PET teacher
-
బాలికలతో టీచర్ అసభ్య ప్రవర్తన
సాక్షి,అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లాలో ఓ టీచర్ దారుణానికి పాల్పడ్డాడు. గొలుగొండ మండలం హై స్కూల్లో పీఈటీ టీచర్ కీచక పర్వం తాజాగా వెలుగు చూసింది. ఆటల కోసం వెళ్లిన బాలికలతో పీఈటీ నూకరాజు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికల ఫిర్యాదుతో నూకరాజు బాగోతం బయటపడింది.రాష్ట్రస్థాయి పోటీలకు బాలికలను తమిళనాడు తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డాడు నూకరాజు. విద్యార్థినులతో హెడ్మాస్టర్ శ్రీనివాసులు మహిళా టీచర్‌ను పంపకపోవడాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. తమిళనాడు నుంచి తిరిగి వచ్చి ఇంటికి చేరుకున్న తరువాత తల్లిదండ్రులకు బాలికలు అసలు విషయం చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పీఈటీ దారుణాలపై మండల విద్యాధికారి (ఎంఈవో) విచారణ ప్రారంభించారు. -
విద్యార్థినిపై పీఈటీ టీచర్ దాష్టీకం.. కడ్డీతో చెంపపై కాల్చిన వైనం
సాక్షి, కర్నూలు: కొత్తపల్లిలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దారుణం జరిగింది. ఆదర్శంగా ఉండాల్సిన టీచరే విద్యార్థి ని చెంపపై కడ్డీతో కాల్చింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లి కేజీబీవీలో పాములపాడు మండలం బానకచెర్ల గ్రామానికి చెందిన కీర్తి అనే బాలిక 10వ తరగతి చదువుతోంది. చున్నీ వేసుకోకుండా తిరగడమే కాక తనను వేరే విద్యార్థినుల ముందు తిడతావా అని కీర్తిపై పీఈటీ టీచర్ పావని ఆగ్రహించింది. అంతటితో వదలకపోగా శనివారం ప్రార్థన సమయంలో కడ్డీని వేడిచేసి బాలిక చెంపపై కాల్చి వాత పెట్టింది. కీర్తికి గిట్టని ఓ విద్యార్థిని చెప్పిన మాటలను నమ్మి సదరు టీచర్ ఇలా చేసినట్లు సమాచారం. విద్యార్థిని తల్లిదండ్రులు ఆదివారం పాఠశాలకు వెళ్లి విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. చదవండి: దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ -
క్రికెటర్ జీవితాన్ని మార్చిన పీఈటీ టీచర్
విండీస్ క్రికెటర్ రోవ్‌మెన్ పావెల్ హార్డ్హిట్టర్గా మాత్రమే మనకు పరిచయం. అయితే పావెల్ క్రికెటర్‌గా మారడానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అతని జీవిత చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అథ్లెట్‌గా మెరవాల్సినోడు ఇవాళ క్రికెటర్‌గా రాణించడం వెనుక తన స్కూల్ పీఈటీ టీచర్ కార్ల్టన్ సోలన్ పాత్ర ఎంతో ఉందట. ఈ విషయాన్ని రోవ్‌మెన్ పావెల్ స్వయంగా వివరించాడు. జమైకాలోని ఓల్డ్ హర్బర్‌లో జన్మించిన రోవ్‌మెన్ పావెల్‌కి తండ్రి లేడు. తల్లి, సోదరితో పెరిగిన పావెల్, చిన్నతరంలో కడుపునిండా తినడానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని, అతను చాలా కింది నుంచి పైకి వచ్చాడు... పేదరికాన్ని జయించడానికి ఆటను ఎంచుకున్నాడు. స్కూల్ చదువుతున్నప్పుడే తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేస్తానని వాళ్ల అమ్మకి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకోవడానికే క్రికెటర్‌గా మారాడు. ఇదే విషయమై పావెల్ స్పందిస్తూ.. ''నా పీఈటీ టీచర్ కార్ల్టన్ నేను క్రికెట్ ఆడటం గమనించేవాడు. అయితే నేను ఓసారి ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనింగ్ కు వెళ్లా. అక్కడ ఆయన కూడా ఉన్నాడు.. నువ్వు ఇక్కడికెందుకు వచ్చావ్..? బహుశా నువ్వు ఇక్కడికి రావడం ఇదే చివరిసారి అనుకుంటా. నువ్వు క్రికెట్ చాలా బాగా ఆడతావు. ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ ను వదిలేయ్. ఇది నీకు సెట్ అవదు. నా మాట వినకుండా నువ్వు మళ్లీ ఇక్కడ గనక కనబడితే కొట్టడం గ్యారంటీ. నువ్వు రెండింటి (క్రికెట్, ట్రాక్ అండ్ ఫీల్డ్) మీద దృష్టి సారిస్తానంటే కుదరదు. అలా చేస్తే దేనిమీద వంద శాతం దృష్టి పెట్టలేవు'' అంటూ వివరించాడు. ఆయన సూచనతోనే పావెల్ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నానని తెలిపాడు. ఇక 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రోవ్‌మెన్ పావెల్ విండీస్ తరపున 45 వన్డేలు, 55 టి20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా పావెల్ ఖాతాలో వన్డేల్లో ఒక సెంచరీ, టి20ల్లో ఒక సెంచరీ ఉండడం విశేషం. -
కీచక ఉపాధ్యాయుడు.. విద్యార్థిని పదేపదే గదికి పిలిపించి...
యశవంతపుర: విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రధానోపాధ్యాయుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకాలో జరిగింది. సంకేనహళ్లి సమీపంలోని తరళబాళు విద్యాసంస్థకు చెందిన శివనంజుండేశ్వర పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న నరేంద్ర పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిని పదేపదే తన గదిలోకి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ నెల 7న అర్ధ పరీక్షలు ముగియగానే తన గదికి పిలిపించి వేధించాడు. దీంతో విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా ఈనెల 10న పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. నరేంద్ర వెళ్లలేదు. శనివారం నేరుగా స్కూల్‌కు రావటంతో గ్రామస్థులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కీచక వ్యాయామ ఉపాధ్యాయుడు బనశంకరి: బెంగళూరులో 13 ఏళ్ల బాలికపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు అయిన అంజినప్ప విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పాఠశాల హెచ్ఎం హెబ్బాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కీచకునిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. (చదవండి: పెళ్లి వేడుక.. సరిగ్గా తాళిబొట్టు కట్టే సమయానికి ట్విస్ట్..) -
బాలికల పాఠశాలలో దారుణం.. రెండు జడలు వేసుకోలేదని 200 గుంజీలు
జడ్చర్ల టౌన్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం కావేరమ్మపేటలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినులు రెండు జడలు వేసుకోలేదని ఆగ్రహించిన పీఈటీ శ్వేత బుధవారం వారితో 120 నుంచి 200 వరకు గుంజీలు (ఉట్బైట్) తీయించింది. దీంతో పిల్లలు నడవలేని స్థితికి చేరుకున్నారు. నొప్పులు తాళలేక రోదిస్తున్నారు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఉపాధ్యాయులు తీవ్ర ప్రయత్నం చేశారు. 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికాగా, కొందరికి జ్వరం వచ్చింది. కనీసం వైద్యాధికారులకు సమాచారం ఇవ్వకుండా తమకు తోచినవిధంగా ఉపశమన చర్యలు తీసుకుని సిక్‌రూంలో తాళం వేసి బంధించారు. గురువారం మధ్యాహ్నం 20 మందికి జ్వరం తీవ్రం కావడంతో అర్బన్‌హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అయితే నొప్పులు భరించలేక కొందరు పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వారు పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటన తల్లిదండ్రుల ధర్నాతో గురువారం బయటకు వచ్చింది. అక్కడికి వెళ్లిన విలేకరులను సైతం ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ఇంత జరిగినా.. సెలవులో ఉన్న ప్రిన్సిపాల్ కల్పనకు గురువారం సాయంత్రం వరకు సమాచారం అందించలేదు. విషయం బయటకు పొక్కగానే ఆమె పాఠశాలకు చేరుకుని చిన్న విషయమే.. అంటూ దాటవేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న గురుకులాల ఆర్ఎల్సీ జమీర్ అహ్మద్ పాఠశాలకు చేరుకున్నారు. ఆయన కూడా ఇది చిన్న విషయమేనని పేర్కొన్నారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న పీఈటీ శ్వేతను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు జమీర్ అహ్మద్ తెలిపారు. -
Crime News: నాలుగేళ్ల కిందట అక్కపై! ఇప్పుడు చెల్లిపై..
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాలు బడులు. అందులో టీచర్లే మార్గదర్శకులు. అలాంటిది తరగతి గదిలోనే.. విద్యార్థినులపై అత్యాచారాలు చేస్తున్న ఓ కామాంధుడి బాగోతం వెలుగుచూసింది. నాలుగేళ్ల వ్యవధితో అక్కాచెల్లెలు అయిన విద్యార్థినులపై అత్యాచారం చేయడంతో.. ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఆ మృగాన్ని కటకటాల వెనక్కి నెట్టి తమలాంటి బాధితులకు న్యాయం చేయాలంటూ పోరాడుతోంది. రాజస్థాన్ నాగోర్ పట్టణంలోని పంచోరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల స్టేట్మెంట్ ప్రకారం.. సదరు కుటుంబంలోని పెద్దమ్మాయి 2018లో 9వ తరగతి చదువుతుండగా ఓ రోజు పీఈటీ హరిరామ్ (30) ఆమెను ఖాళీ తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు. మళ్లీ 10వ తరగతి చదువుతున్న టైంలో.. ఓరోజు కూడా హరిరామ్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక భయపడిపోయి స్కూలు మానేసింది. కానీ, తల్లిదండ్రులకు జరిగింది చెప్పలేకపోయింది. తాజాగా ఈ నెల 5న అదే స్కూల్లో చదువుతున్న సదరు బాలిక చెల్లెలిపైనా అదే పీఈటీ అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ విషయం బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పి వాపోయింది. దీంతో పెద్దమ్మాయి కూడా తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు తెలిజేసింది. దీంతో ఆ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాలికల స్టేట్ మెంట్ తీసుకున్నారు. సదరు దుర్మార్గుడి చేతిలో ఇంకెంత మంది విద్యార్థులు మోసపోయారన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసు వివరాలను పంచోరి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అబ్దుల్ రౌఫ్ తెలియజేశారు. -
‘3 ఇడియట్స్’ లాగానే : రీల్ సీన్ రిపీట్
సాక్షి, మైసూరు : ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘3 ఇడియట్స్’ లోని డెలివరీ సీన్ గుర్తుందా... స్కైప్ ద్వారా డాక్టర్ సలహా తీసుకొని సుఖ ప్రసవం చేసిన రీల్ సీన్ లాంటి సీన్ రియల్‌గా రిపీట్ అయింది. ఫోన్ ద్వారా డాక్టర్ సలహాలను తీసుకొని మరీ ఒక మహిళకు డెలివరీ చేసిన ఉదంతం పలువురి అభిమానాన్ని దక్కించుకుంది. ఈ ఘటన మార్చి 9న కర్ణాటకలోని మినీ విధాన సౌధ ఎదురుగా ఉన్న ఒక పబ్లిక్ పార్కులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కొడగులోని గోనికోప్పల్ సమీపంలోని ఒక గిరిజన గ్రామానికి చెందిన మల్లిగే (35) తొమ్మిది నెలల గర్భవతి. తన పిల్లలు బాలుడు(8), బాలికి(6) పిల్లలతో నగరానికి వచ్చింది. ఇంతలో ఆమెకు పురిటినొప్పులు మొదలైనాయి. దీంతో సమీపంలోని పార్క్‌కు వెళ్లిన ఆమె నొప్పులు భరించలేక బిగ్గరగా ఏడుస్తూ.. సహాయం కోసం అరవడం మొదలు పెట్టింది. దీంతో బెంబేలెత్తిన పిల్లల కూడ ఏడుపందుకున్నారు. దీంతో చుట్టుపక్కల షాపుల వారంతా అక్కడిచేరుకుని విషయాన్ని గమనించారు. షాప్ కీపర్లు చాలా మంది మగవారు కావడంతో ఎవరైనా ఆడవాళ్లు సమీపంలోనై ఎవరైనా ఉన్నారని వెదికారు. కానీ ఫలితం లేదు. ఇంతలో ఒకరు 108కి సమాచారం అందించారు. ఈ క్రమంలో అదే రోడ్డులో వెళుతున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) శోభా ప్రకాష్ పార్క్ లోపల ఉన్న జనాన్ని చూసి బండి ఆపి విషయం ఆరా తీశారు. ఆమె కూడా ఖంగారుపడుతూ 108 కి ఫోన్ చేసింది. ఇక్కడే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనంలో ఉన్న ఒకాయన తన స్నేహితుడైన డాక్టర్‌కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన ఆ డాక్టర్ అక్కడ ఎవరైనా ఆడవాళ్లున్నారా అని వాకబు చేశారు. దీంతో ఆయన వెంటనే ఫోన్‌ను శోభాకు కిచ్చారు. తాను ఫోన్ ద్వారా కొన్ని సూచనలు ఇస్తాననీ, వాటిని జాగ్రత్తగా పాటిస్తే..తల్లీ బిడ్డ క్షేమంగా బైటపడతారని చెప్పారు. దీనికి శోభ అనుమాన పడుతూనే ఒప్పుకున్నారు. అలా డాక్టర్ సలహా మేరకు శోభా మల్లిగేకు సహాయం చేయడంతో నిమిషాల్లో, మల్లిగే ఆడ బిడ్డను ప్రసవించింది. శిశువు ప్రసవించిన తర్వాత, బొడ్డు తాడు ఎలా కట్ చేయాలో బోధపడలేదు శోభకు. అలా అనుమానిస్తుండగానే ఒక వ్యక్తి కొత్త బ్లేడును తీసుకొచ్చాడు. ఏం పరవాలేదు కట్ చేయమని డాక్టర్ ధైర్యం చెప్పారు. కానీ అప్పటికే అంబులెన్స్ అక్కడికి చేరుకోవడం, సర్జికల్ బ్లేడుతో బొడ్డుతాడు కోయడం, తల్లీ బిడ్డల్ని ఆసుపత్రికి తరలించడంతో కథ సుఖాంతమైంది. మల్లిగే వద్ద ఉన్న ‘థాయ్’ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా ఆమె కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తనకు ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి అని శోభ వ్యాఖ్యానించారు. కానీ రెండు ప్రాణాలను కాపాడినందుకు చాలా సంతోషంగానూ, ఆశ్చర్యంగానూ ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ సందర్భంగా చొరవ తీసుకున్న డాక్టర్‌కి కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్ : గురుకుల పీఈటీ మహిళా అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముట్టడించారు.. సోమవారం పెద్ద ఎత్తున మహిళలు విజిల్ సౌండ్లతో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరంగల్, నాగర్ కర్నూల్, మహాబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి ఈ ముట్టడికి భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. 2018 నుంచి గురుకుల పీఈటీ ఫలితాలు విడుదల చేయడంలేదని ఆందోళన చేస్తున్నామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసును ప్రభుత్వం కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్ 2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2018లో పరీక్ష రాశామని, ఫలితాలు ఇప్పటికీ విడుదల చేయకపోవటంతో అభ్యర్తులు నిరసనకు దిగారు. కారుణ్య మరణాలే శరణ్యం అంటూ.. ప్రగతి భవన్ వద్ద మహిళా అభ్యర్థులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అభ్యర్థుల ఆందోళనతో క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
నాగరాజు హత్య కేసులో సంచలన నిజాలు
పశ్చిమ గోదావరి: ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాటి నాగరాజు హత్య ఉదంతంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత నెల 16న హత్యకు గురైన కాటి నాగరాజు హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి ప్రసాదంలో సైనైడ్ కలిపి నాగరాజును హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణ సందర్భంగా సింహాద్రి చేసిన అనేక ఆకృత్యాలను పోలీసులు కనుగొన్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో మొత్తం 10 మందికి సైనైడ్ కలిపిన ప్రసాదం పెట్టి అతను హతమార్చినట్లు విచారణలో తేలింది. సింహాద్రితో పాటు సైనైడ్ సరఫరా చేసిన విజయవాడ కు చెందిన షేక్ అమీనుల్లా ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని బంధువులను, కుటుంబ సభ్యులను కూడా నిందితుడు హతమార్చినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ వెల్లడించారు. రంగు రాళ్లు, గుప్త నిధులు, బంగారం రెట్టింపు, రైస్ పుల్లింగ్ వంటి మోసాలతో మొత్తం 28 లక్షల 50 వేలు వరకు కాజేసినట్లు తెలిసింది. నిందితుని వద్ద నుండి సైనైడ్, 23 కాసుల బంగారం, లక్షా 63 వేల 400 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: వ్యాయామ ఉపాధ్యాయుడి హత్య! ఏం జరిగింది.. అక్టోబర్ 18న రూ.2 లక్షల నగదు, నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలు తీసుకుని కాటి నాగరాజు మోటారు సైకిల్‌పై బయలుదేరారు. బంగారు ఆభరణాలు ఎందుకు తీసుకువెళుతున్నారని తాను అడిగితే ఎల్ఐసీ వాళ్లు స్కాన్ చేసుకుని ఇస్తారని చెప్పి తీసుకువెళ్లినట్లు అతడి భార్య తెలిపింది. అదేరోజు రాత్రి వట్లూరు పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన నాగరాజు అచేతనంగా పడి ఉన్నారు. అటుగా విజయవాడ నుంచి వస్తున్న ఓ కానిస్టేబుల్ ఆయన్ను గమనించారు. నాగరాజుతో పరిచయం ఉండటంతో విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యుల సాయంతో నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే నాగరాజు మృతిచెందినట్టు నిర్ధారించారు. ఆయన హత్య చేసి ఎవరైనా సొత్తు అపహరించుకుపోయారా లేక అనారోగ్యంతో ఆయన మృతి చెందారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసిన త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత నాగరాజు గుండెపోటులో మృతిచెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. మృతదేహాన్ని స్వగృహానికి తీసుకువెళ్లగా నగదు, నగలు ఆయన వద్ద లేకపోవటాన్ని గుర్తించి ఎవరైనా హత్యచేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఉపాధ్యాయురాలి బలవన్మరణం
వెంగళరావునగర్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ టీచర్‌గా పని చేస్తున్న మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం బోరబండలో చోటు చేసుకుంది. పోలీసులు, స్కూల్ సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుమ్మ సుష్మాజ్యోతి (39) పీఈటీ టీచర్‌గా పని చేస్తోంది. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె ఇటీవల యూస్ఫ్గూడ నుంచి బోరబండసైట్–3లోని నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. విధి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపేది. ఈమె సేవలను గుర్తించిన ప్రభుత్వం గత సెప్టెంబర్ 5న బెస్ట్ పీఈటీ టీచర్‌గా అవార్డుతో సత్కరించింది. సుష్మా భర్త న్యాయవాదిగా పని చేస్తుండగా, కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. అనారోగ్యం కారణంగా సెలవుపై ఉన్న ఆమె నవంబరు 2న విధుల్లో చేరారు. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందగానే నాట్కో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు యాదగిరి, తోటి సిబ్బంది ప్రశాంత్‌నగర్‌లోని ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని చూసి విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మృతి పట్ల హెచ్ఎం, స్కూల్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు. -
వ్యాయామ ఉపాధ్యాయుడి హత్య!
ఏలూరు టౌన్: ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాటి నాగరాజు హత్య ఉదంతం ఏలూరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు రూరల్ మండలం లింగారావుగూడానికి చెందిన కాటి నాగరాజు (48) ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పిల్లల చదువుల నిమిత్తం కొంతకాలంగా సత్రంపాడులో నివాసముంటున్నారు. ఇటీవల సొంతూరిలో ఇంటిని నిర్మించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బుధవారం సాయంత్రం రూ.2 లక్షల నగదు, నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలు తీసుకుని మోటారు సైకిల్‌పై బయలుదేరారు. బంగారు ఆభరణాలు ఎందుకు తీసుకువెళుతున్నారని తాను అడిగితే ఎల్ఐసీ వాళ్లు స్కాన్ చేసుకుని ఇస్తారని చెప్పి తీసుకువెళ్లినట్లు అతడి భార్య చెబుతోంది. అదేరోజు రాత్రి వట్లూరు పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన నాగరాజు అచేతనంగా పడి ఉన్నారు. అటుగా విజయవాడ నుంచి వస్తున్న ఓ కానిస్టేబుల్ ఆయన్ను గమనించారు. నాగరాజుతో పరిచయం ఉండటంతో విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యుల సాయంతో నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే నాగరాజు మృతిచెందినట్టు నిర్ధారించారు. ఆయన హత్య చేసి ఎవరైనా సొత్తు అపహరించుకుపోయారా లేక అనారోగ్యంతో ఆయన మృతి చెందారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసిన త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత నాగరాజు గుండెపోటులో మృతిచెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. మృతదేహాన్ని స్వగృహానికి తీసుకువెళ్లగా నగదు, నగలు ఆయన వద్ద లేకపోవటాన్ని గుర్తించి ఎవరైనా హత్యచేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మృతి వ్యాయామోపాధ్యాయుడు నాగరాజు మృతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతుని శరీరంæపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. ఏవిధంగా ఆయన చనిపోయాడు? అనారోగ్యంతోనా.. లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా ? ఆయన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు ఎలా మాయమయ్యాయి అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో రోడ్డు పక్కన పడి ఉన్న అతని వద్ద నుంచి ఎవరైనా నగదు, నగలు మాయం చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేక హత్య చేసి దుండగులు దోచుకుపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కుటుంబసభ్యులు మాత్రం నాగరాజును చంపి ఎవరో నగదు, నగలు ఎత్తుకుపోయారని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు గురువారం తన సిబ్బందితో లింగారావుగూడెం వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించటంతో స్వగ్రామానికి తరలించారు. మృతుడి అన్న పెదపాడులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తమ్ముడు విజయవాడలో సీబీసీఐడీ విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. -
ప్రాణత్యాగానికైనా సిద్ధం
హైదరాబాద్: భాషా పండితులు, పీఈటీల పదోన్నతుల సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు(ఆర్‌యూపీపీ–టీ), వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ (పీఈటీఏ టీఎస్)ల రాష్ట్ర కమిటీ నాయకు లు అన్నారు. ఏ ఉద్యోగంలోనైనా ప్రమోషన్లు ఉన్నాయని, భాషా పండితులు, పీఈటీలు మాత్రం చేరిన కేడర్లోనే రిటైరవుతున్నారని వాపోయారు. భాషాపండితులు, పీఈటీల సమస్యపై స్పందించి పోస్టులను అప్‌గ్రెడేషన్ చేస్తూ జీవో 15పై సీఎం కేసీఆర్ సంతకం చేసినా దాని అమలులో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, వ్యాయామవిద్య ఉపా ధ్యాయ సంఘాలు ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్షలు నిర్వహించాయి. దీక్షల్లో ఆర్‌యూపీపీటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డి. అబ్దుల్లా, గండమల్ల విశ్వరూపం, పీఈ టీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు డాక్టర్ ఎస్.