గుంటూరు మెడికల్(గుంటూరు ఈస్ట్): గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో శుక్రవారం పట్టపగలు మహిళలు మద్యం తాగుతూ పట్టుబడ్డ సంఘటన కలకలం రేపింది. గుంటూరుకు చెందిన తోకల లక్ష్మి రక్తస్రావంతో బాధపడుతూ చికిత్స కోసం 22న ఆస్పత్రిలోని చేరింది. ఆమెను పరామర్శిచేందుకు శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పొత్తూరు అలివేలు, దేవనబోయిన అంకమ్మ, బొజ్జా యశోధ, గుంటూరుకు చెందిన వీరవల్లి హిమబిందు వచ్చారు.
పరామర్శ అనంతరం వారు 107 వార్డు వద్ద భోజనం చేస్తూ మద్యం తాగడం ప్రారంభించారు. మత్తు ఎక్కాక గొడవ చేయడం ప్రారంభించడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపైనా దాడికి దిగారు. దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్ యనమల రమేశ్‌కు ఫిర్యాదు చేయటంతో ఆయన అవుట్‌పోస్ట్ పోలీసుల సాయంతో వారిని పట్టుకుని, మందలించి పంపించారు.
ఆస్పత్రిలో మద్యం తాగుతూ..
Published Sat, Mar 25 2017 2:26 AM | Last Updated on Tue, Aug 21 2018 3:45 PM
Advertisement
Advertisement