ఎన్నికల వేళ.. | Is exercise the management of education department | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ..

Published Sun, Mar 23 2014 4:15 AM | Last Updated on Wed, Oct 17 2018 6:14 PM

ఎస్సెస్సీ పరీక్షలకు  నిర్వహణ విద్యాశాఖ కసరత్తు - Sakshi

ఎస్సెస్సీ పరీక్షలకు నిర్వహణ విద్యాశాఖ కసరత్తు

ఈనెల 27 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు
 నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు
 బిజీ.. బిజీగా అధికారులు

 నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : ఓ వైపు ఎన్నికల కోలాహలం.. మరోవైపు పదవ తరగతి పరీక్షల నిర్వహణ విద్యాశాఖకు కత్తిమీద సాములా మారింది. అయితే ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది వరకే వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాల డెరైక్టర్ మన్మద్‌రెడ్డి విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఈనెల 27 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

జిల్లావ్యాప్తంగా 40,627 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. అందులో 17,745 మంది బాలికలు, 18,394 మంది బాలురు ఉన్నారు. ప్రైవేట్‌లో 4,488 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లాలో మొత్తం 193 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఏప్రిల్ 25 వర కు కొనసాగుతాయి. పరీక్షల సమయంలో విద్యాశాఖకు చెందిన సిబ్బందికి ఎన్నికల డ్యూటీ విధించడం సమస్యగా మారిందని అధికారు లు పేర్కొంటున్నారు.

అయితే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ టీచర్లను ఈసారి పరీక్షలను వినియోగిస్తున్నారు. పరీక్షలకు 3వేల మంది సిబ్బంది అవసరం ఉండగా విద్యాశాఖకు చెందిన వారిని పూర్తి స్థాయిలో కేటాయిం చారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుం టున్నారు. పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్టమెంటల్ ఆఫీసర్ల నియామకం కూడా పూర్తయ్యింది. పరీక్షలు మరో నలుగు రోజులే ఉండడంతో  విద్యాశాఖ ప్రధానంగా దృష్టి పెట్టింది.

ఈసారి పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వస్తే కారణాలు తెలుసుకోవడం, సంతృప్తిగా ఉంటేనే అనుమతించడం లాంటి విధానాలు చేపడుతున్నారు. ఈ క్రమం లో విద్యార్థులకు అసౌకర్యం కలుగ కుండా చూడాలని అధికారులు భావి స్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement