విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ :
జిల్లాలో బోగస్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ప్రారంభమైన సీబీసీఐడీ విచారణ మంగళవారం రెండో రోజు కొనసాగింది. ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 99 మంది టీచర్లు పదోన్నతులు పొందారనే అభియోగాలతో జిల్లా విద్యాశాఖాధికారులు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సీబీసీఐడీ విభాగం ఏఎస్సై గోవర్ధన్ డీఈఓ కార్యాలయూనికి వచ్చి డీఈఓ విజయకుమార్‌తో, ఏడీ యస్థాని అహ్మద్‌తో సమావేశమై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటిరోజు 37 మంది టీచర్లు తమ సర్టిఫికెట్లను అందజేసిన విషయం తెలిసిందే. రెండోరోజు మంగళవారం కూడా మరికొందరు టీచర్లు డీఈఓ కార్యాలయానికి వచ్చి సంబంధిత ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లోని సీనియర్ అసిస్టెంట్‌కు ఓ ప్రొఫార్మాలో వివరాలతోపాటు విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు టీచర్లు మాట్లాడుతూ తాము సరి యైన సర్టిఫికెట్లతోనే పదోన్నతులు పొందామని, అరుుతే తమపై అనవసరంగా జిల్లా విద్యాశాఖాధికారులు సీబీసీఐడీకి ఫిర్యాదుచేశారని, తా మంతా మానసికంగా వే దనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆ యా టీచర్లు అందజేసిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను ఒకటి రెండురోజుల్లో సీబీసీఐడీ అధికారులు తీసుకోబోతున్నా రు. ఆ తర్వాత ఆయా విద్యార్హతల జిరాక్స్ కాపీలను సంబంధిత యూనివర్సిటీలకు తీసుకెళ్లి పరి శీలించి, అసలువా ? నకిలీవా అనే విషయూన్ని నిర్ధారించనున్నారు. ఒరి జినల్ సర్టిఫికెట్లు కలిగిన టీచర్లపై కేసులుండవని భావిస్తున్నారు. అందువల్ల అసలైన సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందినవారు అందోళన చెందాల్సిన అవసరం లేదని సీబీ సీఐడీ అధికారులు కూడా భరోసా ఇస్తున్నారు. 99 మంది లో 82 మంది ఉపాధ్యాయులు ఇప్పటి వరకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లను డీఈఓ కార్యాలయంలోని ఎస్టాబ్లిష్‌మెం ట్ సెక్షన్‌లోని సీనియర్ అసిస్టెంట్‌కు అందజేశారు. త్వరలో నే అసలెవరో నకిలీ ఎవరో తేల్చే అవకాశాలున్నాయి.
రెండో రోజూ కొనసాగిన సీబీసీఐడీ విచారణ
Published Wed, Oct 23 2013 3:28 AM | Last Updated on Sat, Sep 15 2018 5:09 PM
Advertisement
Advertisement