రణసింగంగా మారిన విజయ్‌సేతుపతి | Vijay Sethupathi Next Titled Ranasingam | Sakshi
Sakshi News home page

రణసింగంగా మారిన విజయ్‌సేతుపతి

Published Wed, Jun 12 2019 10:18 AM | Last Updated on Wed, Jun 12 2019 1:22 PM

Vijay Sethupathi Next Titled Ranasingam - Sakshi

చేతి నిండా చిత్రాలతో పాటు విజయపథంలో దూసుకుపోతున్న నటుడు విజయ్‌ సేతుపతి. ఈయన తమిళంతో పాటు, తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. కాగా విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ప్రారంభమైంది. దీనికి కపే. రణసింగం అనే పేరును నిర్ణయించారు.ఈ మూవీని కేజేఆర్‌ స్టూడియోస్‌ పతాకంపై కేజే.రాజేశ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇంతకుముందు పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేసిన ఈయన నటి నయనతార నటించిన అరమ్, ఐరా చిత్రాలతో పాటు ప్రభుదేవా హీరోగా నటించన గులేభాకావళి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అంతేకాదు ప్రస్తుతం శివకార్తికేయన్, నయనతార జంటగా నటిస్తున్న హీరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విజయ్‌ సేతుపతి, నటి ఐశ్వర్యరాజేశ్‌ హీరోహీరోయిన్లుగా రణసింగం పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ద్వారా విరుమాండి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన దర్శకుడు సెల్వ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. నయనతార నటించిన అరమ్‌ చిత్రానికి కోడైరెక్టర్‌గా చేశారు. ఈ సినిమాలో సముద్రకని, యోగిబాబు, వేలా రామమూర్తి, పూరాం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం ద్వారా జీవి. ప్రకాశ్‌కుమార్‌ చెల్లెలు భవాని నటిగా కీలక పాత్రలో పరిచయం అవుతున్నారు.జిబ్రాన్‌ సంగీతాన్ని, సుదర్శన్‌ ఛాయాగ్రహణం అంది స్తున్న ఈ చిత్రం ఇటీవల రామనాథపురంలో ప్రారంభమైనట్లు చిత్ర వర్గాలు తెలిపారు. తదుపరి చెన్నై, హైదరాబాద్, దుబాయ్‌లలో చిత్రీకరించనున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement