Teachers eligibility test
-
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. కాగా, ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 15 వ తేదీన రెండు సెషన్స్ లో పరీక్ష ఉంటుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు., రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష.., సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యమైన తేదీలు దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2 దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16 రాతపరీక్ష: సెప్టెంబర్ 15 పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఫీజు: రూ.400 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో వెబ్సైట్: https://tstet.cgg.gov.in 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు? తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకుంటారు. తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది. -
టెట్ హాల్ టికెట్‌పై సన్నీ లియోన్ ఫోటో!
బెంగళూరు: ఎగ్జామ్ హాల్‌టికెట్‌పై సన్నీ లియోన్ ఫోటో కలకలం. దీంతో సీరియస్ అయిన విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు నవంబర్ 6న జరిగే కర్ణాటక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్-2022)కి హాజరయ్యేందుకు యువతి హాల్ టికెట్ డౌన్‌లౌడ్ చేయగా ఒక్కసారిగా ఖంగుతుంది. దీంతో ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా హల్ టికేట్ స్క్రీన్ షాట్లను షేర్చేసి తన గోడు వెల్లబోసుకుంది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో విద్యాశాఖ సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించింది. ఈ ఘటన కర్ణాటకలోని రుద్రప్ప కాలేజీ అభ్యర్థికి ఎదురైంది. దీంతో సదరు కాలేజ్ ప్రిన్స్‌పాల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే పోలీసుల విచారణంలో యువతి ఆన్లైన్లో దరఖాస్తును పూర్తి చేయలేదని వేరేవాళ్లు పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అభ్యర్థులే ఆన్లైన్లో దరఖాస్తు అప్లై చేసుకునేలా యూజర్ ఐడీ పాస్వర్డ్ రూపొందించామని తెలిపింది. దీనిలో ఎవరూ జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉండదని స్పష్టం చేసింది. ఇది అభ్యర్థి నేరుగా అప్లై చేసుకోవాలి కాబట్టి విద్యాశాఖ పాత్ర ఉండదని తేల్చి చెప్పింది. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ పోలీసులను కోరింది. (చదవండి: ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి.. ఏమైందో ఏమో కత్తితో పొడిచి...) -
ఉపాధ్యాయ నియామకాలకు కొత్త సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు కొత్త సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టెర్ట్)లను కలిపి ఈసారి ఒకే పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తున్నందున ఈ కొత్త సిలబస్‌ను రూపొందించారు. ఈసారి టెర్ట్లో మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలలన్నిటినీ కలుపుకొని 10,313 పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్), లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్, సెకండరీ ఎడ్యుకేషన్ టీచర్లు (ఎస్జీటీ)కు వేర్వేరు సిలబస్‌ను ప్రకటించారు. ఆయా విభగాల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల్లోని నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేసేలా పలు అంశాలను ఇందులో చేర్చారు. గతంలో టెట్‌కు ఒక సిలబస్, డీఎస్సీకి మరో సిలబస్ ఉండేది. ఈసారి అందుకు భిన్నంగా రెండింటినీ కలపడంతో పాటు మరిన్ని కొత్త అంశాలను కూడా జోడించారు. అభ్యర్థుల నైపుణ్యాల పరిశీలన లక్ష్యంగా, వారికి అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఉండేలా దీనిని రూపొందించారు. ఈ సిలబస్ సమగ్ర సమాచారాన్ని ‘ఏపీడీఎస్సీ.సీజీజీ.జీఓవీ.