
సాక్షి, హైదరాబాద్: స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అధికారులు అనుమతించారు. అయితే, మల్టీజోన్–2 పరిధిలో కోర్టు స్టే కారణంగా స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు బదిలీలు చేపట్టడం లేదని, 33 జిల్లాల్లో ప్రభుత్వ టీచర్లకు మాత్రం బదిలీలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం మంగళవారం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment