సుష్మాజ్యోతి (ఫైల్)
వెంగళరావునగర్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ టీచర్‌గా పని చేస్తున్న మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం బోరబండలో చోటు చేసుకుంది. పోలీసులు, స్కూల్ సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుమ్మ సుష్మాజ్యోతి (39) పీఈటీ టీచర్‌గా పని చేస్తోంది. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె ఇటీవల యూస్‌ఫ్‌గూడ నుంచి బోరబండసైట్–3లోని నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. విధి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపేది. ఈమె సేవలను గుర్తించిన ప్రభుత్వం గత సెప్టెంబర్ 5న బెస్ట్ పీఈటీ టీచర్‌గా అవార్డుతో సత్కరించింది.
సుష్మా భర్త న్యాయవాదిగా పని చేస్తుండగా, కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. అనారోగ్యం కారణంగా సెలవుపై ఉన్న ఆమె నవంబరు 2న విధుల్లో చేరారు. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందగానే నాట్కో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు యాదగిరి, తోటి సిబ్బంది ప్రశాంత్‌నగర్‌లోని ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని చూసి విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మృతి పట్ల హెచ్‌ఎం, స్కూల్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment