చెన్నై: భారత ఫెన్సర్ భవాని దేవి రెక్జావిక్ వరల్డ్ కప్ శాటిలైట్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది. ఐస్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆమె సాబ్రే ఈవెంట్‌లో రెండో స్థానాన్ని సంపాదించింది. తమిళనాడుకు చెందిన భవాని దేవి ఫైనల్లో 10–15తో అలెక్సిస్ బ్రౌన్ (అమెరికా) చేతిలో ఓటమి పాలైంది. గతేడాది జరిగిన ఈ టోర్నీలో భవాని స్వర్ణ పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా రికార్డు సృష్టించింది
Comments
Please login to add a commentAdd a comment