ఉపాధ్యాయ నియామకాలకు కొత్త సిలబస్ | New syllabus for Teacher Recruitment Test in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ నియామకాలకు కొత్త సిలబస్

Published Sat, Nov 29 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

New syllabus for Teacher Recruitment Test in Andhra Pradesh

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు కొత్త సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టెర్ట్)లను కలిపి ఈసారి ఒకే పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తున్నందున ఈ కొత్త సిలబస్‌ను రూపొందించారు. ఈసారి టెర్ట్‌లో మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలలన్నిటినీ కలుపుకొని 10,313 పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.

స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్), లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్, సెకండరీ ఎడ్యుకేషన్ టీచర్లు (ఎస్జీటీ)కు వేర్వేరు సిలబస్‌ను ప్రకటించారు. ఆయా విభగాల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల్లోని నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేసేలా పలు అంశాలను ఇందులో చేర్చారు. గతంలో టెట్‌కు ఒక సిలబస్, డీఎస్సీకి మరో సిలబస్ ఉండేది. ఈసారి అందుకు భిన్నంగా రెండింటినీ కలపడంతో పాటు మరిన్ని కొత్త అంశాలను కూడా జోడించారు. అభ్యర్థుల నైపుణ్యాల పరిశీలన లక్ష్యంగా, వారికి అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఉండేలా దీనిని రూపొందించారు.

ఈ సిలబస్ సమగ్ర సమాచారాన్ని ‘ఏపీడీఎస్సీ.సీజీజీ.జీఓవీ.ఇన్’ అనే వెబ్‌సైట్లో పొందుపరిచారు. ఈ సిలబస్ ప్రకారం భాషా పండితుల పోస్టులకు ఆయా భాషలపై ప్రాధాన్యమిస్తూ ఇచ్చే ప్రశ్నలు 70 మార్కులకు మాత్రమే ఉంటాయి. మిగతా 130 మార్కులు భాషా పండితులకు సంబంధం లేనివే ఉంటాయి. ఇంగ్లిష్ (గ్రామర్), గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టు అంశాలతో పాటు బోధనాంశాలపై వారికి ప్రత్యేక సిలబస్‌ను ఇచ్చారు. పీఈటీలకు 180 మార్కులకు, మిగతా అన్ని విభాగాల్లో 200 మార్కులకు సిలబస్‌ను ఇచ్చారు. పీఈటీలకు కూడా ఈసారి కొత్త అంశాలను చేర్చారు.

స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్) పోస్టులకు సిలబస్
* తెలుగు, ఉర్దూ, హింద, తమిళ్, కన్నడ, ఒరి యా, సంస్కృతం పోస్టులకు పార్ట్ - 1లో జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్‌లలో 10 మార్కుల ప్రశ్నలుంటాయి.

* పార్టు- 2లో శిశు అభివృద్ధి, బోధన అంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తా రు. పార్టు - 3లో భాషలకు సంబంధించిన అం శాలతో పాటు అందులోని బోధనా పద్ధతులపై 70 మార్కులు ఉంటాయి.

* పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్న లు ఉంటాయి. పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులు, వాటి బోధనా విధానాల పై 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

స్కూల్ అసిస్టెంట్లు (నాన్ లాంగ్వేజెస్) సిలబస్
వీరికి నాన్ లాంగ్వేజెస్‌లో ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయోలాజికల్ సైన్స్‌లకు వేర్వేరు సిలబస్‌లను ప్రకటించారు. ప్రతి పేపర్లో పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు, పార్టు - 2లో శిశు అభివృద్ధి, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

* పార్టు - 3 నుంచి సబ్జెక్టులవారీగా కొన్ని మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లిష్‌లో పార్టు - 3లో ఇంగ్లిష్ భాష, బోధన నైపుణ్యాలపై 70 మార్కులకు, పార్టు- 4 లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కృతం భాషలపై అభ్యర్థి ఆప్షన్‌ను అనుసరించి సంబంధిత భాషల సాహిత్యాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలిస్తారు.

* పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్‌లలో 60 మార్కులకు ప్రశ్నలిస్తారు. గణితంలో పార్టు - 3లో  తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషలను ఆప్షన్‌గా పెట్టుకున్న వారికి ఆయా భాషల సాహిత్యాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలిస్తారు.

* పార్టు - 4 లో ఇంగ్లిష్ భాష, బోధన నైపుణ్యాలపై 30 మార్కులకు, పార్టు - 5లో గణితం, సైన్సు సబ్జెక్టు బోధన పద్ధతులపై 100 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఇందులో గణితంలో 70 మార్కులకు, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టులలో చెరొక 15 మార్కులకు ప్రశ్నలిస్తారు. ఇదే కేటగిరీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయోలాజికల్ సైన్స్ పోస్టులకు ఆయా సబ్జెక్టులకు ప్రాధాన్యమిస్తూ 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

భాషా పండితులు
భాషా పండితుల పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు, పార్టు - 2లో  శిశు అృవద్ధి, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలుంటాయి. పార్టు - 3లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషల్లో అభ్యర్థి ఎంచుకున్న భాషలో సాహిత్యాంశాలు, బోధనాంశాతో 70 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధన పద్ధతులపై 30 మార్కులకు, పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్‌లో సబ్జెక్టు, బోధనాంశాలపై 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

పీఈటీ పోస్టులకు
పీఈటీ పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 30 మార్కులకు, పార్టు- 2లో ఇంగ్లిష్ గ్రామర్ బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.  పార్టు - 3లో ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులో 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ, చరిత్ర, ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, మెటీరియల్స్ అండ్ మెథ డ్స్, అనాటమీ, ఫిజియాలజీ, కినెసియాలజీ (అవయవాల కదలిక), హెల్త్ ఎడ్యుకేషన్, సేఫ్టీ ఎడ్యుకేషన్, ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్‌సైజ్, యోగా, ఆఫీషియేటింగ్, కోచింగ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై సిలబస్ ప్రకటించారు.

ఎస్జీటీ పోస్టులకు సిలబస్
ఎస్జీటీ పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు ప్రశ్నలుంటాయి.

* పార్టు - 2లో శిశు అృవద్ధి, బోధన పద్ధతులపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పార్టు - 3లో  తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషల్లో అభ్యర్థి ఎంచుకున్న భాషలో సాహిత్యాంశాలు, బోధనాంశాలతో 35 మార్కులకు ప్రశ్నలిస్తారు.

* పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధన పద్ధతులపై 35 మార్కులకు, పార్టు - 5లో గణితం సబ్జెక్టు, బోధన పద్ధతులపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

* పార్టు - 6లో పర్యావరణ శాస్త్రం 1, 2 కింద సబ్జెక్టు బోదన  పద్ధతులపై 40 మార్కులకు సిలబస్ ఇచ్చారు. ఇందులో జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనమిక్స్ తదితర అంశాలను పొందుపరిచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement