ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: భార్యాభర్తలు ఇద్దరూ అఖిల భారత సర్వీసుల అధికారులైతే వేర్వేరు ప్రాంతాల్లో కొలువు తçప్పదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో భార్యాభర్తలైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఒకేచోట కాకపోయినా పక్క పక్క జిల్లాల్లో విధులు నిర్వహించే సువర్ణావకాశం లభించింది. రాష్ట్రంలో 13 జిల్లాలు 26 జిల్లాలుగా ఆవిర్భవించడంతో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ దంపతులకు పక్క పక్క జిల్లాల్లోనే ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆయా జంటల్లో కొందరు వీరు..
► పూర్వ తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలుగా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. వాటిలో కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. వీరిద్దరూ భార్యభర్తలు.
► ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయ ఇద్దరూ దంపతులే. అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఇద్దరూ భార్యాభర్తలు. è నంద్యాల జేసీగా పనిచేసిన డాక్టర్ మనబీర్ జిలానీ శామూన్‌ను ప్రభుత్వం నంద్యాల కలెక్టర్‌గా నియమించింది. ఆయన భార్య తమీమ్ అన్సారియా శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ అన్నమయ్య జిల్లా జేసీ గా బాధ్యతలు చేపట్టారు. è ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా దంపతులే.
Comments
Please login to add a commentAdd a comment