వాషింగ్టన్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం కలిగిన వలసదారులైన హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్ వీసాలు అందించేందుకు గూగుల్ సంస్థ మద్దతు ప్రకటించింది. ఈ విషయంపై ఇప్పటికే పలు సంస్థలు సానుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ సైతం ఈ జాబితాలో చేరింది. అమెరికాకు వచ్చే వలసదారులకు గూగుల్ మద్దతుగా ఉంటుందని ఆ సంస్థ సీఈవో సుందర్‌పిచాయ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్4ఈఏడీ(ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆవిష్కరణలు పెరిగి ఉద్యోగ సృష్టి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.
Google is proud to support our nation’s immigrants. We joined 30 other companies to protect the H-4 EAD program which spurs innovation, creates jobs and opportunities, and helps families. https://t.co/AvmEbLve3C
— Sundar Pichai (@sundarpichai) May 14, 2021
హెచ్4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీ తత్వం దెబ్బతింటోందని అక్కడి కోర్టులో దాఖలైన కేసులో గూగుల్ మరో 30 సంస్థల తరపున అఫిడవిట్ సమర్పించింది. హెచ్1బీ వీసాదారు కుటుంబసభ్యులకు అవకాశం కల్పించే వ్యవస్థను కోరుకుంటున్నామని పేర్కొంది. దాని ద్వారా సుమారు 90వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆ సంస్థ న్యాయ విభాగం ఉపాధ్యక్షురాలుకేథరిన్ లఖవేరా తెలిపారు.
హెచ్1బీ వీసా కలిగిన వారు తమ భాగస్వామితో పాటు పిల్లలు కూడా అమెరికాలో ఉండేందుకు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) అనుమతి ఇస్తుంది. ‘వలసదారులకు మద్దతుగా నిలిచేందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మరో 30 సంస్థలతో కలిసి హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాం. దీని వల్ల ఆవిష్కరణలు, ఉద్యోగ అవకాశాలుపెరుగుతాయి. ఈ కార్యక్రమం వారి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది’ అని పిచాయ్ ట్వీట్ చేశారు.
అడోబ్, అమెజాన్, యాపిల్, ఈబే, ఐబీఎం, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, పేపాల్, ట్విటర్ సహా ఇతర కంపెనీలు హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అనేక ఆంక్షలు విధించారు. ఇక జోబైడెన్ అధ్యక్షుడుఅయిన తర్వాత ట్రంప్ విధించిన నియమ నిబంధనలు, ఆంక్షలను ఉపసంహరించిన విషయం తెలిసిందే.
చదవండి: భారతీయ టెక్కీలకు భారీ ఊరట
Comments
Please login to add a commentAdd a comment