల్ కొనాలంటే రూ. కోట్లు పెట్టాల్సిందే! ప్రత్యేకతేంటంటే?)

మార్కెట్ విలువలో ఇప్పటికే బిలియన్ల డాలర్లను కోల్పోయిన బ్రాండ్ కొత్త వేసవి ప్రకటన ప్రచారాన్ని ప్రారంభించింది. బీర్‌మేకర్ పంపిణీదారులకు సహాయం చేయడానికి చర్యలు తీసుకుంది, దాని మార్కెటింగ్ బడ్జెట్‌ను కూడా పెంచింది. కంపెనీలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీర్ అమ్మకాలు క్రమంగా తగ్గుతుండటం వల్ల బడ్ లైట్ బ్రాండ్‌కు ఎదురుదెబ్బ తగులుతోంది.

(ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!)

2023 జూన్ 3 వరకు అమ్మకాలు భారీగా తగ్గాయి. గత సంవత్సరం అమ్మకాలతో పోలిస్తే ఈ అమ్మకాలు సుమారు 24.4 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీకి ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్న కారణంగా రెండు కంపెనీ ప్లాంట్స్ మూసివేయవల్సి వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement