శ్రీకాకుళం: ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు తక్షణమే పదోన్నతులను కల్పించాలని లేని పక్షంలో ఆందోళన ఉ«ధృతం చేస్తామని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కోరుతూ మూడో రోజు ధర్నాను ఆదివారం రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా ధర్నా చేస్తున్నా ఆశించిన రీతిలో పదోన్నతుల ఫైలులో కదలిక లేకపోవడం శోచనీయమన్నారు. పదోన్నతులతోపాటు సబ్జెక్టుల వారీగా రోస్టర్ పాయింట్ల జాబితా కాపీని విడుదల చేసి ప్రతి ఉపాధ్యాయునికి అందజేయాలని yì మాండ్ చేశారు. ధర్నాలో యూటీఎఫ్ పట్టణ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, పి.సూర్యప్రకాశరావు, ఎస్‌ఎస్ ప్రధాన్, ఎ.చిన్నవాడు, టి.వైకుంఠరావు, పి.మోహనరావు, డీవీ సత్యనారాయణ, వి.త్రినాథరావు, బి.శ్రీకాంత్, అర్జునరావు, కనకరాజు, రామదాసు, బి.వెంకటరావు, టి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.