మచిలీపట్నం : పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ఈనెల 21వ తేదీ శనివారం వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈవో డి.దేవానందరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలలు పని చేస్తాయని పేర్కొన్నారు.