చింతపల్లి: టీచర్ కొట్టిందని మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్‌వెంకటేశ్వర నగర్ గ్రామానికి చెందిన సురిగి భవాని(15) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చాయని టీచర్ భవానిని కొట్టడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.