ఇన్’ అనే వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ సిలబస్ ప్రకారం భాషా పండితుల పోస్టులకు ఆయా భాషలపై ప్రాధాన్యమిస్తూ ఇచ్చే ప్రశ్నలు 70 మార్కులకు మాత్రమే ఉంటాయి. మిగతా 130 మార్కులు భాషా పండితులకు సంబంధం లేనివే ఉంటాయి. ఇంగ్లిష్ (గ్రామర్), గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టు అంశాలతో పాటు బోధనాంశాలపై వారికి ప్రత్యేక సిలబస్‌ను ఇచ్చారు. పీఈటీలకు 180 మార్కులకు, మిగతా అన్ని విభాగాల్లో 200 మార్కులకు సిలబస్‌ను ఇచ్చారు. పీఈటీలకు కూడా ఈసారి కొత్త అంశాలను చేర్చారు. స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్) పోస్టులకు సిలబస్ * తెలుగు, ఉర్దూ, హింద, తమిళ్, కన్నడ, ఒరి యా, సంస్కృతం పోస్టులకు పార్ట్ - 1లో జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్లలో 10 మార్కుల ప్రశ్నలుంటాయి. * పార్టు- 2లో శిశు అభివృద్ధి, బోధన అంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తా రు. పార్టు - 3లో భాషలకు సంబంధించిన అం శాలతో పాటు అందులోని బోధనా పద్ధతులపై 70 మార్కులు ఉంటాయి. * పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్న లు ఉంటాయి. పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులు, వాటి బోధనా విధానాల పై 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్లు (నాన్ లాంగ్వేజెస్) సిలబస్ వీరికి నాన్ లాంగ్వేజెస్‌లో ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయోలాజికల్ సైన్స్లకు వేర్వేరు సిలబస్‌లను ప్రకటించారు. ప్రతి పేపర్లో పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు, పార్టు - 2లో శిశు అభివృద్ధి, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. * పార్టు - 3 నుంచి సబ్జెక్టులవారీగా కొన్ని మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లిష్‌లో పార్టు - 3లో ఇంగ్లిష్ భాష, బోధన నైపుణ్యాలపై 70 మార్కులకు, పార్టు- 4 లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కృతం భాషలపై అభ్యర్థి ఆప్షన్‌ను అనుసరించి సంబంధిత భాషల సాహిత్యాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలిస్తారు. * పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్‌లలో 60 మార్కులకు ప్రశ్నలిస్తారు. గణితంలో పార్టు - 3లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషలను ఆప్షన్‌గా పెట్టుకున్న వారికి ఆయా భాషల సాహిత్యాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలిస్తారు. * పార్టు - 4 లో ఇంగ్లిష్ భాష, బోధన నైపుణ్యాలపై 30 మార్కులకు, పార్టు - 5లో గణితం, సైన్సు సబ్జెక్టు బోధన పద్ధతులపై 100 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఇందులో గణితంలో 70 మార్కులకు, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టులలో చెరొక 15 మార్కులకు ప్రశ్నలిస్తారు. ఇదే కేటగిరీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయోలాజికల్ సైన్స్ పోస్టులకు ఆయా సబ్జెక్టులకు ప్రాధాన్యమిస్తూ 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. భాషా పండితులు భాషా పండితుల పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు, పార్టు - 2లో శిశు అృవద్ధి, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలుంటాయి. పార్టు - 3లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషల్లో అభ్యర్థి ఎంచుకున్న భాషలో సాహిత్యాంశాలు, బోధనాంశాతో 70 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధన పద్ధతులపై 30 మార్కులకు, పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్‌లో సబ్జెక్టు, బోధనాంశాలపై 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పీఈటీ పోస్టులకు పీఈటీ పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 30 మార్కులకు, పార్టు- 2లో ఇంగ్లిష్ గ్రామర్ బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పార్టు - 3లో ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులో 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ, చరిత్ర, ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, మెటీరియల్స్ అండ్ మెథ డ్స్, అనాటమీ, ఫిజియాలజీ, కినెసియాలజీ (అవయవాల కదలిక), హెల్త్ ఎడ్యుకేషన్, సేఫ్టీ ఎడ్యుకేషన్, ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగా, ఆఫీషియేటింగ్, కోచింగ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై సిలబస్ ప్రకటించారు. ఎస్జీటీ పోస్టులకు సిలబస్ * ఎస్జీటీ పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు ప్రశ్నలుంటాయి. * పార్టు - 2లో శిశు అృవద్ధి, బోధన పద్ధతులపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పార్టు - 3లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషల్లో అభ్యర్థి ఎంచుకున్న భాషలో సాహిత్యాంశాలు, బోధనాంశాలతో 35 మార్కులకు ప్రశ్నలిస్తారు. * పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధన పద్ధతులపై 35 మార్కులకు, పార్టు - 5లో గణితం సబ్జెక్టు, బోధన పద్ధతులపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. * పార్టు - 6లో పర్యావరణ శాస్త్రం 1, 2 కింద సబ్జెక్టు బోదన పద్ధతులపై 40 మార్కులకు సిలబస్ ఇచ్చారు. ఇందులో జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనమిక్స్ తదితర అంశాలను పొందుపరిచారు. -
ఫిబ్రవరి 9న టెట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) వచ్చే నెల 9న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగో టెట్ నిర్వహణకు అనుమతి ఇస్తూ శుక్రవారం మెమో (22120) జారీ చేసింది. రాష్ట్రంలో 1,975 కేంద్రాల్లో నిర్వహించనున్న టెట్‌కు 4,49,902 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు పాఠశాల విద్య డెరైక్టర్ వాణిమోహన్ తెలిపారు. 9వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. హాల్ టికెట్ల జారీకి సంబంధించిన వివరాలను ఈ నెల 18న వెల్లడించనున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై విద్యా శాఖ దృష్టి సారించింది. డీఎస్సీ లేదు..! టెట్ నిర్వహణకు ఓకే చెప్పిన ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు మాత్రం ఆమోదం తెలుపలేదు. ప్రస్తుతం టెట్ నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర ప్రక్రియకే ఫిబ్రవరి నెల దాటిపోనుంది. ఆ తర్వాత ఎన్నికల హడావుడి మొదలయ్యే పరిస్థితి నెలకొనడంతో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం ఓకే చెప్పలేదు. మరోవైపు ప్రస్తుతం ప్రకటించిన టెట్ నిర్వహణపై కూడా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు.. ప్రస్తుత పరిణామాలు.. ఈనెల 23 తర్వాత నెలకొనే పరిస్థితుల ప్రభావం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో టెట్ పరీక్ష నిర్వహణకు తేదీలు ఖరారు చేసిన తర్వాత కూడా మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
డిసెంబర్ చివరిలో టెట్!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను డిసెంబర్ నెలాఖరులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డీ ఎస్సీ నిర్వహణపై మాత్రం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది. టెట్ నిర్వహిస్తే ఆ వెనువెంటనే డీఎస్సీ నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెట్, డీఎస్సీ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి మాత్రం టెట్‌ను నిర్వహించేందుకు సిద్ధం కావాలని, ఈమేరకు ప్రతిపాదనలు పంపిం చాలని రెండు రోజుల కిందట అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందుగా టెట్ నిర్వహణకు ముందు ప్రతిపాదనలు పంపి మిగతా అంశాలను తరువాత పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా టెట్ కోసం ఫీజు చెల్లించిన 4.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. -
టెట్ ఎప్పుడు?
మోర్తాడ్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో వాయిదా పడిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఎప్పుడు నిర్వహిస్తారా.. అని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్యమ ప్రభావం తగ్గడంతో పరీక్ష నిర్వహించవచ్చనే చాలామంది భావిస్తున్నారు. మరోవైపు టెట్‌ను నిర్వహించడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. పది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయని ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో బీఈడీ, టీటీసీ పూర్తి చేసినవారు వేల సంఖ్యలో ఉన్నారు. వీరు జూలైలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 50 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. సెప్టెంబర్‌లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. దీంతో ప్రభుత్వం టెట్‌ను వాయిదా వేసింది. పరీక్ష వాయిదా పడడంతో అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు కొద్ది రోజుల క్రితం సమ్మె విరమించారు. దీంతో టెట్‌ను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు టెట్ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర మాధ్యమిక శాఖ ఉన్నతాధికారులు అందించినట్లు సమాచారం. టెట్ నిర్వహిస్తారన్న సమాచారం తెలియడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. వారు పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నారు. డీఎస్సీ నిర్వహించాలి.. టెట్ నిర్వహించిన వెంటనే డీఎస్సీ చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం అదిగో.. ఇదిగో అంటూ నాన్చకుండా టెట్ తర్వాత వెంటనే డీఎస్సీని నిర్వహించాలని బీఈడీ, టీటీసీ, పీఈటీ తదితర అభ్యర్థులు కోరుతున్నారు.