నేటి నుంచి ఎల్‌ఐసీ జోనల్∙క్యారమ్స్ అండ్ చెస్ టోర్నీ
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం): ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ స్థానిక జేఎన్‌రోడ్‌లోని సూర్యగార్డెన్స్‌లో సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ జె.రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ రీజనల్ మేనేజర్ (హెచ్‌ఆర్‌డీ) కేవీపీవీ నరసింహారావు ఈ టోర్నమెంటును ప్రారంభిస్తారు. ఈ పోటీల్లో ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలనుంచి సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొంటారని రంగారావు తెలిపారు. రాజమహేంద్రవరం ఎల్‌ఐసీ మెయిన్ బ్రాంచి కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆటగాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రాజమహేంద్రవరం ఎల్‌ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయ మేనేజర్ (పీఆర్) నాగేంద్రకుమార్, ఎన్‌బీ మేనేజర్ అహ్మద్ ఆలీషా, చెస్ ఆర్బెటర్ జీవీ కుమార్, క్యారమ్స్ ఆర్బెటర్ అస్మదుల్లా, స్పోర్ట్సు ప్రమోషన్‌బోర్డు సభ్యులు జాన్సన్, మంజునాథ్ నియమనిబంధనలను వివరించారు.