బుధవారం కొంత మేర ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ వరుసగా వారం రోజులుగా విజృంభించిన ప్రచంఢభానుని ప్రతాపానికి గురై అస్వస్థతకు గురైనవారిలో 15 మంది మృత్యువాత పడ్డారు.
కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : మచిలీపట్నంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పట్టణంలోని అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో మారం లక్ష్మి (55) మృతిచెందింది. వృద్ధాశ్రమ నిర్వాహకురాలు కరెడ్ల సుశీల, వృద్ధాశ్రమంలోని వృద్ధులు ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించి మౌనం పాటించారు. అనంతరం ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. అలాగే మచిలీపట్నంలోని బలరామునిపేటలో ఆబోతు రవి కుమారుడు మణికంఠ (6) మృతిచెందాడు.వైఎస్సార్ సీపీ 37వ వార్డు కౌన్సిలర్ లంక సూరిబాబుతో పాటు పార్టీ నాయకులు పిన్నింటి శ్రీను, పోతన బాలచందర్ తదితరులు మణికంఠ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
చిట్టూర్పు గ్రామంలో...
ఘంటసాల : మండల పరిధిలోని చిట్టూర్పు గ్రామానికిచెందిన పరుచూరి నిర్మలమ్మ (75) మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. మృతురాలి భర్త కొంతకాలం క్రితం మరణించగా ఈమెకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు.
కొమరోలులో...
పామర్రు : మండల పరిధిలోని కొమరవోలు గ్రామానికి చెందిన కోటే బాబూరావు(58) మృతి చెందాడు. మృతుని కుమార్డు కోటే సాంబశివరావు ఫిర్యాదు మేరకు పామర్రు ఎస్‌ఐ విల్సన్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మర్రిమాడలో....
పమిడిముక్కల : మండలంలోని మర్రివాడగ్రామంలో జి వీరవెంకటాచలం(30) చనిపోయారు. బంధువులు సమాచారమందించడంతో తహశీల్దార్ జి.మహేశ్వరరావు , మండలవైద్యాధికారి ఎస్.ప్రసన్నకుమార్ , ఎస్‌ఐ నరేష్‌కుమార్ మతదేహన్ని పరిశీలించారు
వడ్లమానులో...
వడ్లమాను (ఆగిరిపల్లి) : మండల పరిధిలోని వడ్లమానుకు చెందిన వృద్ధురాలు జలసూత్రం పాపమ్మ (95) నాలుగు రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
కౌతవరంలో...
కౌతవరం (గుడ్లవల్లేరు) : కౌతవరం చిన కాశీగూడెంకు చెందిన వేముల నాగేశ్వరరావు(57) మృతి చెందారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, భార్య ఉన్నారు. మృతుని కుటుంబాన్ని స్థానిక సర్పంచి పడమటి సుజాత, వేమవరం శ్రీ కొండలమ్మ ఆలయ మాజీ ధర్మకర్త పడమటి నాంచారయ్య పరామర్శించారు.
మొవ్వ మండలంలో ఇద్దరు...
కూచిపూడి : మొవ్వ మండలం వేములమడలో ఇద్దరు మృతిచెందినట్లు సర్పంచిమురారి శ్రీనివాసరావు తెలిపారు. కుంపటివానిగూడెంలో కుందేటి చింతయ్య (50) మృతిచెందాడని ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారని చెప్పారు. అలాగే వేములమడలోని ఆంజనేయస్వామి ఆలయం ప్రాంతంలో జన్ను వెంకమ్మ (78) మృతిచెందిందని తెలిపారు.
మునగచర్లలో...
నందిగామ రూరల్ : నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన ఘంటా హనుమంతురావు (57 మంగళవారం మృతి చెందాడు.
మోపిదేవిలో....
వికలాంగుల కాలనీ(మోపిదేవి) : మోపిదేవి వికలాంగుల కాలనీలో నివాసం ఉంటున్న కారుమూరి బుజ్జిమ్మ(52) మృతిచెందింది. మృతురాలికి భర్త బాబూరావు, ఇద్దరు కుమార్లు, ఒక కుమార్తె ఉన్నారు.
తెంపల్లెలో....
తెంపల్లె (గన్నవరం రూరల్) : మండలంలోని తెంపల్లె గ్రామానికి చెందిన రైతు కొలుసు సోమయ్య (50) మృతి చెందారు. మృతి చెందిన సోమయ్య భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు, గ్రామస్తులు సందర్శించారు.
గౌరారంలో....
గౌరవరం(జగ్గయ్యపేట అర్బన్ ) : పేట మండలంలోని గౌరవరం గ్రామానికి చెందిన కొప్పుల మహాలక్ష్మయ్య (75 మృతిచెందాడు.
సూరంపాలెంలో...
చాట్రాయి : మండలంలోని సూరంపాలెం గ్రామానికి చెందిన మేడా నాగేశ్వరరావు(65) బుధవారం సాయంత్రం వడదెబ్బ తగిలి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.
పొట్టిపాడులో...
ఉంగుటూరు : పొట్టిపాడు గ్రామానికి చెందిన చిట్టెటి గురునాధం(51) మృతి చెందినట్లు బంధువులు సమాచారం అందించారు.
వడదెబ్బకు 15 మంది మృత్యువాత
Published Thu, Jun 19 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM
Advertisement
Advertisement