
10,603 టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి గంటా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఖాళీలను త్వరలో భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 10,603 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,845, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 7,594, భాషా పండితుల పోస్టులు 975, పీఈటీ పోస్టులు 185 ఉన్నాయని చెప్పా రు.
సెప్టెంబర్ 5వ తేదీ గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ బీఈడీ చేసిన వారిని సెకండరీ ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించాలా వద్దా అన్న విషయమై ఆలోచన చేయలేదన్నారు. టెట్ తొలగిం పుకు సంబంధించి కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ముందుకెళతామన్నారు.