‘నర్సింగ్'పై నిర్లక్ష్యం | 'Neglected narsingpai | Sakshi
Sakshi News home page

‘నర్సింగ్'పై నిర్లక్ష్యం

Published Sat, Sep 20 2014 12:40 AM | Last Updated on Tue, Aug 21 2018 3:45 PM

‘నర్సింగ్'పై నిర్లక్ష్యం - Sakshi

‘నర్సింగ్'పై నిర్లక్ష్యం

గుంటూరు మెడికల్
 జిల్లాలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలోని ప్రభుత్వ నర్సింగ్ పాఠశాలతో పాటు, 26 ప్రైవేటు నర్సింగ్ పాఠశాలలు, 18 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ(జిఎన్‌ఎమ్)కోర్సు, బిఎస్సీ నర్సింగ్ కోర్సులు ఉన్నాయి. ఒక్కో కళాశాల, పాఠశాలలో 45 నుంచి 60 వరకు సీట్లు ఉన్నాయి.
     మూడన్నరేళ్లు, నాలుగున్నరేళ్ల వ్యవధిగల ఈ కోర్సుల్లో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఉండాల్సిన సౌకర్యాలు లేవన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
     జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, డిఎంహెచ్‌ఓ అధికారులకు తనిఖీలు చేసే అధికారం ఉంది. అలా వెళ్లిన అధికారులు తాయిలాలు అందుకుంటూ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడంతో వసతి లేమి కారణంగా విద్యార్థులకు అగచాట్లు తప్పటం లేదు.
     కోర్సు పూర్తి కాగానే ఆరునెలల పాటు ప్రాక్టికల్ నాలెడ్జి పెంపొందించుకోవటం కోసం ఇంటర్నీ చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల ఇంటర్నీ చేయకుండానే విద్యార్థులను ఇళ్లకు పంపివేస్తున్నారు.
     {పాక్టికల్ అనుభవం అంతంత మాత్రంగా ఉండడం, కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాల్లో చేరుతుండటంతో నర్సింగ్ విద్యలో నాణ్యత లోపిస్తుందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
 నిబంధనల ప్రకారం సదుపాయాలు ఇలా .....
     టీచింగ్ బ్లాక్‌లో లెక్చర్ హాల్, నర్సింగ్ ఫౌండేషన్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఫ్రీ క్లీనికల్ సైన్స్‌ల్యాబ్, మల్టీపర్పస్ హాల్,లైబ్రరీ, గైనిక్ అండ్ పీడియాట్రిక్ ల్యాబ్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సి పాల్ ఫ్యాకల్టీలకు ప్రత్యేక గదులు ఉండాలి.
     అన్ని విభాగాలను 23,720 స్క్వేర్ ఫీట్ ఏరియాలో నిర్మించాలి.
     హాస్టల్ ప్రాంగణంలో విజిటర్స్ రూమ్, రీడింగ్ రూమ్, రిక్రియేషన్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్ అండ్ స్టోర్, విద్యార్థులు ఉండే గదులు ఇలా అన్ని విభాగాలను 30,750 స్క్వేర్ ఫీట్ ఏరియాలో నిర్మించాలి.
     {పొఫెసర్ అర్హత కల్గిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అసోసి యేట్ ప్రొఫెసర్ అర్హత కల్గిన రీడర్స్, ఇద్దరు లెక్చరర్లు, 19 మంది ట్యూటర్లు విధుల్లో ఉండాలి.
     టీచర్, స్టూడెంట్ రేషియో 1ః10గా ఉండాలి.
     {పిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌కు నర్సింగ్‌లో మాస్టర్‌డిగ్రీతో పాటు పదేళ్ల అనుభవం, రీడర్‌కు ఏడేళ్లు, లెక్చరర్‌కు మూడేళ్లు, ట్యూటర్‌కు ఏడాది అనుభవం ఉండాలి.
 నిబంధనలు తూచ్.......
     జిల్లాలోని నర్సింగ్ పాఠశాలలు, కళాశాలల్లో నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలను అమలు చేస్తున్న వాటి సంఖ్య చాలా తక్కువ.
     భవనాలు కూడా సరిపడ లేని పాఠశాలలు, అద్దె భవనాల్లో ఉన్న పాఠశాలలు చాలా ఉన్నాయి.
     ఇక బోధన సిబ్బంది అర్హతలు అంతంత మాత్రమే ఉన్న వారిని విధుల్లో ఉంచుతున్నట్లు వినికిడి.
     జీజీహెచ్‌లోని నర్సింగ్ కళాశాల, పాఠశాలలో పనిచేస్తున్న పలువురు బోధనా సిబ్బంది పేర్లు ప్రైవేటు నర్సింగ్ పాఠశాలలు, నర్సింగ్ కళాశాలల్లో కూడా ఉంటున్నాయి.
     ఒకే నర్సింగ్ ట్యూటర్ రెండు చోట్ల ఎలా బోధన చేస్తున్నారో తనిఖీ చేసే అధికారులకే తెలియాలి.
     విద్యార్థినుల భోజన సదుపాయాలు గురించి, వారి బాధల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement