శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేటగిరీలలో ఏర్పడిన 30 ఖాళీలను అర్హత గల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో పదోన్నతుల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారి మంగళవారం తెలిపారు.
ఖాళీల వివరాలు:
స్కూల్ అసిస్టెంట్ సోషల్ జిల్లా పరిషత్ 7, ప్రభుత్వ 1, స్కూల్ అసిస్టెంట్ తెలుగు జెడ్పీ ఒకటి, స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం జిల్లా పరిషత్ 2, ప్రభుత్వ 1, స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం (ఒరియా) జిల్లా పరిషత్ 1, స్కూల్ అసిస్టెంట్ బ్యాక్‌లాగ్ (ఎస్టీ) జిల్లా పరిషత్ 2, స్కూల్ అసిస్టెంట్ ఆగ్లం బ్యాక్‌లాగ్ శ్రీస్టీ) జిల్లా పరిషత్ 5, ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుడు, తెలుగు: జిల్లా పరిషత్ 8, ప్రభుత్వ 1,ఒరియా: జిల్లా పరిషత్ 2. ఏజెన్సీ: జిల్లా పరిషత్ 2.
పైన పేర్కొన్న ఖాళీలకు అర్హత గల ఉపాధ్యాయులు ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిమిత్తం వారివారి సేవా పుస్తకాలతో పాటు ఒరిజనల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. అలాగే పదోన్నతి కౌన్సెలింగు అదే రోజున సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
పదోన్నతుల ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ
Published Wed, Dec 18 2013 3:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement