నల్గొండ : లెక్చరర్ వేధింపులు తాళలేక నల్లొండ జిల్లా ఆత్మహత్య చేసుకున్న భవాని(16) కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు అనంతరం ఏస్పీ ఆఫీసు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. లెక్చరర్ ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.