tourney
-
‘‘ఏం సాధించారని ఫొటోలకు ఫోజులు? సిగ్గులేదా?’’
వైరల్: ఫొటోల ఫోజులకు కోసం మన నేతలు ఎంతగా తాపత్రయపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరైతే ప్రత్యేకంగా షూట్లతోనే కాలం గడిపేస్తుంటారు కూడా. తాజాగా డురాండ్ కప్ ఫైనల్ అనంతరం జరిగిన టోర్నీ బహుకరణలో జరిగిన పరిణామాలపై నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆదివారం కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్, ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య డురాండ్ కప్ ఫైనల్ జరిగింది. సునీల్ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు ఎఫ్‌సీ 2-1తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం టోర్నీ బహుకరణ సమయంలో ఈ ఫుట్‌బాల్ దిగ్గజానికి ఘోర అవమానం జరిగింది. టోర్నీ బహుకరణ సమయంలో ఫొటోలు తీస్తుండగా.. సునీల్ ఛెత్రిని పక్కకు నెట్టేసి మరీ ఫోటోలకు ఫోజు ఇచ్చారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ లా గణేశన్. దీంతో ‘‘ఫుట్‌బాల్ దిగ్గజానికి కనీస మర్యాద ఇవ్వవా? సిగ్గులేదా?. ఏం సాధించారని ఫొజులు’’ అంటూ గవర్నర్‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ట్వీట్లు చేస్తున్నారు పలువురు అభిమానులు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. అది కాకతాళీయంగా అనుకున్నా మరో వీడియోలో.. మ్యాచ్ విక్టరీకి కారణమైన శివశక్తి నారాయణన్‌ను పక్కకు నెట్టేశారు హాజరైన మరో రాజకీయ నాయకుడు. దీంతో ఏం ఒరగపెట్టారని ఫొటోల కోసం అంత తాపత్రయమంటూ మండిపడుతున్నారు పలువురు నెటిన్స్. ఫుట్‌బాల్ అభిమానులే కాదు మరోవైపు ఆటగాళ్లు సైతం ఈ చర్యలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. Ladies & gentlemen, bringing you Shri La. Ganeshan, honorable Governor of West Bengal. #DurandCup The high-headedness is audacious. Not expected of a respectable figure, @LaGanesan. A public apology surely won't be too much to ask for. #IndianFootballpic.twitter.com/aEq4Yq6a6R — Debapriya Deb (@debapriya_deb) September 18, 2022 This is what happened with shivshakti minutes before Chhetri. pic.twitter.com/TZmLP93Sdj — Akansh (@AkanshSai) September 18, 2022 -
టోర్నీల ఫార్మాట్ మార్చాలి
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వచ్చాక ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆట పునరుద్ధరణలో కీలక మార్పులు చేయాలని భారత జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తరచూ ప్రయాణించే వీలు లేకుండా... ఒకే వేదికపై అనేక టోర్నీలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించాడు. కరోనా కారణంగా బీడబ్లూఎఫ్ జూలై చివరి వరకు అన్ని ముఖ్యమైన టోర్నీలను వాయిదా వేసింది. అయితే పరిస్థితులు సద్దుమణిగాక ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీడబ్ల్యూఎఫ్ చర్యలు తీసుకోవాలని గోపీచంద్ పేర్కొన్నాడు. ‘కరోనా అనంతర పరిస్థితులకు అనుగుణంగా బీడబ్ల్యూఎఫ్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. టోర్నీల నిర్వహణ, ఫార్మాట్ ఇలా అవసరమున్న అన్ని అంశాల్ని సవరించాలి’ అని గోపీ అన్నాడు. వాయిదా పడిన థామస్ ఉబెర్ కప్ ఫైనల్, ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించాలని ఆతిథ్య దేశాలను ప్రపంచ సమాఖ్య కోరింది. దీనిపై స్పందించిన గోపీ ‘మీరు టోర్నీ తేదీల మార్పు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ టోర్నీల నిర్వహణపై ఆలోచనా విధానం మారాలి. ఆటగాళ్లంతా ఒకే వేదికపై ఎక్కువ టోర్నీలు ఆడేలా ప్రణాళికలు రచించాలి. వేర్వేరు టోర్నీల కోసం వారానికో దేశం ప్రయాణించడం వారి ఆరోగ్యానికి చేటు కలిగించొచ్చు. ప్రేక్షకుల్ని ఎలాగూ అనుమతించే పరిస్థితి లేదు కాబట్టి పురుషుల సింగిల్స్ ఒక దేశంలో, మహిళల సింగిల్స్ మరో దేశంలో, డబుల్స్ ఇంకో దేశంలో నిర్వహిస్తే... ఒకే సమయం లో మూడు ఈవెంట్లలో పోటీలూ జరుగుతాయి, ప్రతీ ఆటగాడు ప్రతీ దేశం తిరిగే బాధ కూడా తప్పుతుంది. కేవలం రెండు, మూడు కోర్టుల్లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తే సరిపోతుంది. ఆటను పునరుద్ధరించాలనుకుంటే ఇలాంటి పద్ధతులు పాటిస్తే మంచిది’ అని తన ఆలోచనను పంచుకున్నాడు. -
తొలి ‘సూపర్’ టైటిల్ వేటలో...
ఇంచియోన్ (దక్షిణ కొరియా): ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ టైటిల్ మాత్రం ఊరిస్తోంది. గతవారం చైనా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిన సింధు నేటి నుంచి మొదలయ్యే కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం క్వాలిఫయింగ్ పోటీలతోపాటు డబుల్స్ విభాగాల మ్యాచ్‌లు ఉన్నాయి. మెయిన్ ‘డ్రా’ సింగిల్స్ మ్యాచ్‌లు బుధవారం మొదలవుతాయి. తొలి రౌండ్లో చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌తో సింధు తలపడుతుంది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బీవెన్ జాంగ్‌పై అలవోకగా నెగ్గిన సింధు మరోసారి అలాంటి ఫలితమే పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉంది. తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడే చాన్స్ ఉంది. చైనా ఓపెన్‌లో చోచువోంగ్ చేతిలోనే సింధు ఓడింది. ఈ ఏడాదిలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను మినహాయిస్తే సింధు ఇండోనేసియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో స్థానిక క్రీడాకారిణి కిమ్ గా యున్‌తో ఆడుతుంది. ‘డ్రా’ ప్రకారం క్వార్టర్ ఫైనల్లో సైనాకు మూడో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)... సింధుకు నాలుగో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్) ఎదురయ్యే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్.. క్వాలిఫయర్‌తో కశ్యప్ తలపడనున్నారు. -
మెయిన్ ‘డ్రా’కు ప్రాంజల అర్హత
ముంబై: అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల తొలిసారి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఓపెన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన ముంబై ఓపెన్ మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ప్రాంజల 6–4, 6–3తో ఒక్సానా కలిష్నికోవా (జార్జియా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు చేరింది. గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ప్రాంజల వరుస సెట్లలో ప్రత్యర్థి ఆటకట్టించింది. గతేడాది ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ రౌండ్ దాటలేకపోయిన ఆమె ఈసారి సత్తాచాటింది. క్వాలిఫయింగ్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌లో మెహక్ జైన్ (భారత్) 3–6, 4–6తో హిరోకో కువాటా (జపాన్) చేతిలో ఓడింది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు సోమవారం విశ్రాంతి దినం. ఇదే వేదికపై భారత్–వెస్టిండీస్‌ల మధ్య నాలుగో వన్డే జరుగనుండటంతో మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లను మంగళవారం నిర్వహించనున్నారు. -
ఫెన్సర్ భవానికి రజతం
చెన్నై: భారత ఫెన్సర్ భవాని దేవి రెక్జావిక్ వరల్డ్ కప్ శాటిలైట్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది. ఐస్లాండ్లో జరిగిన ఈ టోర్నీలో ఆమె సాబ్రే ఈవెంట్లో రెండో స్థానాన్ని సంపాదించింది. తమిళనాడుకు చెందిన భవాని దేవి ఫైనల్లో 10–15తో అలెక్సిస్ బ్రౌన్ (అమెరికా) చేతిలో ఓటమి పాలైంది. గతేడాది జరిగిన ఈ టోర్నీలో భవాని స్వర్ణ పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా రికార్డు సృష్టించింది -
షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు ‘లా’ కళాశాల విద్యార్థి
రాజమహేంద్రవరం రూరల్ : హర్యానాలో ఈనెల 25 నుంచి జరగనున్న ఆలిండియా షటిల్ బ్యాడ్మింట¯ŒS టోర్నమెంట్‌కు పిడింగొయ్యి జీఎస్‌కేఎం లా కళాశాల విద్యార్థి కెజేఎంఎస్ అవినాష్ ఎంపికయ్యారు. ఇటీవల శివకాశిలో జరిగిన సౌత్ఇండియా యూనివర్సిటీ బ్యాడ్మిం ట¯ŒS పోటీల్లో అవినాష్ ద్వితీయస్థానం సాధించాడు. ఆలిండియా టోర్నమెంటుకు ఎంపికయ్యాడు. అవినాష్‌ను కళాశాల కరస్పాండెంట్, డైరెక్టరు, ప్రిన్సిపాల్ తదితరులు అభినందించారు. -
హోరాహోరీగా బాస్కెట్‌బాల్ టోర్నీ
రామచంద్రపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS అండర్–19 బాలుర, బాలికల 62వ బాస్కెట్‌బాల్ పోటీలు స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండో రోజైన గురువారం నాటికి పోటీలు క్వార్టర్స్ దశకు చేరుకున్నాయి. పూల్–ఏలో కృష్ణా, కడప, పూల్–బీలో గుంటూరు, పశ్చిమ గోదావరి, పూల్–సీలో చిత్తూరు, అనంతపురం, పూల్–డీలో తూర్పుగోదావరి, కర్నూల్ జట్లు క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. కర్నూల్‌పై గుంటూరు, చిత్తూరుపై కడప, అనంతపురంపై కృష్ణా, తూర్పుగోదావరిపై పశ్చిమ గోదావరి జట్లు తలపడనున్నాయి. బాలికల విభాగంలో వైజాగ్‌పై చిత్తూరు 33–15, నెల్లూరుపై అనంతపురం 36–02, కృష్ణాపై తూర్పుగోదావరి 22–11, పశ్చిమగోదావరిపై కర్నూల్ 20–10, నెల్లూరుపై కర్నూల్ 17–8 పాయింట్లతో గెలుపొందాయి. తూర్పుగోదావరి–చిత్తూరు, విశాఖ–కృష్ణా, అనంతపురం–పశ్చిమ గోదావరి జట్లు తలపడనున్నాయి. ఎస్జీఎస్ ప్రతినిధి పి.సీతాపతి, ఎస్జీఎస్ అండర్–19 జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి పోటీలను పర్యవేక్షించారు. పీడీలు జంపన రఘురాం, గెడా శ్రీనివాస్ బాస్కెట్‌బాల్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఎల్ఐసీ జోనల్∙క్యారమ్స్ అండ్ చెస్ టోర్నీ
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం): ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ స్థానిక జేఎన్‌రోడ్‌లోని సూర్యగార్డెన్స్‌లో సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ జె.రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ రీజనల్ మేనేజర్ (హెచ్ఆర్డీ) కేవీపీవీ నరసింహారావు ఈ టోర్నమెంటును ప్రారంభిస్తారు. ఈ పోటీల్లో ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలనుంచి సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొంటారని రంగారావు తెలిపారు. రాజమహేంద్రవరం ఎల్ఐసీ మెయిన్ బ్రాంచి కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆటగాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రాజమహేంద్రవరం ఎల్ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయ మేనేజర్ (పీఆర్) నాగేంద్రకుమార్, ఎన్బీ మేనేజర్ అహ్మద్ ఆలీషా, చెస్ ఆర్బెటర్ జీవీ కుమార్, క్యారమ్స్ ఆర్బెటర్ అస్మదుల్లా, స్పోర్ట్సు ప్రమోషన్‌బోర్డు సభ్యులు జాన్సన్, మంజునాథ్ నియమనిబంధనలను వివరించారు. -
డీఆర్ఎం కప్ టీటీ టోర్నీ ప్రారంభం
విశాఖపట్నం : డీఆర్ఎం కప్ టేబుల్‌టెన్నిస్ టోర్నీ రైల్వే ఇండోర్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లో శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీని ఈకోరైల్వే వాల్తేర్ డివిజన్ ఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ ప్రారంభించారు. అంతర ఇన్స్టిట్యూషన్స్, మెన్ గ్రూప్‌లో డబుల్స్, నాన్‌మెడలిస్ట్, కాడట్ బాల బాలికల విభాగాలతో పాటు యూత్ బాల బాలికల విభాగాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు అంతర ఇన్‌స్టిట్యూషనల్స్ పోటీలు జరగ్గా సెమీస్‌కు ఎస్బీఐ, కోస్ట్‌గార్డ్ ఎల్ఐసి, రైల్వే జట్లు చేరుకున్నాయి. బాలికల విభాగాల్లో సాహితీపై సంయుక్త 0–3తో విజయం సాధించగా మోహిత గాయత్రిపై హాసిని 0–3తోనే విజయం సాధించి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. బాలుర విభాగాల్లో అవినీష్‌పై 11–4,11–7,11–7తో జి రెడ్డి విజయం సాధించగా మరో పోటీలో సంతిల్ నాథన్‌పై తొలిసెట్‌ను 11–10తో రోహిత్ చెమటోడ్చి గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇక చివరి రెండు సెట్లలోనూ 11–8,11–6తోనే రోహిత్ విజయం సాధించి తరువాత రౌండ్‌కు చేరుకున్నాడు. టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో ఏడీఆర్ఎం అజయ్ అరోరా, క్రీడాధికారి ఎల్విందర్, సహాయక్రీడాధికారి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
28నుంచి రాష్ట్ర క్యారమ్ టోర్నీ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్‌టోర్నమెంట్ ఈనెల 28,29వ తేదీల్లో జరగనుండగా విశాఖ జిల్లా నుంచి ర్యాకింగ్ ఆటగాళ్ళు పాల్గొనున్నారు. గుంటూర్ జిల్లా చిలకలూరిపేటలో పురుషుల,మహిళా విభాగాల్లో జరిగే ఈ టోర్నిలో రాష్ట్ర క్యారమ్ జట్టును ఎంపిక చేయనున్నామని ఆంధ్ర స్టేట్ క్యారమ్ సంఘం కార్యదర్శి నీరజ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర జట్టుగా ఆరుగురేసి క్రీడాకారుల్ని మెన్,వుమెన్ కాటగిరిల్లో ఎంపిక చేయనుండగా వారంతా ఈనెల 30,31వ తేదీల్లో జరిగే సౌత్‌జోన్ అహ్వాన ప్రై జ్‌మనీ టోర్నిలో పాల్గొనున్నారన్నారు. స్టేట్ టోర్నిలో విజేతలు పదిహేనువేలు, సౌత్‌జోన్ టోర్నిలో విజేతలకు 30వేల నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోనున్నారు. -
అండర్–16 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీ రన్నరప్‌గా జిల్లా జట్టు
మహబూబ్‌నగర్ క్రీడలు : స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జింఖానా మైదానంలో జరిగిన అండర్–16 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 3–2 గోల్స్ తేడాతో జిల్లా జట్టుపై విజయం సాధించింది. జిల్లా జట్టు రెండో స్థానంలో నిలవడంపై సీనియర్ క్రీడాకారులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.