టీఆర్టీ–ఎస్జీటీ ఫలితాలు విడుదల  | Release of TRT-SGT Results | Sakshi
Sakshi News home page

టీఆర్టీ–ఎస్జీటీ ఫలితాలు విడుదల 

Published Fri, Apr 5 2019 12:39 AM | Last Updated on Fri, Apr 5 2019 12:39 AM

Release of TRT-SGT Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్టీ–ఎస్జీటీ(తెలుగు మాధ్యమం) పోస్టులకు ఎంపికైన 3,375 మంది అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ గురువారం రాత్రి ప్రకటించింది. 3,786 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా, వివిధ కారణాలతో 411 పోస్టులకు సంబంధించిన ఫలితాలను పెండింగ్‌లో ఉంచింది. వైద్య నివేదికలు పెండింగ్‌లో ఉండటం/ఆయా శారీరక వైకల్య(పీహెచ్‌) కేటగిరీల అభ్యర్థులు లేకపోవడంతో ఇతర అంతర్గత కేటగిరీలకు మార్చడం/ఫర్దర్‌ పికప్‌ వంటి కారణాలతో పీహెచ్‌ కేటగిరీలోని 269 పోస్టుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచింది. బీసీ–సీ, ఎస్టీ(డబ్ల్యూ) ఏజెన్సీ అభ్యర్థులు లేక 73 పోస్టులను భర్తీ చేయలేకపోయింది.

కోర్టు కేసుల కారణంగా 23 పోస్టులు, ఏజెన్సీ ప్రాంతాలకు ఎంపికైన అభ్యర్థుల స్థానిక క్లైం విషయంలో మరో 46 పోస్టుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచామని కమిషన్‌ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 45 కేటగిరీల్లో 7,485 ఉపాధ్యాయ పోస్టుల ఫలితాలను ప్రకటించామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌  ఠీఠీఠీ. ్టటpటఛి. జౌఠి. జీn లో చూసుకోవాలని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement