De. Devananda Reddy
-
21 వరకు ఒంటిపూట బడులు
మచిలీపట్నం : పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ఈనెల 21వ తేదీ శనివారం వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈవో డి.దేవానందరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలలు పని చేస్తాయని పేర్కొన్నారు. -
గుర్తింపు లేని స్కూళ్లు 145
అనుమతిలేకుండా తరగతులు నిర్వహిస్తే రూ.లక్ష జరిమానా పబ్లిక్ పరీక్షలకు పంపేది లేదు డీఈవో వెల్లడి మచిలీపట్నం : జిల్లాలో గుర్తింపులేని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కొరఢా ఝుళిపించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తే లక్ష రూపాయలు జరిమానా విధించనున్నారు. రెండేళ్ల కిందట 235పైగా గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది ఆ సంఖ్య 145కు చేరింది. వాటిలో 33 ప్రాథమిక, 34 ప్రాథమికోన్నత, 78 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వేసవి సెలవుల అనంతరం గుర్తింపు లేని పాఠశాలలను తెరిస్తే లక్ష రూపాయలు జరిమానా విధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో పాటు అదనంగా రోజుకు రూ.10వేలు చొప్పున జరిమానా వసూలు చేయనున్నట్లు డీఈవో డి.దేవానందరెడ్డి తెలిపారు. గుర్తింపు లేని పాఠశాలలకు నోటీసులు జారీ చేశామని, యాజమాన్యాలు త్వరగా గుర్తింపు పొందాలని సూచించారు. ఆ జాబితా ఎంఈవోలకు పంపామని, డీఈవో వెబ్సైట్లో కూడా ఉన్నాయని తెలిపారు. పబ్లిక్ పరీక్షలకు ప్రవేశం లేదు... ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి సిలబస్ మారింది. ఈ నేపథ్యంలో పాఠశాల ఉపాధ్యాయులు 20 ఇంటర్నల్ మార్కులు ఇవ్వాల్సి ఉంది. గుర్తింపు లేని పాఠశాలల్లో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ఇంటర్నల్ మార్కులు వేసే అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గుర్తింపు లేని పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు పంపే అవకాశం ఉండదని డీఈవో తెలిపారు. ప్రైవేటు విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నుంచి రెగ్యులర్‌గా పబ్లిక్ పరీక్షలు రాసే వెసులుబాటును ప్రభుత్వం తొలగించినట్లు చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే చేర్చాలని ఆయన కోరారు. -
నేడే టెట్ ఏర్పాట్లు పూర్తి
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ఈ నెల 16న జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి.దేవానందరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష తొమ్మిది కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష 67 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణకు 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 134 మంది సూపరింటెండెంట్లు, 12 మంది రూట్ ఆఫీసర్లు, 748 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. అభ్యర్థులు పరీక్షా సమయం కంటే గంట ముందే పరీక్షా కేంద్రం వద్దకు రావాలని ఆయన సూచించారు. పరీక్షా కేంద్రంలోకి అరగంట ముందే అనుమతిస్తామని తెలిపారు. పరీక్షా సమయం దాటి ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల్లో తాగునీరు, వైద్య, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు డీఈవో తెలిపారు. -
స్కూలు అసిస్టెంట్ల పదోన్నతి కౌన్సెలింగ్ వాయిదా
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : మార్చి ఒకటిన నిర్వహించాల్సిన స్కూలు అసిస్టెంట్ల పదోన్నతి కౌన్సెలింగ్ వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) డి.దేవానందరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి మార్చి నాలుగున నిర్వహించనున్నట్లు వివరించారు. స్కూలు అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్ డెరైక్టర్ ఉపాధ్యాయుల పదోన్నతి జాబితాను deokrishna. yolsite.com లో ఉంచినట్లు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే శనివారం డీఈవో కార్యాలయంలో స్వయంగా వచ్చి తెలియపరచాలని సూచించారు. మార్చి ఒకటిన నిర్వహించాల్సి ఉన్న ప్రధానోపాధ్యాయుల పదోన్నతి కౌన్సెలింగ్ మాత్రం యథావిధిగా జరుగుతుందని డీఈవో తెలిపారు.