ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్‌ | Kinjarapu Atchannaidu Discharged From Guntur Government Hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్‌

Published Wed, Jul 1 2020 6:17 PM | Last Updated on Wed, Jul 1 2020 9:16 PM

Kinjarapu Atchannaidu Discharged From Guntur Government Hospital - Sakshi

సాక్షి, గుంటూరు: ఈఎస్‌ఐ కుంభకోణం కేసుల అరెస్ట్‌ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు. కాగా, ఈఎస్‌ఐ స్కామ్‌ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే  ఆయన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు జీజీహెచ్‌లోనే మూడు రోజుల పాటు అచ్చెన్నాయుడును విచారించారు. తాజాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.(చదవండి : ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆచితూచి అడుగులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement