డీఆర్‌ఎం కప్ టీటీ టోర్నీ ప్రారంభం
డీఆర్‌ఎం కప్ టీటీ టోర్నీ ప్రారంభం
Published Sat, Aug 13 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
విశాఖపట్నం : డీఆర్‌ఎం కప్ టేబుల్‌టెన్నిస్ టోర్నీ రైల్వే ఇండోర్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లో శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీని ఈకోరైల్వే వాల్తేర్ డివిజన్ ఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ ప్రారంభించారు. అంతర ఇన్‌స్టిట్యూషన్స్, మెన్ గ్రూప్‌లో డబుల్స్, నాన్‌మెడలిస్ట్, కాడట్ బాల బాలికల విభాగాలతో పాటు యూత్ బాల బాలికల విభాగాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు అంతర ఇన్‌స్టిట్యూషనల్స్ పోటీలు జరగ్గా సెమీస్‌కు ఎస్‌బీఐ, కోస్ట్‌గార్డ్ ఎల్‌ఐసి, రైల్వే జట్లు చేరుకున్నాయి. బాలికల విభాగాల్లో సాహితీపై సంయుక్త 0–3తో విజయం సాధించగా మోహిత గాయత్రిపై హాసిని 0–3తోనే విజయం సాధించి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. బాలుర విభాగాల్లో అవినీష్‌పై 11–4,11–7,11–7తో జి రెడ్డి విజయం సాధించగా మరో పోటీలో సంతిల్ నాథన్‌పై తొలిసెట్‌ను 11–10తో రోహిత్ చెమటోడ్చి గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇక చివరి రెండు సెట్లలోనూ 11–8,11–6తోనే రోహిత్ విజయం సాధించి తరువాత రౌండ్‌కు చేరుకున్నాడు. టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం అజయ్ అరోరా, క్రీడాధికారి ఎల్విందర్, సహాయక్రీడాధికారి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement