
బెంగళూరు: ఎగ్జామ్ హాల్‌టికెట్‌పై సన్నీ లియోన్ ఫోటో కలకలం. దీంతో సీరియస్ అయిన విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు నవంబర్ 6న జరిగే కర్ణాటక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్-2022)కి హాజరయ్యేందుకు యువతి హాల్ టికెట్ డౌన్‌లౌడ్ చేయగా ఒక్కసారిగా ఖంగుతుంది. దీంతో ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా హల్ టికేట్ స్క్రీన్ షాట్‌లను షేర్‌చేసి తన గోడు వెల్లబోసుకుంది.
ఈ ఫోటోలు వైరల్ కావడంతో విద్యాశాఖ సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించింది. ఈ ఘటన కర్ణాటకలోని రుద్రప్ప కాలేజీ అభ్యర్థికి ఎదురైంది. దీంతో సదరు కాలేజ్ ప్రిన్స్‌పాల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే పోలీసుల విచారణంలో యువతి ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తి చేయలేదని వేరేవాళ్లు పూర్తి చేసినట్లు తెలిపింది.
ఈ మేరకు విద్యాశాఖ అభ్యర్థులే ఆన్‌లైన్‌లో దరఖాస్తు అప్లై చేసుకునేలా యూజర్ ఐడీ పాస్‌వర్డ్ రూపొందించామని తెలిపింది. దీనిలో ఎవరూ జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉండదని స్పష్టం చేసింది. ఇది అభ్యర్థి నేరుగా అప్లై చేసుకోవాలి కాబట్టి విద్యాశాఖ పాత్ర ఉండదని తేల్చి చెప్పింది. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ పోలీసులను కోరింది.
(చదవండి: ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి.. ఏమైందో ఏమో కత్తితో పొడిచి...)
Comments
Please login to add a commentAdd a comment