
సాక్షి,అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లాలో ఓ టీచర్ దారుణానికి పాల్పడ్డాడు. గొలుగొండ మండలం హై స్కూల్లో పీఈటీ టీచర్ కీచక పర్వం తాజాగా వెలుగు చూసింది. ఆటల కోసం వెళ్లిన బాలికలతో పీఈటీ నూకరాజు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికల ఫిర్యాదుతో నూకరాజు బాగోతం బయటపడింది.
రాష్ట్రస్థాయి పోటీలకు బాలికలను తమిళనాడు తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డాడు నూకరాజు. విద్యార్థినులతో హెడ్‌మాస్టర్ శ్రీనివాసులు మహిళా టీచర్‌ను పంపకపోవడాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. తమిళనాడు నుంచి తిరిగి వచ్చి ఇంటికి చేరుకున్న తరువాత తల్లిదండ్రులకు బాలికలు అసలు విషయం చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పీఈటీ దారుణాలపై మండల విద్యాధికారి (ఎంఈవో) విచారణ ప్రారంభించారు.