ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక | ESI scam: TDP MLA Atchannaidu | Sakshi
Sakshi News home page

ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక

Published Fri, May 3 2024 1:10 AM | Last Updated on Fri, May 3 2024 1:40 AM

ESI scam: TDP MLA Atchannaidu

కార్మిక శాఖ మంత్రి అంటే కార్మికులకు న్యాయం చేయాలి. కానీ అచ్చెన్నాయుడు రూటే సెప‘రేటు’. శ్రామిక సోదరుల కోసం కొనాల్సిన మందుల్లోనూ దందా నడిపారు. వైద్యపరికరాలు ఎక్కువ ధరకు కోట్‌ చేసి, బినామీలను తెర మీదకు తెచ్చి, మందు బిల్లుల్లో మాయలు చేసి రూ.150 కోట్ల అక్రమానికి పాల్పడి అవినీతి మంత్రిగా ముద్ర పడ్డారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టయ్యి జిల్లా పరువు తీసేశారు. మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో దొరికిందే చాన్స్‌ అంటూ దోచుకున్నారు.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఈఎస్‌ఐ స్కామ్‌.. అచ్చెన్నాయుడు ఎన్నటికీ చెరపలేని అవినీతి మరక. మన జిల్లాకు చెందిన నాయకుడు రాష్ట్ర స్థాయిలో భారీ అవినీతికి పాల్పడిన వ్యవహారం మాయని మచ్చగా మిగిలిపోయింది. అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. 

కార్మికుల  కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150కోట్లకు పైగా జరిగిన స్కామ్‌లో సూత్రధారిగా నిలిచారు. కారి్మకుల సొమ్ము కాజేసిన అచ్చెన్న బండారం విజిలెన్స్‌ అధికారుల విచారణలో  బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్ల పనులు నామినేషన్‌పై అప్పగించాలని మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారుసు లేఖతో మొత్తం గుట్టు రట్టయ్యింది. వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132శాతం అధికంగా చెల్లించి కోట్లు కొట్టేశారు.  
  
అచ్చెన్న అవినీతి మార్క్‌ 
కారి్మక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్న తన మార్క్‌ అవినీతిని చూపించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్‌ను తాను చెప్పిన సంస్థకు నామినేటేడ్‌ కట్టబెట్టాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వగా ఆర్డర్‌ జారీ చేశారు. సిఫార్సుకు ముందు వారితో ఏ లాలూచీలు పడ్డారో తెలీదు గానీ తన లెటర్‌ హెడ్‌ ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తూచా తప్పకుండా అధికారులు పాటించారు. నామినేటేడ్‌లో కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఆ సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ ఇండెంట్లతో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్టు కూడా చేశారు.  

అవినీతి జరిగిందిలా... 
👉రూ. 293.51కోట్ల విలువైన మందులకు కొనుగోలు కేటాయింపులు చేయగా పరిమితికి మించి రేట్‌ కాంట్రాక్ట్‌ లేని సంస్థల నుంచి ఏకంగా రూ.698.36కోట్లు విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు.   

👉శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా రూ.6.62కోట్లు మేర చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70శాతం అధికం. 

👉ఫ్యాబ్రికేటేడ్‌ కొటేషన్స్‌ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. రాశి ఫార్మా, వీరేష్‌ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ. 15.93కోట్లు చెల్లించారు. ఇందులో రూ.5.70కోట్లు మేర అదనంగా చెల్లించినట్టు తేలింది.  

👉 కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించకుండా మూలనపడేశారు. జెర్సన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ అనే బినామీ సంస్థకు ఈఎస్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ సీకే రమే‹Ùకుమార్‌ రూ. 9.50కోట్లు చెల్లించారు.  

👉 ఒక్కో బయోమెట్రిక్‌ పరికరం ధర రూ.16,992 అయితే రూ.70,760చొప్పున నకిలీ ఇండెంట్లు సృష్టించి కొనుగోలు చేశారు.  

👉 ఈ క్రమంలో రశీదులు ఫోర్జరీ చేసి కోట్లు కొల్లగొట్టారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేటు కాంట్రాక్ట్‌లో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ల్యాబ్‌ కిట్లు, ఫరీ్నచర్, ఈసీజీ సరీ్వసులు, బయోమెట్రిక్‌ పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయి.  

👉 లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసినట్టు నకిలీ ఇండెంట్లు సృష్టించారు. ప్రభుత్వం రూ.89కోట్లు చెల్లిస్తే అందులో రేట్‌ కాంట్రాక్ట్‌లో ఉన్న సంస్థలకు రూ. 38కోట్లు చెల్లించారు. మిగతా రూ.51కోట్లను దారి మళ్లించారు.  

👉టెండర్లు లేకుండా నామినేషన్‌ కింద ఆర్డర్లు ఇవ్వడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దురి్వనియోగమైంది. 

అవుట్‌ సోర్సింగ్‌ దందా 
సాధారణంగా ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు అవసరమైన అభ్యర్థులను సమకూర్చే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీని కలెక్టర్‌ నియమించాలి. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్‌ ఇచ్చి, అర్హత గల ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే, వాటిలో సరైనదేదో నిర్ధారణ చేసుకుని ఎంపిక చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ఏజెన్సీలుగా నియమించి దందా చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి స్థాయిలోనే ఏ శాఖకు, ఏ ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ఉండాలి, ఆ ఏజెన్సీ ఎవరి చేతిలో ఉండాలన్నది ఫిక్స్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగలేదు. బినామీ ఏజెన్సీల ముసుగులో స్థానిక నేతలు చెలరేగి పోయి ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు బేరసారాలు సాగించారు. ఒక్కో పోస్టును రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి.    

అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. 
👉అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్‌ నంబర్‌ 04/ఆర్‌సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్‌ 13(1), (సీ), (డీ), ఆర్‌/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్‌ 408, సెక్షన్‌ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు.  

👉రూ. 975.79కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150కోట్ల పైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తేలి్చంది.
 
👉ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్‌ కిట్స్, ఫరీ్నచర్‌ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ. 975.79కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు.  

👉నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్‌ టెండర్లు కూడా పిలవలేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది.  

మొదటి నుంచీ అదే బాగోతం  
రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్‌ రుణాల్లో అక్రమాలు, సింగిల్‌ టెండర్‌ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్‌ టెండర్‌ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, దివాకర్‌ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఆరోపణలను అచ్చెన్న మూటగట్టుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement