మార్చి ఒకటిన నిర్వహించాల్సిన స్కూలు అసిస్టెంట్ల పదోన్నతి కౌన్సెలింగ్ వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) డి.దేవానందరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : మార్చి ఒకటిన నిర్వహించాల్సిన స్కూలు అసిస్టెంట్ల పదోన్నతి కౌన్సెలింగ్ వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) డి.దేవానందరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి మార్చి నాలుగున నిర్వహించనున్నట్లు వివరించారు. స్కూలు అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్ డెరైక్టర్ ఉపాధ్యాయుల పదోన్నతి జాబితాను deokrishna. yolsite.com లో ఉంచినట్లు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే శనివారం డీఈవో కార్యాలయంలో స్వయంగా వచ్చి తెలియపరచాలని సూచించారు. మార్చి ఒకటిన నిర్వహించాల్సి ఉన్న ప్రధానోపాధ్యాయుల పదోన్నతి కౌన్సెలింగ్ మాత్రం యథావిధిగా జరుగుతుందని డీఈవో తెలిపారు.