
భవాని (ఫైల్)
విశాఖపట్నం , సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఒక వివాహిత అదృశ్యమైన సంఘటనకు సంబంధించి ఫోర్తుటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముస్లిం తాటిచెట్లపాలెంకు చెందిన ఎ.భవాని(22)కి నగరానికి చెందిన జగదీష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం భర్తతో గొడవ పడి ఇంటిలో నుంచి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిందనుకొని భర్త ఆమె సోదరుడికి ఫోన్ చేశాడు. అక్కడికి రాలేదని చెప్పడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఫోర్తుటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.