![Missing Cases Of Girls Are Increasing In Tirupati](/styles/webp/s3/article_images/2024/10/24/Missing-Cases-Of-Girls-Are-.jpg.webp?itok=y9vjMR8O)
సాక్షి, తిరుపతి జిల్లా: తిరుపతి నగరంలో రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి అక్సా క్వీన్ మిస్సింగ్ ఘటన మర్చిపోక ముందే మరో కేసు నమోదైంది. పశ్చిమ పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మకుంటకు చెందిన ప్రవల్లికశ్రీ అదృశ్యం కావడంతో తండ్రి సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పదిరోజులుగా కనిపించకపోవడంతో చిన్నారి తండ్రి పోలీసులను ఆశ్రయించారు.
కాగా, ఏర్పేడు మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీలో బాలిక అదృశ్యంపై గత శనివారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక(17) ఈ నెల 14న రాత్రి భోజనం చేసి నిద్రించింది. ఆపై 15వ తేదీ ఉదయం నుంచి బాలిక కనిపించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని..
Comments
Please login to add a commentAdd a comment