ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను డిసెంబర్ నెలాఖరులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను డిసెంబర్ నెలాఖరులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డీ ఎస్సీ నిర్వహణపై మాత్రం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది. టెట్ నిర్వహిస్తే ఆ వెనువెంటనే డీఎస్సీ నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెట్, డీఎస్సీ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి మాత్రం టెట్‌ను నిర్వహించేందుకు సిద్ధం కావాలని, ఈమేరకు ప్రతిపాదనలు పంపిం చాలని రెండు రోజుల కిందట అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందుగా టెట్ నిర్వహణకు ముందు ప్రతిపాదనలు పంపి మిగతా అంశాలను తరువాత పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా టెట్ కోసం ఫీజు చెల్లించిన 4.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.