సోమేశ్వర్రావు, బి.రాఘవరెడ్డిలతోపాటు తెలంగా ణలోని అన్నిజిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు కూర్చున్నారు. అన్నిజిల్లాల నుంచి పండిత ఉపాధ్యాయులు, పీఈటీలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీక్షలకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎ.నర్సిరెడ్డి, సరోత్తమ్‌రెడ్డి, చావ రవి (టీఎస్‌యూటీఎఫ్) భుజంగరావు(ఎస్టీయూ), రాఘవరెడ్డి (పీఈటీ అసోసియేషన్), రఘునందన్ (టీటీఎఫ్), పి.లక్ష్మయ్య(జూనియర్ కళాశాల పీఈటీ అసోసియేషన్) సంఘీభావం ప్రకటించారు. సీఎంకు పండిత టీచర్ల సమస్యలు పట్టవా? భాషా పండితుడైన సీఎం కేసీఆర్ భాషా పండితుల సమస్యలు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆర్.కృష్ణయ్య అన్నారు. పండిత, పీఈటీ పోస్టుల్లో 25, 30 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రమోషన్లు లేకపోవడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ భాషా పండితులు, పీఈటీల సమస్యలపై మండలిలో నిలదీస్తామన్నారు. పదోన్నతులతో 12 వేలకుపైగా భాషాపండితులు, పీఈటీలు, లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. భాషా పండితుల నిరాహారదీక్షలను పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా దీక్షలు కొనసాగిస్తున్నా రంటూ పోలీసులు 8 మంది భాషాపండితులను బలవంతంగా అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 5 తర్వాత కూడా దీక్షలను యధావిధిగా కొనసాగిస్తుండడంతో పోలీసులు టీచర్లను దీక్షలను ముగించాలని చెప్పినప్పటికీ రాత్రి ఏడుగంటల తర్వాత పోలీసులు వారిని అరెస్టు చేశారు. -
పీఈటీ పాడుబుద్ధి.. !
సాక్షి, రాయదుర్గం : విద్యార్థినుల పట్ల అసభ్యకర, వికృత చేష్టలకు పాల్పడుతున్న వ్యాయామ ఉపాధ్యాయుడి(పీఈటీ)కి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. రాయదుర్గం పట్టణంలోని రాజీవ్‌గాంధీ మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఒప్పంద వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఇలాహి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలపడంతో ఆగ్రహోదగ్రులయ్యారు. ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి మంగళవారం పాఠశాల వద్దకు చేరుకున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడిని చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ప్రధానోపాధ్యాయులు అబ్దుల్‌వారిస్ వారిని వారించి.. మాట్లాడదాం అని చెప్పి.. వ్యాయామ ఉపాధ్యాయుడిని అక్కడి నుంచి తప్పించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించి, పోలీసులకు అప్పగించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక శిక్షణ పేరుతో వెకిలిచేష్టలు పీఈటీ ఇలాహి ఇంగ్లిష్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తానని ప్రతి శుక్రవారం ఎనిమిదో తరగతి విద్యార్థినులను రప్పించుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమ పిల్లలు సోమవారం రాత్రి తమకు తెలిపారని పలువురు తల్లిదండ్రులు చెప్పారు. ఉపాధ్యాయుడి వెకిలి చేష్టల గురించి పిల్లలు చెబుతుంటే తట్టుకోలేకపోయామన్నారు. ఈ ఘటనపై ప్రశ్నించేందుకు వస్తే తమను చూసి తప్పించుకునేయత్నం చేసిన ఇలాహిని పట్టుకున్నామన్నారు. బాధిత విద్యార్థినులకు భరోసాగా నిలవాల్సిన ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌వారిస్ అసభ్యరంగా ప్రవర్తించిన పీఈటీని తప్పించి, వెనకేసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం ఈ ఘటనపై మండల విద్యాధికారి