మొన్న ఎలుక..నేడు పాము | Before rat .. Today snake | Sakshi
Sakshi News home page

మొన్న ఎలుక..నేడు పాము

Published Sat, Sep 19 2015 3:56 AM | Last Updated on Tue, Aug 21 2018 3:45 PM

మొన్న ఎలుక..నేడు పాము - Sakshi

మొన్న ఎలుక..నేడు పాము

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్ విభాగంలోని 105వ నంబరు గదిలో శుక్రవారం పాము కలకలం రేపింది. గతనెల 26న పసికందు ఎలుకల దాడిలో చనిపోవడంతో ఎలుకలు పట్టేందుకు ఏర్పాటు చేసిన జెల్లి ప్యాడ్‌కు శుక్రవారం ఉదయం పాము పిల్ల అతుక్కుని ఉంది. దాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రి ఆర్‌ఎంఓ శ్రీనివాసులుకు సమాచారం తెలియజేశారు. తక్షణమే పాములు పట్టేవారిని పిలిపించి పాములు ఉన్నాయేమోనని పరిశీలించాలని ఆదేశాలు జారీచేశారు. సాయంత్రం వట్టిచెరుకూరుకు చెందిన పాములు పట్టే వ్యక్తి కోటయ్య రేడియాలజి విభాగంలో (105వ నంబరు గదిలో) వచ్చి పాములు ఉన్నాయో లేవో పరిశీలించారు.                                     - గుంటూరు మెడికల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement