
సాక్షి, అమరావతి: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా, అనారోగ్యం బారినపడ్డ అచ్చెన్నాయుడుకు రమేష్ ఆస్పత్రి, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రుల్లో చేర్పించి ప్రభుత్వం చికిత్స అందించింది. ఇదిలాఉండగా.. ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో 150 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
జూన్ 12వ తేదీన అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు.
(చదవండి: సిఫార్సు వేరు.. ఆర్డర్ వేరు)
Comments
Please login to add a commentAdd a comment