నాగమణితో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కఠినంగా శిక్షించాలి పీఈటీ ఇలాహిని వెంటనే విధుల నుంచి తొలగించాలని వివిధ పాఠశాలల విద్యార్థినులతో కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన పీఈటీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు. పీఈటీపై చర్యలు తీసుకోవాలి ఉర్దూ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, న్యాయవాది అయిన జింకా వసుంధర డిమాండ్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేటి సమాజంలో ఇలాంటి కీచకులు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. -
భళా అనిపించిన సాహస 'జ్యోతి'
సాక్షి, దుబ్బాక(సిద్దిపేట) : కృషి..పట్టుదల ఉంటే అసాధ్యాన్ని..సుసాధ్యం చేయడం పెద్దగా లెక్కకాదు. అని నిరూపించింది వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి. రాష్ట్రంలోనే కిలిమాంజారోని పర్వత శ్రేణిని అధిరోహించిన మొదటి మహిళా ఉద్యోగిణిగి నిలిచింది. అత్యంతం కష్టమైనదక్షిణ ఆఫ్రికా ఖండంలోని టాంజానీయా దేశంలో ఉన్న కిలిమంజారో పర్వతాలను అధిరోహించి దేశం ఖ్యాతిని చాటింది. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు కలిగిన పర్వత శ్రేణి కిలీమాంజారో పర్వతాలు. సముద్రమట్టానికి 5895మీటర్ల ఎత్తులో ఉంది. ఎన్నో శారీరిక, మానసికి సమస్యలను తట్టుకుని ధృడ సంకల్పంతో పర్వతాన్ని అధిరోహించడం ఓ అద్భుత సాహసం. 2017 డిసెంబర్ 22 న పర్వతారోహణ ప్రారంభించిన జ్యోతి కఠిన పరిస్థితుల్లోను ముందుగా మందార, హురంభో, కిబో పర్వతాలను రెండు రోజుల్లో అధిరోహించింది.25 న అత్యంత క్షిష్టమైన గిల్మస్, స్టెల్లా,హురు పర్వత శిఖరాలను అధిరోహించి కిలీమంజారో యాత్రను విజయవంతం చేసింది. కిలీమంజారోను అధిరోహించిన మొట్టమొదటి మహిళా ప్రభుత్వ ఉద్యోగిగా జ్యోతి నిలిచింది. అంత ఎత్తులో ఎత్తులో భారత జాతీయ పతాకాన్ని, తెలంగాణ చిత్ర పటం, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిల చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించింది. పీఈటీ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో.. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలో నాయీబ్రాహ్మణ కుటుంబం ఏల్దీ గంగయ్య పద్మ దంపతులకు కూతురు జ్యోతి. పేదకుటుంబంకావడంతో తల్లిదండ్రులకు అండగా ఉంటూ చదువుకుంటూ బడిలో పీఈటీ ఏర్వ అశోక్ ప్రోత్సాహంతో క్రీడల్లో రాణించింది. 2012 డీయస్సీలో మంచి ర్యాంక్ సాధించి వ్యాయామ ఉపాధ్యాయురాలుగా నియమితురలైంది. ప్రస్తుతం జ్యోతి దుబ్బాక మండలంలోని చిట్టాపూర్ హైస్కూల్లో పీఈటీగా సేవలందిస్తుంది. -
విద్యార్థిపై పీఈటీ లైంగిక వేధింపులు..
చెన్నై: విద్యార్థులను క్రమశిక్షణతో ఉంచాల్సిన పీఈటీ టీచరే క్రమశిక్షణ తప్పాడు. క్రీడల్లో మెళుకువలు నేర్పిస్తూ వారిని మానసికంగా ధృడంగా మార్చాల్సిన గురువే బాధ్యత మరిచి ఓ విద్యార్థిని లైంగికంగా వేధించాడు. తమిళనాడు భవానీ జిల్లాలోని అమ్మాపేట్ ప్రభుత్వ ఎయిడేడ్ పాఠశాల్లో పీఈటీగా పనిచేస్తున్న ప్రభూ(40) 8 వతరగతి చదువుతన్న పాఠశాల కబడ్డీ క్రీడాకారిణిని లైంగిక వేధించాడు. పక్క గ్రామంలో జరిగిన టోర్నమెంట్‌కు పాఠశాల కబడ్డీ జట్టు పాల్గొంది. తిరిగి వచ్చే క్రమంలో బస్సులో తనపై పీఈటీ ప్రభూ లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆ క్రీడాకారిణి తల్లితండ్రులకు ఏడుస్తూ తెలిపింది. వెంటనే ఆమె తల్లితండ్రులు గ్రామ ప్రజులకు తెలియజేయడంతో 200 మంది బుధవారం పాఠశాల ముందుకు చేరి టీచర్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు పీఈటీ ప్రభూను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పీఈటీని సస్పెండ్ చేసినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. -
విద్యార్ధినిపై పీఈటీ లైంగిక వేధింపులు!
-
చిన్నారికి లైంగిక వేధింపులు
♦ పీఈటీ ఉపాధ్యాయుని వెకిలి చేష్టలు ♦ వికాస్ పబ్లిక్ స్కూల్లో ఘటన ♦ భగ్గుమన్న విద్యార్థుల తల్లిదండ్రులు ♦ రెండు బస్సులకు నిప్పు ఏడేళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ టీచర్ ఉదంతం జిల్లాలో కలకలం సృష్టించింది. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులంతా ఏకమై ఆందోళనకు దిగారు. టీచర్ అకృత్యంపై కన్నెర్ర చేశారు. రెండు స్కూల్ బస్సులకు నిప్పంటించారు. మిరుదొడ్డి మండలం అక్బర్‌పేటలోని వికాస్ పబ్లిక్ స్కూల్లో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. భగ్గుమన్న అక్బర్పేట మిరుదొడ్డి: వికాస్ పబ్లిక్ స్కూల్లో సోమవారం ఓపీఈటీ టీచర్ 1వ తరగతి విద్యార్థినిని కొద్దిరోజులుగా లైంగికంగా వేధిస్తున్నట్టు వెలుగుచూసిన ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. దుబ్బాక మండలం చిట్టాపూర్‌కి చెందిన బాలిక (7) ఈ స్కూల్లో 1వ తరగతి చదువుతోంది. ఈ బాలిక గ్రామానికే చెం దిన ఈ స్కూల్ పీఈటీ కుమార్.. పదిహే ను రోజులుగా చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. కొద్ది రోజులుగా స్కూ లుకు వెళ్లనని బాలిక అల్లరి చేస్తుండటం తో తల్లిదండ్రులు గట్టిగా అడిగారు. దీం తో టీచర్ తన పట్ల ప్రవర్తిస్తున్న తీరును చెబుతూ చిన్నారి బోరుమంది. దీనిపై త ల్లిదండ్రులు స్కూలు యాజమాన్యం దృ ష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో ఆ నోటా ఈ నోటా విషయం పొక్కి.. ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీ సింది. స్కూల్లోని మిగతా విద్యార్థుల తల్లిదండ్రులంతా ఏకమై మూకుమ్మడిగా దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. రెం డు స్కూలు బస్సులను అగ్నికి ఆహుతి చే శారు. ఈ ఘటనలతో స్కూలులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యా రు. ఏం జరుగుతోందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతరం వి ద్యార్థుల తల్లిదండ్రులు భూంపల్లి చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకోకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. బాధిత కుటుంబానికి ఎంపీ ఓదార్పు దుబ్బాక: బాలిక కుటుంబాన్ని మెదక్ ఎం పీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మ నో ధైర్యాన్నిచ్చారు. జిల్లా ఎస్పీ సుమతితో ఫోన్లో మాట్లాడి.. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఉద్రిక్తతలు వద్దు: ఎస్పీ సుమతి దుబ్బాక /మిరుదొడ్డి: ఉద్రిక్తతలకు తావులేకుండా శాంతియుత వాతావరణం నెల కొనేలా ప్రతి ఒక్కరు సహకరించాలని జి ల్లా ఎస్పీ సుమతి కోరారు. సోమవారం ఆమె అక్బర్‌పేటలోని వికాస్ స్కూల్‌ను సందర్శించారు. ఉదంతం వివరాలను అ డిగి తెలుసుకున్నారు. సంఘటనపై ఎవ రూ ఆగ్రహావేశాలకు లోనుకావద్దని గ్రా మస్తులను కోరారు. ఆమె వెంట దుబ్బాక సీఐ రామకృష్ణారెడ్డి, భూంపల్లి ఎస్ఐ ప్రసాద్ తదితరులు ఉన్నారు. కీచక గురువును శిక్షించాలి సిద్దిపేట టౌన్: చిన్నారిని లైంగికంగా వేధించిన పీఈటీని కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు మన్నెకుమార్ సోమవారం ఒక ప్రకటనలో డి మాండ్ చేశారు. అక్బర్పేట వికాస్ పాఠశాలలో చిన్నారిపై జరిగిన ఘటన హేయమైందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. స్కూల్ గుర్తింపు రద్దుకు డిమాండ్ సంగారెడ్డి మున్సిపాలిటీ: చిన్నారిపై లైం గిక వేధింపులకు పాల్పడిన పీఈటీపై ని ర్భయ కేసు నమోదు చేయడంతో పాటు వికాస్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్, రవి అదనపు ఎస్పీ వెంకన్నకు వి నతిపత్రం అందజేశారు. ఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల సాయం దుబ్బాక: లైంగిక వేధింపులు, వికృత చేష్టలకు గురైన చిన్నారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింది రూ. 2 లక్షలను విడుదల చేసిందని రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. సోమవారం దుబ్బాకలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిందితున్ని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా, మంత్రి హరీష్‌రావు మంత్రి స్పందించారన్నారు. -
8వ తరగతి విద్యార్ధి పై PET దాడి