
సన్నీలియోన్
కర్ణాటక, శివాజీనగర : బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ‘వీర మహాదేవి’ సినిమాలో నటించరాదని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక యువసేనా కార్యకర్తలు నగరంలో సోమవారం ధర్నా నిర్వహించారు. వీర మహాదేవి సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మళయాళంతో పాటు ఐదు భాషల్లో రూ.100 కోట్ల ఖర్చుతో నిర్మాణమవుతుండగా, నిర్మాత డీ.సీ.వాడి ఉదయన్, సన్ని లియోన్‌ల వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్ని లియోన్ సినిమాలో నటించరాదని, ఒకవేళ నటిస్తే, సినిమాను రాష్ట్రంలో విడుదలను అడ్టుకుంటామని ఆందోళనకారులు హెచ్చరించారు.
సన్ని లియోన్‌పై ప్రజల్లో తమదైన అభిప్రాయం ఉందని, ఇటువంటి నటి వీర రాణి సినిమాలో కనిపించరాదు. అది వీర మహాదేవికి చేసే అవమానమన్నారు. అందుచేత సినిమాలో సన్ని లియోన్‌కు అవకాశం కల్పించరాదని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సన్ని లియోన్, నిర్మాత చిత్రపటాలకు నిప్పు పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్నా చేస్తున్న కరవే కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment